భార్యకు విడాకులు... సింగర్‌ను పెళ్లాడబోతున్న నిర్మాత!
ఎంటీవీలో ప్రసారం అయ్యే రోడీస్, స్ల్పిట్స్‌విల్లా లాంటి షోల ద్వారా పాపులర్ అయిన యాక్టర్, ప్రొడ్యూసర్ రఘురాం తన గర్ల్ ఫ్రెండ్, కెనడియన్ సింగర్ నటాలియో డి లూసీని పెళ్లాడబోతున్నారు. ఇటీవలే వీరి ఎంగేజ్మెంట్ టోరంటోలో జరిగింది. ఈ వేడుకకు టీవీ నటుడు కరణ్‌వీర్ బోహ్రాతో పాటు అతడి భార్య తీజాయ్ కూడా హాజరయ్యారు.
రఘురాం, నటాలియో డి లూసీ వివాహం త్వరలో గోవాలో జరుగబోతోందని, ఇండియన్ స్టైల్‌లో ఈ వివాహం జరుగబోతోందని తెలుస్తోంది. రఘురామ్‌కు ఇది రెండో వివాహం. గతంలో నటి సుగంధ గార్గ్‌ను పెళ్లాడిన అతడు 2016లో ఆమెతో విడిపోయారు.

భార్యతో విడిపోయిన తర్వాత కెనడియన్ సింగర్ నటాలియో డి లూసీకి దగ్గరయిన ఈ ప్రొడ్యూసర్ కొంతకాలంగా ఆమెతో సహజీవనం చేస్తున్నాడు. పలు బాలీవుడ్ సినిమాలకు పని చేసిన నటాలియా ఎంటీవీ స్టూడియోలో రఘుకు పరిచయం అయింది. అలా ఇద్దరి మధ్య మొదలైన ప్రేమ పెళ్లి చేసుకునే వరకు వచ్చింది.
రఘురామ్ మన తెలుగువాడే. ఆంధ్రప్రదేశ్ లోని మచిలీపట్నంలో పుట్టాడు. తండ్రి చార్టెడ్ అకౌంట్, తల్లి జర్నలిస్ట్. ఎంటీవీలో తన కెరీర్ ప్రారంభించిన రఘురామ్ రోడీస్ లాంటి, స్ల్పిట్స్‌విల్లా రూపొందించి నిర్మాతగా మారాడు.


Click it and Unblock the Notifications











