Tumbbad Re Release Box Office: అప్పుడు తుంబాడ్ ఫ్లాప్.. ఇప్పుడు సూపర్ హిట్.. రీ రిలీజ్‌కు భారీ కలెక్షన్లు!
తెలుగు సినిమా ఇండస్ట్రీలో రీ రిలీజ్ కల్చర్ భారీగా పెరిగిపోయిన విషయం తెలిసిందే. అయితే ఈ సంస్కృతి ఇప్పుడిప్పుడే బాలీవుడ్‌ను కూడా తాకింది. ఇటీవల హిందీలో రీ రిలీజైన కొన్ని సినిమాలకు భారీ స్పందన లభించడంతో ఈ దారిలోకి మరికొన్ని సినిమాలను ప్లాన్ చేస్తున్నారు. అయితే ఇటీవల రిలీజైన తుంబాడ్ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధిస్తున్నది. ఈ సినిమా రి రిలీజ్ ద్వారా ఎంత వసూలు చేసిందనే వివరాల్లోకి వెళితే..
హిందీ సినిమా పరిశ్రమలో కొన్ని క్లాసిక్ సినిమాలను రీ రిలీజ్ ద్వారా ఈ తరం ప్రేక్షకులకు అందుబాటులోకి తెచ్చారు. రాక్ స్టార్, లైలా మజ్ను, రెహ్నా హై తెరే దిల్ మే సినిమాలను రిలీజ్ చేయగా బాక్సాఫీస్ వద్ద భారీగా వసూళ్లు సాధిస్తున్నది. ఈ క్రమంలో కరోనా సమయంలో అత్యంత పాపులారిటీ సాధించిన చిత్రం తుంబాడ్ సినిమాను మళ్లీ రిలీజ్ చేశారు.

తుంబాడ్ సినిమా 15 కోట్లతో రూపొందించారు. 2018 సంవత్సరంలో అక్టోబర్ 12వ తేదీన రిలీజైంది. అయితే అప్పట్లో ఈ సినిమాకు మంచి టాక్ వచ్చినా.. అంతగా వసూళ్లను సాధించలేకపోయింది. దాదాపు ఫ్లాప్ టాక్‌ను సొంతం చేసుకొన్నది. అయితే ఈ సినిమాకు ఫ్యాన్ బేస్ పెరిగిపోవడంతో మరోసారి సెప్టెంబర్ 14, 2024 తేదీన రిలీజ్ చేయగా భారీ స్పందన లభిస్తున్నది.
ఫస్ట్ టైమ్ తుంబాడ్ సినిమా రిలీజ్ అయినప్పుడు బాక్సాఫీస్ వద్ద పేలవమైన కలెక్షన్లు రాబట్టింది. ఈ సినిమా తొలి రోజు 60 లక్షల రూపాయలు వసూలు చేయగా.. తొలివారాంతం 3 కోట్లు, ఫస్ట్ వీక్ 5 కోట్లు వసూలు చేసింది. మొత్తంగా ఈ సినిమా జర్నీ 12 కోట్ల రూపాయల క్లోజింగ్ కలెక్షన్లతో ముగిసింది.

ఇక తుంబాడ్ సినిమా రీ రీలీజ్ తొలి రోజు మంచి కలెక్షన్లు రాబట్టింది. ఈ సినిమా తొలి రోజు 1.5 కోట్ల రూపాయలు, రెండో రోజు 2.5 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా 4 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్లు నమోదు చేసింది. ఆదివారం మూడో రోజున కూడా మంచి అడ్వాన్స్ బుకింగ్ నమోదు చేస్తున్నది. అయితే స్ట్రెయిట్ రిలీజ్ టైమ్‌లో ఫ్లాప్ అయింది. ఇప్పుడు మాత్రం థియేటర్లలో భారీ వసూళ్లు రాబడుతున్నది అంటూ ట్రేడ్ వర్గాలు కామెంట్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











