బాక్సాఫీస్ కా క్వీన్ త్రిష.. లేటెస్ట్ టాప్ 5 బ్లాక్‌బస్టర్స్‌ ఇవే

Trisha Krishnan: సౌత్ ఇండియన్ బ్యూటీ, స్టార్ హీరోయిన్ త్రిష గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టాలీవుడ్, కోలీవుడ్ రెండింట్లోనూ స్టార్ హీరోయిన్‌గా దశాబ్దాలుగా రాణిస్తున్న త్రిష, ఇప్పుడు మళ్లీ బాక్సాఫీస్ వద్ద తన స్టామినా చూపిస్తోంది. ఒకప్పుడు చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ వంటి టాప్ హీరోల సరసన నటించి సూపర్ హిట్స్ అందుకున్న ఆమె, ఇప్పుడు ఎక్కువగా తమిళ్ సినిమాలపై ఫోకస్ పెట్టి వరుస ప్రాజెక్టులతో బిజీగా మారింది.త్రిష కెరీర్‌లో‌ లెటెస్ట్ టాప్ 5 బెస్ట్ మూవీస్ ఇవే..

కరుప్పు (Karuppu):
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, స్టార్ హీరోయిన్ త్రిష జంటగా నటించిన లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ కరుప్పు (Karuppu). ఈ మూవీ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. దర్శకుడు ఆర్జే బాలాజీ తెరకెక్కించిన ఈ మూవీ మే 15న భారీ అంచనాల మధ్య విడుదలైంది. ఈ సినిమాలో త్రిష హీరోయిన్‌గా నటించి కీలక పాత్ర పోషించింది. సూర్య-త్రిష జోడీకి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ లభిస్తోంది. మొదటి వీకెండ్‌లోనే భారీ వసూళ్లు సాధించిన 'కరుప్పు', వర్కింగ్ డేస్‌లో కూడా స్టెడీగా కలెక్షన్లు రాబడుతూ ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. 11 రోజుల్లోనే ఇండియాలో రూ. 150 కోట్లకు పైగా నెట్ కలెక్షన్ సాధించగా, ప్రపంచవ్యాప్తంగా రూ. 247 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు నమోదు చేసింది. ప్రస్తుతం రూ. 250 కోట్ల మార్క్ దాటేందుకు సిద్ధంగా ఉంది. ఇదే ట్రెండ్ కొనసాగితే, ఈ సినిమా రూ.300 కోట్ల క్లబ్‌లో చేరే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Trisha Krishnan Top 5 Latest Blockbuster Movies From Karuppu to Leo Box Office Records

గుడ్ బ్యాడ్ అగ్లీ (Good Bad Ugly)
త్రిష కెరీర్ లో మరో బెస్ట్ మూవీ గుడ్ బ్యాడ్ అగ్లీ (Good Bad Ugly). కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్, త్రిష జంటగా నటించగా, దర్శకుడు అధిక్ రవిచంద్రన్ ఈ సినిమాను తెరకెక్కించారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ భారీ కలెక్షన్స్ అందుకుంది. ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం.. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ. 258 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టింది. ఇందులో తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు రూ.6 కోట్ల మధ్య గ్రాస్ కలెక్షన్లు సాధించినట్లు ట్రేడ్ రిపోర్ట్స్ చెబుతున్నాయి.

'పొన్నియిన్ సెల్వన్: 1 (Ponniyin Selvan 1)
త్రిష కెరీర్ లో మరో బెస్ట్ మూవీ 'పొన్నియిన్ సెల్వన్: పార్ట్ 1'. ఈ సినిమాను దర్శక దిగ్గజం మణిరత్నం తెరకెక్కించారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా అద్బుత విజయాన్ని అందుకుంది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ. 496 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించి కోలీవుడ్‌లో హిస్టారిక్‌బస్టర్‌గా బ్లాక్‌గా నిలిచింది. భారతదేశంలోనే రూ.327 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టగా, తమిళనాడులో రూ. 222 కోట్లకు పైగా కలెక్షన్లు అందుకోవడం విశేషం. ఓవర్సీస్ లో కూడా ఎవరూ ఊహించని విధంగా రూ. 169 కోట్లకు పైగా వసూళ్లు సాధించి గ్లోబల్ రేంజ్‌ను ప్రూవ్ చేసింది. త్రిష ఈ సినిమాలో కీలక పాత్రలో తన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా ఆమె స్క్రీన్ ప్రెజెన్స్, రాయల్టీ లుక్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.

'పొన్నియిన్ సెల్వన్: II' (Ponniyin Selvan 2)
'పొన్నియిన్ సెల్వన్' కథకు కొనసాగింపుగా వచ్చిన పార్ట్ 2 కూడా భారీ కలెక్షన్స్ అందుకుంది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ. 345 కోట్ల గ్రాస్ కలెక్షన్లు అందుకుంది. ఇందులో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ. 215 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టగా, ఓవర్సీస్ మార్కెట్‌లో రూ. 130 కోట్లకు పైగా కలెక్షన్లు. మొదటి భాగంతో పోల్చితే..కొంత తక్కువ వసూళ్లు అందుకున్న.. స్టోరీ కొనసాగింపు కారణంగా ప్రేక్షకుల్లో ఆసక్తి నిలబెట్టింది. త్రిష పాత్ర ఈ పార్ట్‌లో మరింత ప్రాధాన్యతనిస్తుంది. ఎమోషనల్ డెప్ట్, స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఆమె నటనకు ప్రశంసలు లభించాయి.

'లియో' (Leo)
దళపతి విజయ్, త్రిష జంటగా నటించిన సినిమా 'లియో'. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ ఊపేసింది. దర్శకుడు లోకేష్ కనగారాజ్ తెరకెక్కించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ప్రపంచవ్యాప్తంగా రూ.623 కోట్లకు పైగా వసూళ్లు చేసింది. ఇందులో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ. 340 కోట్లకు పైగా నెట్ కలెక్షన్లు సాధించగా, ఓవర్సీస్‌లో రూ. 200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ సినిమా 2023లో తమిళంలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది.

Read more about: Karuppu ponniyin selvan trisha
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X