twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘యూ టర్న్’ క్లోజింగ్ కలెక్షన్స్... నష్టం ఎంతంటే?

    |

    సమంత, ఆది పినిశెట్టి కీలక పాత్రల్లో ప‌వ‌న్ కుమార్ దర్శకత్వంలో మిస్టరీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన చిత్రం 'యూ టర్న్'. ఈ మూవీ సెప్టెంబ‌ర్ 13న విడుదలైంది. కన్నడలో సూపర్ హిట్ అయన చిత్రాన్ని అదే పేరుతో తెలుగులో రీమేక్ చేశారు. సమంత, ఆది పినిశెట్టి, భూమిక లాంటి స్టార్స్ ఉండటంతో రిలీజ్ ముందు ఈ చిత్రంపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.

    అయితే 'యూ టర్న్' విడుదల రోజే సమంత భర్త నాగ చైతన్య నటించిన 'శైలజా రెడ్డి అల్లుడు' విడుదల కావడం సినిమాపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. భార్య భర్తల బాక్సాఫీసు రేసులో చైతూ పేచేయి సాధించాడు. క్రమ క్రమంగా యూ టర్న్ మూవీ కలెక్షన్లు డీలా పడుతూ వచ్చాయి. సినిమాకు రెస్పాన్స్ పూర్తిగా పడిపోవడంతో తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాల్లో దాదాపు అన్ని థియేటర్ల నుండి తీశారు.

    U Turn closing collections worldwide

    ఇప్పటి వరకు 'యూ టర్న్' మూవీ ప్రపంచ వ్యాప్తంగా రూ. 6.5 కోట్ల షేర్ మాత్రమే వసూలు చేసింది. థియేట్రికల్ రైట్స్ రూ. 9 కోట్లకు అమ్ముడవ్వడంతో దాదాపు రూ. 2.5 కోట్ల నష్టం ఏర్పడినట్లయింది. అయితే తెలుగు శాటిలైట్ రైట్స్, హిందీ డబ్బింగ్ రైట్స్ అమ్మడం ద్వారా ఈ నష్టాన్ని పూడ్చుకుంటామనే ధీమాలో నిర్మాతలు ఉన్నట్లు తెలుస్తోంది.

    సమంత, ఆదితో పాటు రాహుల్ ర‌వీంద్ర‌న్, భూమికా చావ్లా ఈ చిత్రంలో కీల‌క‌పాత్ర‌లు పోషించారు. పూర్ణ‌చంద్ర తేజ‌స్వి ఈ చిత్రానికి సంగీతం అందించారు. నికేత్ బొమ్మి సినిమాటోగ్ర‌ఫీ సమకూర్చారు. శ్రీ‌నివాస సిల్వ‌ర్ స్క్రీన్ మ‌రియు వివై కంబైన్స్ బ్యాన‌ర్స్ పై శ్రీ‌నివాస చిట్టూరి, రాంబాబు బండారు 'యూ ట‌ర్న్' చిత్రాన్ని నిర్మించారు.

    English summary
    Samantha, Aadi pinishetty, Bhumika Chawla, Rahul Ravindran starrer "U Turn" film’s run has come to an end, it has made close to 6.5 crores to date worldwide. As the film was sold for 9 crores as its pre-release price. Total loss is Rs. 2.5 cr.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X