త్రిష కోసమే బెల్లంకొండ డబ్బింగ్ రైట్స్
త్రిష నటిస్తున్న బాడీగార్డ్ రీమేక్ కి బెల్లంకొండ సురేష్ నిర్మాత అనే సంగతి తెలిసిందే. ఇప్పుడు బెల్లంకొండ సురేష్ ఆమె నటించిన తమిళ చిత్రం మంగత్తా డబ్బింగ్ రైట్స్ ని తీసుకున్నాడు. తెలుగులో ఆమెకున్న క్రేజ్ ని క్యాష్ చేసుకునేందుకు కాను ఈ చిత్రాన్నిగ్లాంబ్లర్ టైటిల్ తో విడుదల చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ చిత్రం రైట్స్ ని ఫాన్సీ రైట్స్ కు కొనుగోలు చేసారు బెల్లంకొండ. సెప్టెంబర్ 9వ తేదీన ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నాడు. ఇక మొన్న బుధవారం భారీ ఓపెనింగ్స్ తో ఈ చిత్రం విడుదలైంది. ఇక కాంచన, కందిరీగ హిట్లతో స్పీడు మీదుయన్న బెల్లంకొండ ఈ సినిమా కూడా తనకు కలిసి వస్తుందని భావిస్తున్నారు.
ప్రేమలేఖ అజిత్ హీరోగా చేసిన ఈ చిత్రానికి యవన్ శంకర్ రాజా సంగీతం అందించారు. వైభవ్ మరో కీలకమైన పాత్ర చేసిన ఈ చిత్రాన్ని వెంకట్ ప్రభు దర్శకత్వం వహించారు. వీటితో పాటు ఆమె బాలకృష్ణ, బి గోపాల్ కాంబినేషన్ లో త్వరలో తెరకెక్కనున్న చిత్రం కోసం కూడా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ చిత్రం టైటిల్ హరహర మహాదేవ. వీటితో పాటు విశాల్ సినిమాను కూడా ఓకే చేసింది.ఇక త్రిష హఠాత్తుగా విశాల్ ప్రాజెక్టుని ఎందుకు ఓకే చేసింది అంటే.. దర్శకుడు తిరు చెప్పిన కథ నచ్చింది అంటోంది.ఆ కథ విని ధ్రిల్లయ్యానని అంటోంది.


Click it and Unblock the Notifications











