Turbo Collections: బాక్సాఫీస్ దుమ్మురేపుతున్న టర్బో మూవీ.. మమ్ముట్టి మూవీకి ఎన్ని కోట్ల కలెక్షన్లంటే?

మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి, కన్నడ దర్శకుడు రాజ్ బీ శెట్టి, తెలుగు నటుడు సునీల్, అంజనా జయప్రకాశ్, కబీర్ దుహన్ సింగ్ తదితరులు నటించిన టర్బో మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు సాధిస్తున్నది.మమ్ముట్టి స్వీయ నిర్మాణంలో నిర్మించిన ఈ చిత్రం మే 24వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. ఈ మూవీ బడ్జెట్ ఎంత? ఏ రేంజ్ కలెక్షన్లు సాధిస్తున్నదనే వివరాల్లోకి వెళితే..

టర్బో చిత్రం తెలుగు, మలయాళ, కన్నడ చిత్రాల నటుల మేలవింపుతో సినిమాను తెరకెక్కించారు. అలాగే టాలెంటెడ్ ఆర్టిస్టులు, టెక్నిషియన్స్ ఈ సినిమాలో భాగమయ్యారు. దాంతో ఈ సినిమా వ్యయం భారీగా పెరిగింది. ప్రమోషనల్ ఖర్చులు, ఇతర ఖర్చులతో కలిపి ఈ మూవీని 60 కోట్ల రూపాయలతో నిర్మించారు.

Turbo Malayalam Movie 3 days box office Collections Worldwide Mammootty Cinema rock solid at GBOC

మమ్ముట్టి సినిమాకు మంచి బజ్ క్రియేట్ కావడంతో భారీగా ఓపెనింగ్స్ నమోదు అయ్యాయి. ఈ సినిమా మిక్స్ డ్ టాక్ సంపాదించుకొన్నప్పటీకి బాక్సాఫీస్ వద్ద భారీగా కలెక్షన్లు రాబడుతున్నది.ఈ మూవీకి గత మూడు రోజులుగా మంచి ఆక్యుపెన్సీ నమోదు అవుతున్నది. కోచి, సలెం, కొజికోడ్, అలెప్పీ తదితర ప్రాంతాల్లో భారీ వసూళ్లు నమోదు అవుతున్నాయి.

టర్బో సినిమా తొలి రోజు రికార్డు వసూళ్లను సాధించింది. 2024 సంవత్సరంలో అత్యధిక వసూళ్లు సాధించిన మలయాళ చిత్రాల్లో ఒకటిగా రికార్డు క్రియేట్ చేసింది. తొలి రోజు మలయాళంలో 6.5 కోట్ల గ్రాస్, యూఏఈలో 3 కోట్ల గ్రాస్ నమోదు చేసింది. ఇక ప్రపంవవ్యాప్తంగా ఈ సినిమా తొలి రోజు
15 కోట్ల గ్రాస్ రాబట్టింది.

ఇక రెండు, మూడు రోజుల్లో ఈ చిత్రం భారీ వసూళ్లను నమోదు చేసింది. ఈ చిత్రం 2వ రోజు కేరళలో 3 కోట్లు, గల్ఫ్ 4 కోట్ల రూపాయలు, ఇండియాలోని ఇతర రాష్ట్రాల్లో 4 కోట్ల రూపాయలతో 11. 5 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఇక మూడో రోజు ఈ చిత్రం నిలకడగా వసూళ్లను సాధించింది.

Turbo Malayalam Movie 3 days box office Collections Worldwide Mammootty Cinema rock solid at GBOC

టర్బో చిత్రం మూడో రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. కేరళలో 4 కోట్ల రూపాయలు, ఇండియాలోని అన్ని రాష్ట్రాల్లో కలుపుకొని 5 కోట్ల రూపాయలు, గల్ఫ్‌లో 4.5 కోట్ల రూపాయలను రాబట్టింది. దాంతో ఈ సినిమా మూడో రోజు 13.5 కోట్లు వసూలు చేసింది.

టర్బో సినిమా తొలి రోజు 15 కోట్ల గ్రాస్, రెండో రోజు 11.5 కోట్ల గ్రాస్, మూడో రోజు 13.5 కోట్ల గ్రాస్ కలెక్షన్లను బాక్సాఫీస్ వద్ద నమోదు చేసింది. గత మూడో రోజుల్లో 39.5 కోట్లకుపైగా కలెక్షన్లు సాధించింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్‌గా కనిపిస్తున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X