Ugram 2 Days Collections: 2వ రోజు ఊహించని విధంగా.. వచ్చింది గోరంతే.. రావాల్సింది మాత్రం కొండంత
పేరున్న కుటుంబం నుంచి సినిమాల్లోకి హీరోగా కెరీర్‌ను మొదలు పెట్టి.. చాలా తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు అల్లరి నరేష్. ఆరంభం నుంచి కామెడీ చిత్రాలనే చేసిన అతడు.. ఈ మధ్య కాలంలో మాత్రం ప్రయోగాలకు ప్రాధాన్యం ఇస్తున్నాడు. ఇందులో భాగంగానే ఇప్పుడు నరేష్ 'ఉగ్రం' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దీనికి ఆరంభంలోనే మిక్స్‌డ్ టాక్ వచ్చింది. దీంతో కలెక్షన్లు పెద్దగా రావడం లేదు. ఈ పరిస్థితుల్లో 'ఉగ్రం' మూవీ రెండు రోజుల్లో ఎంత వసూలు చేసిందో మీరే చూసేయండి మరి!
ఉగ్రం చూపేందుకు వచ్చాడు
టాలీవుడ్ ఆల్‌రౌండ్ హీరో అల్లరి నరేష్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రమే 'ఉగ్రం'. విజయ్ కనకమేడల తెరకెక్కించిన ఈ మూవీలో మీర్నా మీనన్ హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహూ గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తుంచారు. ఇందులో ఇంద్రజ, శత్రు తదితరులు కీలక పాత్రలను చేశారు. ఈ మూవీకి శ్రీ చరణ్ పాకాల మ్యూజిక్ ఇచ్చాడు.

ఉగ్రం మూవీ బిజినెస్ డీటేల్స్
నరేష్ నటించిన 'ఉగ్రం' మూవీకి నైజాంలో రూ. 2.00 కోట్లు, సీడెడ్‌లో రూ. 80 లక్షలు, ఆంధ్రాలో కలిపి రూ. 2.00 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 4.80 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, కర్నాకట ప్లస్ రెస్టాఫ్ ఇండియా ప్లస్ ఓవర్సీస్‌లో కలిపి రూ. 1.00 కోటి పలికింది. ఇలా ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 5.80 కోట్ల బిజినెస్ చేసుకుంది.

2వ రోజు తెలుగు వసూళ్లు ఇలా
నరేష్ 'ఉగ్రం' మూవీకి 2వ రోజు తెలుగు రాష్ట్రాల్లో వసూళ్లు పెరిగాయి. ఫలితంగా నైజాంలో రూ. 28 లక్షలు, సీడెడ్‌లో రూ. 11 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 8 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 5 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 3 లక్షలు, గుంటూరులో రూ. 5 లక్షలు, కృష్ణాలో రూ. 4 లక్షలు, నెల్లూరులో రూ. 3 లక్షలతో కలిపి.. రూ. 67 లక్షలు షేర్, రూ. 1.26 కోట్లు గ్రాస్ మాత్రమే వచ్చింది.

2 రోజులకూ ఎంత వచ్చింది?
'ఉగ్రం' మూవీకి 2 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో తక్కువగానే వసూళ్లు వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 51 లక్షలు, సీడెడ్‌లో రూ. 21 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 15 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 10 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 6 లక్షలు, గుంటూరులో రూ. 10 లక్షలు, కృష్ణాలో రూ. 9 లక్షలు, నెల్లూరులో రూ. 6 లక్షలతో కలిపి.. రూ. 1.28 కోట్లు షేర్, రూ. 2.41 కోట్లు గ్రాస్ వచ్చింది.
ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది
ఏపీ, తెలంగాణలో 2 రోజుల్లో ఓ మోస్తరుగానే రూ. 1.28 కోట్లు మాత్రమే వసూలు చేసిన 'ఉగ్రం' మూవీ.. ప్రపంచ వ్యాప్తంగానూ నిరాశనే ఎదుర్కొంటోంది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా ప్లస్ ఓవర్సీస్‌లలో కలిపి రూ. 20 లక్షలు మాత్రమే రాబట్టింది. ఇలా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 2 రోజుల్లోనూ రూ. 1.48 కోట్లు షేర్, రూ. 2.91 కోట్లు గ్రాస్ మాత్రమే వసూలు చేసింది.

మూవీకి టార్గెట్.. ఎంత రావాలి?
క్రైమ్ థ్రిల్లర్ జోనర్‌లో వచ్చిన 'ఉగ్రం' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 5.80 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 6.50 కోట్లుగా నమోదైంది. ఇక, 2 రోజుల్లో దీనికి రూ. 1.48 కోట్లు వచ్చాయి. అంటే.. మరో రూ. 5.02 కోట్లు రాబడితేనే ఈ సినిమా క్లీన్ హిట్ స్టేటస్‌ను సొంతం చేసుకుంటుంది.

అప్పుడే ఇంత తక్కువగానా?
అల్లరి నరేష్ - విజయ్ కనకమేడల కాంబినేషన్‌లో రూపొందిన 'ఉగ్రం' మూవీకి మిక్స్‌డ్ టాక్ రావడంతో కలెక్షన్లపై తీవ్ర స్థాయిలో ప్రభావం పడుతోంది. అందుకే దీనికి ఓపెనింగ్స్ చాలా తక్కువగా వచ్చాయి. ఇక, రెండో రోజు కాస్త పెరిగినా ఇది కూడా తక్కువ అనే చెప్పాలి. దీంతో ఈ చిత్రం గొరంత వసూలు చేసి.. కొండంత కలెక్షన్లను రాబట్టాల్సి పరిస్థితుల్లో ఉండిపోయింది.


Click it and Unblock the Notifications











