Ugram 1st Week Collections: నరేష్‌కు 6.50 కోట్ల టార్గెట్.. వారంలోనే ఢమాల్.. అన్ని కోట్ల నష్టం ఖాయం!
తెలుగు సినీ ఇండస్ట్రీలో అన్ని రకాల జోనర్లలో సినిమాలు చేసే హీరోలు చాలా తక్కువ మందే ఉన్నారు. అందులో టాలెంటెడ్ స్టార్ అల్లరి నరేష్ ఒకడు. కెరీర్ ఆరంభంలో కామెడీ చిత్రాలతో సందడి చేసిన అతడు.. క్రమంగా ప్రయోగాలు చేస్తూ తనలోని విలక్షణమైన నటనను బయటకు తెస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇటీవలే నరేష్ 'ఉగ్రం' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. క్రైమ్ థ్రిల్లర్ జోనర్‌లో వచ్చిన ఈ చిత్రానికి మంచి టాక్ వచ్చినా.. రెస్పాన్స్ ఆశించిన స్థాయిలో రావడం లేదు. ఈ నేపథ్యంలో 'ఉగ్రం' మూవీ వారం రోజుల్లో ఎంత రాబట్టిందంటే!
ఉగ్రం అంటూ నరేష్ ప్రయోగం:టాలీవుడ్ టాలెంటెడ్ హీరో అల్లరి నరేష్ నటించిన తాజా సినిమానే 'ఉగ్రం'. విజయ్ కనకమేడల తెరకెక్కించిన ఈ మూవీలో మీర్నా మీనన్ హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహూ గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తుంచారు. ఇందులో ఇంద్రజ, శత్రు తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు. ఈ మూవీకి శ్రీ చరణ్ పాకాల సంగీతాన్ని సమకూర్చాడు.

ఉగ్రం మూవీ బిజినెస్ డీటేల్స్:సీరియస్ స్టోరీతో రూపొందిన 'ఉగ్రం' మూవీకి నైజాంలో రూ. 2.00 కోట్లు, సీడెడ్‌లో రూ. 80 లక్షలు, ఆంధ్రాలో కలిపి రూ. 2.00 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 4.80 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, కర్నాకట ప్లస్ రెస్టాఫ్ ఇండియా ప్లస్ ఓవర్సీస్‌లో కలిపి రూ. 1.00 కోటి పలికింది. ఇలా ప్రపంచ వ్యాప్తంగా ఇది రూ. 5.80 కోట్ల బిజినెస్‌ను జరుపుకుంది.

7వ రోజు తెలుగు వసూళ్లు ఇలా:'నాంది' వంటి సక్సెస్ తర్వాత అల్లరి నరేష్ - విజయ్ కనకమేడల కలయికలో రూపొందిన సినిమానే 'ఉగ్రం'. ఈ చిత్రానికి ఆరంభంలోనే మంచి టాక్ వచ్చింది. అయినప్పటికీ దీనికి కలెక్షన్లు అంతగా రావడం లేదు. ఇలా ఇప్పటి వరకూ ఈ చిత్రం తక్కువ వసూళ్లనే రాబట్టింది. ఈ క్రమంలోనే 7వ రోజు ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో రూ. 12 లక్షలు షేర్‌నే వసూలు చేసింది.

వారం రోజుల్లో ఎంత వచ్చింది?:వారం రోజుల్లో 'ఉగ్రం' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో వసూళ్లు అంతగా రాలేదు. ఫలితంగా నైజాంలో రూ. 1.00 కోట్లు, సీడెడ్‌లో రూ. 39 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 34 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 22 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 14 లక్షలు, గుంటూరులో రూ. 22 లక్షలు, కృష్ణాలో రూ. 22 లక్షలు, నెల్లూరులో రూ. 12 లక్షలతో కలిపి.. రూ. 2.65 కోట్లు షేర్, రూ. 5.60 కోట్లు గ్రాస్ వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది:వారం రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఓ మోస్తరుగా రూ. 2.65 కోట్లు మాత్రమే రాబట్టిన 'ఉగ్రం' మూవీ.. ప్రపంచ వ్యాప్తంగానూ నిరాశనే ఎదుర్కొంటోంది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా ప్లస్ ఓవర్సీస్‌లలో కలిపి రూ. 27 లక్షలు మాత్రమే రాబట్టింది. ఇలా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 7 రోజుల్లో రూ. 2.92 కోట్లు షేర్, రూ. 6.55 కోట్లు గ్రాస్ మాత్రమే వసూలు చేసింది.

మూవీకి టార్గెట్.. ఎంత రావాలి?:సక్సెస్‌ఫుల్ కాంబోలో వచ్చిన 'ఉగ్రం' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 5.80 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 6.50 కోట్లుగా నమోదైంది. ఇక, వారం రోజుల్లో దీనికి రూ. 2.92 కోట్లు వచ్చాయి. అంటే.. మరో రూ. 3.58 కోట్లు వస్తేనే హిట్ అవుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో అది కష్టమే అని చెప్పాలి.


Click it and Unblock the Notifications











