»   » త్రివిక్రమ్‌ 'అ ఆ' : లాంచింగ్ డేట్, రిలీజ్ డేట్ ఖరారు

త్రివిక్రమ్‌ 'అ ఆ' : లాంచింగ్ డేట్, రిలీజ్ డేట్ ఖరారు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: త్రివిక్రమ్‌ దర్శకత్వంలో నితిన్‌ హీరోగా ఓ చిత్రం తెరకెక్కబోతోంది. సమంత హీరోయిన్. హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఈ నెల 24న లాంచ్ చేస్తున్నారు. అలాగే అక్టోబర్ 5 నుంచి చిత్రీకరణ ప్రారంభం కానున్న ఈ చిత్రానికి 'అ ఆ' అనే పేరును ఖరారు చేశారు. 'అనసూయ రామలింగం వర్సెస్‌ ఆనంద్‌ విహారి' అనేది ఉపశీర్షిక.

అలాగే చిత్రాన్ని వచ్చే జనవరి 16న సంక్రాంతి కానుకగా విడుదల చేయటానికి నిర్ణయించారు. ఇందులో మరో హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్‌ని ఎంపిక చేసుకొన్నారు. మలయాళంలో ఘన విజయం సాధించిన 'ప్రేమమ్‌'తో పేరు సంపాదించింది అనుపమ.

 Trivikram - Nithiin's A..Aa: launched this 24th

నిర్మాత మాట్లాడుతూ ''త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఇదివరకు 'జులాయి', 'సన్నాఫ్‌ సత్యమూర్తి' చిత్రాల్ని నిర్మించాం. మా కలయికలో మూడో చిత్రంగా 'అ ఆ' రూపొందుతోంది. తొలిసారి నితిన్‌ సరసన సమంత నటిస్తోంది. వచ్చే సంక్రాంతికి చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం'' అన్నారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ఈ చిత్రం కు సంగీతం: అనిరుధ్‌, ఛాయాగ్రహణం: నటరాజ్‌ సుబ్రమణియన్‌, కళ: రాజీవన్‌, కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు, సౌండ్‌ డిజైనింగ్‌: విష్ణుగోవింద్‌, శ్రీశంకర్‌, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్...పిడివి ప్రసాద్. ఈ సినిమాని శ్రీమతి మమత సమర్పిస్తున్నారు.

English summary
‎Trivikram‬ , nithiin,Samanthaprabh 's ARvAV‬ (A.. Aa) to be launched this 24th. On to floors from Oct 5, to Release Sankranthi '16. Noted director Trivikram, is going to make a movie under the banner of 'Haarika and Hassine Creations', and he titled the film as "A...Aa" , the film has a tag line "Anasuya Ramalingam Versus Anand Vihari",
Please Wait while comments are loading...