1650 కోట్ల బడ్జెట్.. 3 రోజుల్లోనే 540 కోట్ల కలెక్షన్లు.. వసూళ్ల సునామీ!

ప్రకృతి విపత్తులు, ఇతర ఎన్విరాన్ మెంటల్ డిజాస్టర్స్ నేపథ్యంగా రూపొందిన అమెరికన్ డిజాస్టర్ థ్రిల్లర్ మూవీ ట్విస్టర్స్. జోసెఫ్ కోసిన్‌స్కీ కథ ఆధారంగా లీ ఇజాక్ చంగ్ దర్వకత్వం వహించిన ఈ చిత్రం జూలై 19వ తేదీన రిలీజైంది. 1996లో రిలీజైన ట్విస్టర్ సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన ఈ సినిమా బడ్జెట్ ఎంత? సాధిస్తున్న కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

హాలీవుడ్‌లో పేరెన్నిక కలిగిన నిర్మాణ సంస్థ అంబ్లీన్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమా డైసీ ఎడ్గర్ జోన్స్, గ్లెన్ పావెల్, ఆంథోని రామోస్, బ్రెండన్ పెరీరా తదితరులు నటించారు. ఈ మూవీని వార్నర్ బ్రదర్స్ పిక్చర్స్, యూనివర్సల్ పిక్చర్స్ రిలీజ్ చేశారు. ఈ సినిమాను సుమారుగా 200 మిలియన్ డాలర్లు అంటే దాదాపు 1650 కోట్ల రూపాయలతో నిర్మించారు.

Twisters First week Box Office Collection Worldwide

ట్విస్టర్స్ మూవీ ప్రపంచవ్యాప్తంగా ట్రేడ్ అనలిస్టుల అంచనాలను అధిగమించింది. ఈ మూవీ నార్త్ అమెరికా, ఓవర్సీస్ృ‌లో సుమారుగా 4150 లోకేషన్లలో తొలి రోజు 32.2 మిలియన్ డాలర్లు అంటే 270 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టింది. హాలీవుడ్‌లో ఉన్న భారీ పోటీని తట్టుకొని ఈ సినిమా ఈరేంజ్‌లో వసూళ్లను సాధించడం విశేషంగా చెప్పుకొంటున్నారు.

ఇక ట్విస్టర్స్ మూవీ సినిమా ఇండియాలో గత మూడు రోజుల్లో సాధించిన కలెక్షన్లు ఇలా ఉన్నాయి. తొలి రోజు 70 లక్షల రూపాయలు వసూలు చేసింది. రెండో రోజు 80 లక్షలు కలెక్షన్లు సాధించింది. ఇక మూడో రోజు 1.63 మిలియన్ డాలర్లు రాబట్టింది. దాంతో ఈ సినిమా 3 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది.

Twisters First week Box Office Collection Worldwide

ఇక తొలివారంలో 55 మిలియన్ డాలర్లు వసూలు చేస్తుందని అంచనా వేశారు. అయితే ఈ సినిమా అంతకు మించి 74 మిలియన్ డాలర్లు అంటే భారతీయ కరెన్సీలో 540 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఈ సినిమా ఇటీవల రిలీజైన డెస్పికేబుల్ మీ 4 సినిమా వసూళ్లను సమానంగా కలెక్షన్లు రాబట్టింది.

నార్త్ అమెరికాలో జూలైలో అత్యధిక వసూళ్లు సాధించిన నాలుగో చిత్రంగా ట్విస్టర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద నిలిచింది. ఇన్స్‌సైడ్ అవుట్ 2 మూవీ 154 మిలియన్ డాలర్లు, డ్యూన్ 2 మూవీ 82 మిలియన్ డాలర్లు, గాడ్జిల్లా X కాంగ్: ది న్యూ ఎంపైర్ 80 మిలియన్ డాలర్లు వసూలు చేశాయి.

More from Filmibeat

Read more about: twisters hollywood box office
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X