Karuppu Collections: బాక్సాఫీస్‌పై త్రిషా కృష్ణన్ డామినేషన్.. కరుప్పుతో 2200 కోట్ల రేర్ రికార్డ్

కోలీవుడ్ సూపర్‌స్టార్ సూర్య నటించిన కరుప్పు మూవీ ఆయనకు గట్టి కమ్ బ్యాక్ ఇచ్చించి. ఆర్జే బాలాజీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలతో పాటు భారీ వసూళ్లతో సూర్య స్టార్ పవర్‌ను తెలియజేయడంతో పాటు గత కొంతకాలంగా వరుస ఫ్లాపుల్లో ఆయనకు బూస్ట్ ఇచ్చింది. దాదాపు 300 కోట్లకు పైగా కలెక్షన్స్‌తో ఈ ఏడాది తమిళంలో అతిపెద్ద హిట్‌గా నిలిచింది. అటు ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించిన అగ్రనటి త్రిషా కృష్ణన్‌ను లక్కీ లేడీగా మార్చింది. కరుప్పు హిట్‌తో త్రిష అరుదైన ఘనతను అందుకున్నారు. ఈ వివరాల్లోకి వెళితే..

ఈ జనరేషన్‌లో చిత్ర పరిశ్రమలో హీరోయిన్‌గా కొనసాగడం అంత ఆషామాషీ కాదు. అలాంటి దాదాపు 25 ఏళ్ల కెరీర్‌ను పూర్తి చేసుకోవడంతో పాటు అగ్రనటిగా కొనసాగుతున్నారు. త్రిషతో పాటు కెరీర్ స్టార్ట్ చేసిన పలువురు ముద్దుగుమ్మలు అడ్రస్ లేకుండా పోగా.. ఆమె మాత్రం ఇప్పటికీ నెంబర్ వన్ హీరోయిన్‌గా దూసుకెళ్తున్నారు. 2001లో మిస్ ఇండియా బ్యూటీఫుల్ స్మైల్ అవార్డును అందుకున్న త్రిష.. అంతకుముందే జోడీ చిత్రంలో ఓ చిన్న పాత్రలో కనిపించారు. అనంతరం నీ మనసు నాకు తెలుసు సినిమాతో తెలుగువారిని పలకరించారు.

Trisha Achieves a Rare Milestone with Karuppu Collections Pushes Her Post-Covid Box Office Total Beyond 2200 Crore

ఆ వెంటనే వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, అతడు, పౌర్ణమి, స్టాలిన్, సైనికుడు, కృష్ణ, కింగ్, తీన్‌మార్చ, దమ్ము, ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే వంటి విజయవంతమైన చిత్రాలతో తిరుగులేని ఫాలోయింగ్ సంపాదించారు. తమిళ, తెలుగు భాషల్లో కొన్నాళ్లు నెంబర్‌వన్ హీరోయిన్‌గా వెలుగొందిన ఈ ముద్దుగుమ్మకు కొత్త అమ్మాయిలతో పోటీ ఎదురైంది. దానికి తోడు వయసు పైబడుతూ ఉండటంతో సీనియర్ హీరోలతోనే చేయాల్సి వచ్చింది. ఈ దశలో తాను పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించి నిశ్చితార్ధంతో షాకిచ్చింది, కానీ ఏం జరిగిందో ఏమో కానీ ఈ ఎంగేజ్‌మెంట్ క్యాన్సిల్ అయ్యింది.

ఆ తర్వాత సెకండ్ ఇన్సింగ్స్ స్టార్ట్ చేసిన త్రిష వరుస హిట్స్‌తో కలకలం రేపారు. పొన్నియన్ సెల్వన్ సిరీస్, ది రోడ్, లియో, గోట్, ఐడెంటీటీ, విదాముయార్చి, గుడ్ బ్యాడ్ అగ్లీ, థగ్ లైఫ్ ఇప్పుడు కరుప్పుతో బ్లాక్‌బస్టర్స్ అందించారు. ప్రస్తుతం విశ్వంభర, రామ్ సినిమాలలో ఆమె నటిస్తున్నారు. 43 ఏళ్ల వయసులోనూ ఈ స్థాయిలో రెచ్చిపోతూ కుర్ర హీరోయిన్లకు సవాల్ విసురుతున్నారు త్రిషా కృష్ణన్. ఆమెతో సినిమాలు చేసేందుకు టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్‌లలో మేకర్స్ క్యూకడుతున్నారు. కానీ త్రిష మాత్రం సెలెక్టివ్‌గా సినిమాలు చేసుకుంటూ పోతున్నారు.

తాజాగా కరుప్పు బ్లాక్‌బస్టర్‌తో త్రిష అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నారు. కోవిడ్ అనంతరం ఆమె నటించిన సినిమాలు వరుస బ్లాక్ బస్టర్స్ కావడంతో పాటు దాదాపు 2200 కోట్ల వసూళ్లను సాధించాయి. కోవిడ్ తర్వాత త్రిష నటించిన 10 సినిమాలు విడుదల కాగా.. అందులో 5 సినిమాలు వరల్డ్ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించాయి. తాజా చిత్రం కరుప్పు కలెక్షన్స్ (310 కోట్ల రూపాయలు)తో ఆమె 2200 కోట్ల రూపాయల మైలురాయిని క్రాస్ చేశారు.

కోవిడ్ అనంతరం పొన్నియన్ సెల్వన్‌ పార్ట్ 1తో (489 కోట్ల రూపాయలు) మొదలైన త్రిష వసూళ్ల వేట ఆ తర్వాత రాంగీ (11 కోట్ల రూపాయలు), పొన్నియన్ సెల్వన్ పార్ట్ 2 (344.71 కోట్ల రూపాయలు), ది రోడ్ (2 కోట్ల రూపాయలు), లియో (606.42 కోట్ల రూపాయలు), ఐడెంటిటీ (17.26 కోట్ల రూపాయలు), విదాముయార్చి (135.23 కోట్ల రూపాయలు), గుడ్ బ్యాడ్ అగ్లీ (248.94 కోట్ల రూపాయలు), థగ్ లైఫ్ (98.02 కోట్ల రూపాయలు), కరుప్పు (310.77 కోట్ల రూపాయలు)తో కలిపి ఇప్పటి వరకు 2263.86 కోట్ల రూపాయలు వసూలు చేశాయి. కరుప్పు కనుక మెరుగైన ప్రదర్శన చేసుంటే 2300 కోట్ల మార్క్ క్రాస్ చేసే అవకాశం ఉండేదని ట్రేడ్ పండితులు అంటున్నారు. మొత్తానికి 43 ఏళ్ల వయసులోనూ త్రిష.. కుర్ర హీరోయిన్లు కూడా సాధించలేని విజయాలను తన ఖాతాలో వేసుకుంటున్నారు.

Read more about: trisha krishnan Karuppu suriya
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X