twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Tuck Jagadish తెచ్చిన లాభాలు.. బాక్సాఫీస్ కంటే ఎక్కువ ప్రాఫిట్స్!

    |

    కరోనా కష్టకాలంలో చిన్న సినిమాలు పెద్ద సినిమాలు అని తేడాలేకుండా డైరెక్ట్ గా ఓటీటీ లోనే విడుదలకు సిద్ధం అవుతున్నాయి. ఓటీటీ హక్కు లు కాస్త టెంప్టింగ్ గా ఉన్నాసరే నిర్మాతలు ఏమాత్రం ఆలోచించకుండా ఓకే చెప్పేస్తున్నారు. ఇప్పటివరకు కొన్ని సినిమాలు మాత్రమే డైరెక్ట్ గా థియేటర్ బిజినెస్ కు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాయి. అయితే మరికొన్ని సినిమాలు మాత్రం థియేటర్స్ పై ఆశతో ఏడాది పాటు ఎదురు చూసి ఇప్పుడు ఓటీటీ ప్లాట్ ఫామ్ లోకి వెళుతున్నాయి.

    నేచురల్ స్టార్ నాని కూడా మరో సినిమాను అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేసేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. నాని నటించిన V సినిమా ఇదివరకే అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు టక్ జగదీష్ కూడా అమెజాన్ ప్రైమ్ లో ని డైరెక్ట్ గా విడుదలవుతోంది.

    నష్ట పోకుండా ఉండడానికి

    నష్ట పోకుండా ఉండడానికి

    ఒక విధంగా ఈ వార్త ఫ్యామిలీ ఆడియన్స్ కు తీవ్ర నిరాశకు గురి చేసే విషయమే అయినప్పటికీ నిర్మాత నష్ట పోకుండా ఉండడానికి తప్పలేదు. నేచురల్ స్టార్ నాని ఎలాంటి సినిమా చేసినా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద మినిమం బాక్సాఫీస్ కలెక్షన్స్ ను అనుకోవడం కామన్. మీడియం రేంజ్ హీరోల్లో నాని ఒక్కడే టాప్ టెన్ లో ఉన్నాడని చెప్పవచ్చు. చాలా వరకు నిర్మాతలు సినిమా చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.

    ఎందుకంటే అతని సినిమాలకు పెట్టిన పెట్టుబడి చాలా తొందరగానే వచ్చేస్తుంది చిన్న సినిమా అయినా సరే నాని చేతిలో పెడితే డబుల్ ప్రాఫిట్స్ అందించగలరని ఒక ప్రత్యేకమైన నమ్మకం అయితే ఉంది. ఇక శివ నిర్వాణ దర్శకత్వంలో చేసిన టక్ జగదీష్ సినిమా థియేట్రికల్ రిలీజ్ కాకపోయినప్పటికీ డిజిటల్ వరల్డ్ లో మంచి బిజినెస్ చేసింది. గతంలో వీరి కాంబినేషన్ లో వచ్చిన నిన్ను కోరి బాక్సాఫీస్ వద్ద సాలీడ్ వసూళ్లను అందుకున్న విషయం తెలిసిందే.

    నాన్ థియేట్రికల్ గానే..

    నాన్ థియేట్రికల్ గానే..

    నాన్ థియేట్రికల్ గానే ఈ సినిమాకు భారీ స్థాయిలో లాభాలు వచ్చాయి. అమెజాన్ ప్రైమ్ వీడియో టక్ జగదీష్ సినిమాను డైరెక్ట్ రిలీజ్ కోసమని మొదట 30 కోట్ల వరకు ఆఫర్ చేసింది. అయితే ఈ సినిమాను 27 కోట్ల బడ్జెట్ తో నిర్మించినట్లు సమాచారం. అయితే నిర్మాతలు మాత్రం అమెజాన్ ప్రైమ్ మొదటిసారి ఆ ఆఫర్ పై అయితే అంతగా ఇంట్రెస్ట్ చూపలేదు. ఇక ఆ తర్వాత ఆ నెంబర్ 37 కోట్ల వరకు రావడంతో ఇంట్రెస్ట్ చూపించక తప్పలేదు.

    థియేటర్స్ బిజినెస్ మళ్లీ అందుబాటులోకి వస్తుందని నిన్నటి వరకు నిర్మాతలు కాస్త నమ్మకంతోనే ఉన్నారు. కానీ ఇటీవల విడుదలైన చిన్న సినిమాల కలెక్షన్స్ దారుణంగా పడిపోవడంతో జనాలు ఇంకా థియేటర్స్ కు అలవాటు పడలేదని నిర్మాతలైతే కొంత ఆలోచనకు వచ్చారు. అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా థియేటర్స్ రేట్ టికెట్ రేట్లు కూడా భారీగా తగ్గడం తో రిస్క్ చేయవద్దు అని డిసైడ్ అయ్యారు.

    నాని కెరీర్లో ఇది బెస్ట్ రికార్డు

    నాని కెరీర్లో ఇది బెస్ట్ రికార్డు

    సురేష్ బాబు లాంటి నిర్మాతనే ఇటీవల నారప్ప సినిమా విషయంలో వెనక్కి తగ్గిన విషయం తెలిసిందే. ఇక నాని నిర్మాతలు కూడా అదే దారిలోకి వచ్చారు. చేసేదేమీలేక అమెజాన్ ప్రైమ్ కు సింగిల్ సిట్టింగ్ లోనే దాదాపు సిగ్నల్ ఇచ్చేశారు. ఇక సినిమా ఈ వినాయకచవితి సందర్భంగా విడుదల అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. శాటిలైట్ హక్కులను మొదట జీ తెలుగు జెమినీ టీవీ దక్కించుకోవడానికి ప్రయత్నాలు బాగానే చేశాయి... అయితే స్టార్ మా 7.5 కోట్లకు ఆఫర్ చేయడంతో నిర్మాతలు సినిమాను వారి చేతిలో పెట్టేసారు. నాని కెరీర్లో ఇది ఒక బెస్ట్ రికార్డు అని చెప్పవచ్చు.

    దాదాపు 20 కోట్లకు పైగా లాభం

    దాదాపు 20 కోట్లకు పైగా లాభం

    అలాగే ఈ సినిమా ఆడియో హక్కులను ఆదిత్య మ్యూజిక్ రెండు కోట్లకు దక్కించుకుంది. తమన్ ఈ సినిమాకి మ్యూజిక్ అందించిన విషయం తెలిసిందే. ఇక నాని హిందీ డబ్బింగ్ సినిమాలకు ఇటీవల కాలంలో భారీగా డిమాండ్ పెరిగింది. టక్ జగదీష్ హిందీ డబ్బింగ్ రైట్స్ 5 కోట్లకు అమ్ముడైనట్లు సమాచారం. సినిమా మొత్తం నాన్ థియేట్రికల్ గా 51.50 కోట్ల బిజినెస్ చేసింది. అంటే నిర్మాతలకు దాదాపు 20 కోట్లకు పైగా లాభం వచ్చిందని చెప్పవచ్చు. నాని కెరీర్ లోనే ఇదే బెస్ట్ నాన్ థియేట్రికల్ బిజినెస్. గతంలో నాని కెరీర్లో ఏ సినిమా కూడా ఈ స్థాయిలో భారీ లాభాలను లేదు.

    Recommended Video

    Kiran Abbavaram Birthday Special Interview | SR Kalyanamandapam | Sammathame
    బోనస్ లాంటి లాభాలను కూడా

    బోనస్ లాంటి లాభాలను కూడా

    ఒక విధంగా థియేటర్ బిజినెస్ పై అనుమానాలు వస్తున్న తరుణంలో నాని స్టార్ హోదా నిర్మాతలను సేఫ్ జోన్ లో పడేయడమే కాకుండా బోనస్ లాంటి లాభాలను కూడా అందించింది. ఇక ఈ సినిమా అనంతరం నాని మరో మూడు సినిమాలను లైన్ లో పెట్టనున్నారు. వాటిని మాత్రం ఎలాగైనా థియేటర్ లోనే విడుదల చేసి లాభాలు అందుకోవాలని అనుకుంటున్నాడు.

    ట్యాక్సీవాలా దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో శ్యామ్ సింగరాయ్ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అలాగే బ్రోచేవారెవరురా దర్శకుడు వివేక్ ఆత్రేయతో 'అంటే సుందరినికి..' అనే కామెడీ ఎంటర్టైనర్ సినిమా చేస్తున్నాడు. వీటితో పాటు మరో సినిమా కూడా త్వరలోనే స్టార్ట్ కానుంది. మరి ఈ సినిమాలతో నాని తన బాక్సాఫీస్ స్టామినాను ఎంతవరకు పెంచుకుంటాడు చూడాలి.

    English summary
    Tuck Jagadish total non theatrical bussiness and profits. Tuck Jagadish total non theatrical bussiness and profits, After tuck jagadish ott release another films also coming same way. Right now it seems that Nani’s new movie is also likely to give the green signal to the Amazon Prime offer. If it is released in OTT, it seems that most of the movies are likely to be released as well.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X