Mahesh babu సినిమాలతో ఆదాయం పెంచుకుంటున్న రాజమౌళి, త్రివిక్రమ్.. అత్యదిక రెమ్యునరేషన్!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో ప్రస్తుతం త్రివిక్రమ ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఆ తర్వాత రాజమౌళి కూడా మరొక బిగ్గెస్ట్ ఫ్యాన్ ఇండియా సినిమాను చేయబోతున్నాడు. ఈ రెండు ప్రాజెక్టులపై కూడా అంచనాలైతే మామూలుగా లేవు. తప్పకుండా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు క్రియేట్ అవుతాయి అని చెప్పవచ్చు. అయితే మహేష్ బాబు సినిమాల ద్వారా దర్శకులు కూడా వారి జీవితంలో అత్యధిక లాభాలను అందుకునే విధంగా ప్లాన్ చేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఇక మొత్తంగా వారికి ఎంత మేరకు ఆదాయం పెరగనుంది అనే వివరాల్లోకి వెళితే..

మహేష్ దర్శకులకు
మహేష్ బాబుతో ఇటీవల కాలంలో ఏ దర్శకుడు సినిమా చేసిన కూడా వారికి కెరీర్ లోనే అత్యధిక స్థాయిలో పారితోషికం అందుకునే విధంగా డీల్ సెట్ చేసుకుంటున్నారు. ఇటీవల సర్కారు వారి పాటను డైరెక్ట్ చేసిన దర్శకుడు పరుశురామ్ కూడా తన కెరీర్లోనే అత్యధిక స్థాయిలో పారితోషికం అందుకున్నాడు. అంతకుముందు అనిల్ రావిపూడి కొరటాల శివ కూడా మహేష్ బాబు సినిమాల ద్వారానే అత్యధిక స్థాయిలో రెమ్యునరేషన్స్ అందుకున్నారు.

ముందుగా త్రివిక్రమ్ సినిమా
ఇక ఇప్పుడు త్రివిక్రమ్ రాజమౌళి కూడా మహేష్ బాబుతో సినిమాలు సెట్ చేసుకున్న విషయం తెలిసిందే. మొదట త్రివిక్రమ్ సినిమా పూర్తి కానుంది. ఇప్పటికే ఒక షెడ్యూల్ కూడా పూర్తి చేశారు. యాక్షన్ డ్రామాగా ప్రేక్షకుల ముందు కు రాబోతున్న ఆ సినిమా బిజినెస్ లెక్కలు ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా వైరల్ గా మారుతున్నాయి. తప్పకుండా సినిమా సరి కొత్త రికార్డులు క్రియేట్ చేస్తుంది అని పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ అవుతున్నాయి.

అంతకంటే ఎక్కువ
సాధారణంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇటీవల కాలంలో రెమ్యునరేషన్ తీసుకోకుండా బడ్జెట్ ను బట్టి అలాగే ప్రాఫుట్స్ ను బట్టి షేర్ తీసుకుంటున్నాడు. అల.. వైకుంటపురములో సినిమా బాక్సాఫీస్ వద్ద 200 కోట్లు కలెక్ట్ చేయడంతో ఆ సినిమాకు త్రివిక్రమ్ భారీ స్థాయిలో అయితే ప్రాఫిట్ లభించింది. ఇక ఇప్పుడు మహేష్ బాబు సినిమా కోసం కూడా అంతకంటే ఎక్కువ స్థాయిలోనే ఆదాయం వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.

సక్సెస్ అయితే..
మహేష్ త్రివిక్రమ్ సినిమా అనగానే మార్కెట్లో మంచి డిమాండ్ అయితే ఏర్పడింది. ఇక ఈ సినిమాకు మహేష్ బాబు 70 కోట్లకు పైగా రెమ్యునరేషన్ అందుకుంటూ ఉండగా ఈ సినిమా సక్సెస్ అయితే టేబుల్ ప్రాఫిట్ చాలా వరకు 70 కోట్ల వరకు వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక బాక్స్ ఆఫీస్ వద్ద ఏ మాత్రం క్లిక్ అయినా కూడా త్రివిక్రమ్ కూడా 60 కోట్లకు పైగా ఆదాయం అందుకోవచ్చు అని తెలుస్తుంది.

రాజమౌళికి RRR కంటే ఎక్కువే..
ఇక రాజమౌళితో బిగ్గెస్ట్ ఫ్యాన్ ఇండియా సినిమా చేయబోతున్న మహేష్ బాబు ఆ సినిమాకు కూడా ఈజీగా 80 కోట్ల లేదా 90 కోట్లు రెమ్యునరేషన్ అందుకున్నా కూడా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు అనే కామెంట్స్ అయితే వినిపిస్తున్నాయి. ఇక రాజమౌళి దాదాపు అదే తరహాలో ప్రాఫిట్స్ లో షేర్ అందుకునే అవకాశం అయితే ఉంది. RRR సినిమా కూడా సక్సెస్ కావడంతో ఇప్పుడు రాజమౌళి మహేష్ బాబు సినిమా కోసం ఇండియా లోనే మరోసారి నెంబర్ వన్ స్థాయిలో ఆదాయం అయితే అందుకోబోతున్నాడు.


Click it and Unblock the Notifications











