Tumbbad Box Office: రికార్డు కలెక్షన్లతో తుంబాడ్ సంచలనం.. బాలీవుడ్‌ ట్రెండ్ సెట్టర్‌గా.. ఎన్ని కోట్లంటే?

టాలీవుడ్‌లో రెగ్యులర్‌గా రిలీజ్ అయ్యే కొత్త సినిమాల కంటే.. గతంలో విడుదలైన స్టార్ హీరోల సినిమాలకు భారీ డిమాండ్ కనిపిస్తున్నది. తెలుగులో స్టార్ హీరోల సినిమాల రీ రిలీజ్‌లను ఓ ఉత్సవంలా ప్రదర్శిస్తున్నారు. ఇలాంటి ట్రెండ్ బాలీవుడ్‌కు కూడా పాకింది. అయితే తాజాగా బాలీవుడ్‌లో కొత్త సినిమాలు లేకపోవడంతో పాత సినిమాలను రీ రిలీజ్ చేసి ప్రేక్షకులకు వినోదంతోపాటు కొత్త అనుభూతిని పంచే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో రిలీజైన తుంబాడ్ చిత్రం రికార్డు క్రియేట్ చేసింది. ఆ వివారాల్లోకి వెళితే..

ఇటీవల బాలీవుడ్‌లో రీ రిలీజ్ ట్రెండ్ మొదలైంది. ఈ మధ్య రణ్ బీర్ సింగ్ నటించిన రాక్ స్టార్, మాధవన్ నటించిన రెహనా హూ తేరే దిల్ మే, లైలా మజ్ను చిత్రాలు రిలీజ్ అయ్యాయి. అయితే ఇప్పటి వరకు అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా 10 కోట్ల రూపాయలతో రాక్ స్టార్ నిలిచింది.

Tumbbad Movie Re Release Day 5 Collections in India

అయితే గత శుక్రవారం సెప్టెంబర్ 12వ తేదీన రిలీజైన తుంబాడ్ చిత్రం మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గతంలో స్ట్రెయిట్ రిలీజ్‌గా వచ్చినప్పడు ఈ సినిమా సరైన కలెక్షన్లు రాబట్టలేక ఫ్లాప్ చిత్రంగా నిలిచింది. కానీ లాక్‌డౌన్‌లో ఓటీటీలో ఈ సినిమాకు హ్యూజ్ ఫాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ సినిమాను రీరీలీజ్ చేశారు.

తుంబాడ్ చిత్రం రీ రిలీజ్ అవుతుందనే వార్తతో ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా పెరిగాయి. ఈ సినిమాను థియేటర్‌లో ఎక్స్‌పీరియెన్స్ చేయాలనుకొన్న ప్రేక్షకులు భారీగా క్యూ కట్టారు. దాంతో తొలి రోజు నుంచే భారీ వసూళ్లు నమోదు అయ్యాయి. తొలి రోజు ఈ సినిమా 1.65 కోట్ల రూపాయల కలెక్షన్లతో బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టింది.

Tumbbad Movie Re Release Day 5 Collections in India

ఇక ఈ సినిమా రెండో రోజు 2.65 కోట్ల రూపాయలు రాబట్టడం ద్వారా మొదటి రోజు కంటే ఎక్కువగా వసూళ్లను నమోదు చేసింది. తొలి రెండు రోజుల కంటే ఎక్కువగా అంటే మూడో రోజు 3 కోట్ల రూపాయలు, నాలుగ రోజు 1.66 కోట్లు, ఐదో రోజు 1.42 కోట్లు వసూళ్లతో 12.11 కోట్లు చేసింది. తద్వారా ఈ సినిమా బాలీవుడ్‌లో అత్యధికంగా కలెక్ట్ చేసిన రీ రిలీజ్ సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది.

తుంబాడ్‌ మూవీకి దేశవ్యాప్తంగా భారీ వసూళ్లు సాధించడంతో పాత క్లాసిక్ సినిమాలు, అమితాబ్ లాంటి లెజెండరీ యాక్టర్ల సినిమాలను మళ్లీ థియేటర్లలోకి ప్రదర్శించే ఏర్పాట్లు చేస్తున్నారు. పాత చిత్రాల రీళ్లను దుమ్ము దులిపి లేటెస్ట్ టెక్నాలజీతో 4K తో రీ రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

More from Filmibeat

Read more about: tumbbad box office
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X