Tu Jhoothi Main Makkaar Collections రికార్డు సృష్టించిన రణ్‌బీర్ కపూర్ మూవీ.. 200 కోట్లకు చేరువగా!
బాలీవుడ్ స్టార్ హీరో, హీరోయిన్లు రణ్‌బీర్ కపూర్, శ్రద్దా కపూర్ జంటగా నటించిన చిత్రం తూ జూటీ మై మక్కర్. ప్రముఖ దర్శకుడు లవ్ రంజన్ డైరెక్షన్‌లో అంకుర్ గార్గ్ ఈ సినిమాను నిర్మించారు. టీ సిరీస్, లవ్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం మార్చి 8వ తేదిన ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. అయితే ఈ సినిమా అన్ని ప్రతికూలతలను అధిగమించి 100 కోట్ల క్లబ్‌లో చేరడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ సినిమా 11 రోజుల కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

మూవీ బడ్జెట్ ఎంతంటే?.
తూ జూటీ మై మక్కర్ సినిమా బడ్జెట్ విషయానికి వస్తే.. భారీగా నటీనటులతో ఈ సినిమాను తెరకెక్కించారు. డింపుల్ కాపాడియా, బోని కపూర్, అనుభవ్ సింగ్ నటించారు. కార్తీక్ ఆర్యన్, నుస్రత్ బరుచా అతిథి పాత్రలో నటించారు. ఈ సినిమాను దాదాపు 200 కోట్ల బడ్జెట్‌తో రూపొందించారు. ఈ సినిమా బిజినెస్ కూడా భారీగానే జరిగింది. యష్ రాజ్ ఫిలింస్ ఈ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేసింది.

మిక్స్‌డ్ టాక్‌తో రణ్ బీర్ కపూర్ మూవీ
తూ జూటీ మై మక్కర్ చిత్రం రిలీజ్ రోజు నుంచి మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకొన్నది. అయితే ఉత్తరాదిలో మల్టీప్లెక్స్‌లో సినిమాను భారీగా ఆదరించారు. బీ సెంటర్లలో కూడా మంచి స్పందన వ్యక్తమైంది. లవ్, ఎమోషనల్, ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం మెల్ల మెల్లగా ఆక్యుపెన్సీని నమోదు చేసుకొన్నది. దాంతో భారీ వసూళ్లు నమోదైంది.

తొలివారం భారీగా తూ జూటీ మై మక్కర్
తూ జూటీ మై మక్కర్ చిత్రం తొలి వారం భారీగా నిలకడగా వసూళ్లను రాబట్టింది. తొలి రోజు 16 కోట్లు, రెండో రోజు 11 కోట్లు, మూడో రోజు 11 కోట్లు, నాలుగో రోజు 17 కోట్లు, ఐదో రోజు 17 కోట్లు రాబట్టింది. తొలివారం ముగిసే సమయానికి ఈ చిత్రం 93 కోట్ల కలెక్షన్లను వసూలు చేసింది.

రెండోవారంలో క్షీణించిన కలెక్షన్లు
తూ జూటీ మై మక్కర్ చిత్రం తొలివారంలో వసూళ్లు తగ్గుముఖం పట్టాయి. కానీ ప్రతీ రోజు 3 లేదా 4 కోట్లు మధ్య వసూళ్లు రాబడుతూ బాక్సాఫీస్ వద్ద నిలకడను ప్రదర్శించింది. దాంతో ఈ చిత్రం 100 కోట్ల క్లబ్‌లో చేరింది. ఇటీవల కాలంలో బాలీవుడ్‌లో 100 కోట్ల క్లబ్‌లో చేరిన చిత్రంగా ఘనతను సాధించింది.

11వ రోజు తూ జూటీ మై మక్కర్
తూ జూటీ మై మక్కర్ చిత్రం 11వ రోజున కూడా మోస్తారు ఆక్యుపెన్సీ నమోదు చేసింది. ఓవరాల్‌గా 25 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది. ఈ చిత్రం 11వ రోజున 6 కోట్లు మేర వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం 102 కోట్లు నమోదు చేసింది. ఇంకా ఈ చిత్రం రెండోవారంలో థియేట్రికల్ రన్ కొనసాగించే అవకాశం ఉంది.

ప్రపంచవ్యాప్తంగా తూ జూటీ కలెక్షన్లు
తూ జూటీ మై మక్కర్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 143 కోట్ల గ్రాస్ వసూళ్లను, 102 కోట్లకుపైగా షేర్‌ను సాధించింది. ఓవర్సీస్‌లో 30 కోట్ల కలెక్షన్లను రాబట్టడం విశేషంగా మారిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.


Click it and Unblock the Notifications











