Vicky Vidya Box Office: త్రిప్తి డిమ్రీ మూవీకి షాకింగ్ కలెక్షన్లు.. తొలివారం ఎన్ని కోట్లంటే?
బాలీవుడ్ సెన్సేషన్ తృప్తి డిమ్రీ, రాజ్ కుమార్ రావుతోపాటు విజయ్ రాజ్, మల్లికా షెరావత్, అర్చన పూరన్ సింగ్, షెహనాజ్ గిల్, దలేర్ మహేంది తదితరులు నటించిన ఈ సినిమా అక్టోబర్ 11వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ అయింది. ఈ సినిమా తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్‌తో భారీ వసూళ్లు సాధిస్తున్నది.
ఈ మూవీని ప్రముఖ సినీ నిర్మాణ సంస్థలు టీ సిరీస్ ఫిల్మ్స్, బాలాజీ మోషన్ పిక్చర్స్, వాకూ ఫిల్మ్స్ బ్యానర్లపై భూషణ్ కుమార్, కిషన్ కుమార్, ఏక్తా కపూర్, శోభా కపూర్, విపుల్ డీ షా సంయుక్తంగా రూపొందించారు. ఈ సినిమా బడ్జెట్ ఎంత? బ్రేక్ ఈవెన్ ఎంత? గత 7 రోజులుగా బాక్సాఫీస్ వద్ద సాధిస్తున్న కలెక్షన్లు ఎంత? అనే వివరాల్లోకి వెళితే..

కొత్తగా పెళ్లైన యువ దంపతుల రొమాంటిక్ లవ్ స్టోరి, వారి లైఫ్‌లో వచ్చిన ఓ కొత్త సమస్యను ఎలా డీల్ చేశారనే కథతో రూపొందిన ఈ సినిమాను సుమారుగా 60 కోట్ల రూపాయలతో నిర్మించారు. ఈ సినిమాను సుమారుగా 2000 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. ఈ సినిమా దాదాపు 60 కోట్ల రూపాయల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టింది.
తృప్తి డిమ్రీ సినిమా తొలి రోజు భారీగా కలెక్షన్లు రాబట్టింది. ఈ సినిమా 6 కోట్ల రూపాయలు, రెండో రోజు 7 కోట్ల రూపాయలు, మూడో రోజు 6.5 కోట్ల రూపాయలు, నాలుగో రోజు 2.5 కోట్లు, ఐదో రోజు 2 కోట్ల రూపాయలు, ఆరో రోజు 2 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇక ఏడో రోజు ఈ సినిమా 2 కోట్ల రూపాయలు వసూలు చేసింది.

రాజ్ కుమార్ రావు నటించిన ఈ సినిమా తొలివారం భారీగానే కలెక్షన్లు రాబట్టింది. ఇక రెండో వారంలో కూడా ఇదే జోష్ కొనసాగిస్తే.. బ్రేక్ ఈవెన్ సాధించడానికి అవకాశం ఉంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటి వరకు ఈ మూవీ ఇప్పటి వరకు 30 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇంకా ఈ మూవీ రానున్న రోజుల్లో ఎంత వసూలు చేస్తుందో వేచి చూడాల్సిందే.
త్రిప్తి డిమ్రీ, రాజ్ కుమార్ రావ్ వరుస హిట్లతో దూసుకెళ్తున్నారు. యానిమల్ తర్వాత త్రిప్తి నటించిన బ్యాడ్ న్యూజ్ 100 కోట్లు వసూలు చేసింది. ఆ తర్వాత వచ్చిన వికీ విద్యా మూవీ కూడా భారీ వసూళ్లు రాబడుతున్నది. ఈ సినిమా త్వరలోనే 50 కోట్లకు చేరువయ్యే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











