Ugram 3 Days Collections: నరేష్‌కు కలిసి రాని సండే.. 3వ రోజూ షాకింగ్‌గా.. ఇంకెన్ని కోట్లు రావాలంటే!
విలక్షణమైన నటన, విభిన్నమైన చిత్రాలు చేస్తూ తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రత్యేకమైన ఇమేజ్‌తో దూసుకుపోతోన్నాడు అల్లరి నరేష్. కెరీర్ ఆరంభంలో కామెడీ చిత్రాల్లోనే నటించిన అతడు.. క్రమంగా పంథాను మార్చుకుని ప్రయోగాలు చేస్తోన్నాడు. ఇలా 'నాంది'తో బిగ్గెస్ట్ హిట్‌ను అందుకున్నాడు. ఈ జోష్‌లోనే ఇప్పుడు అదే కాంబోలో 'ఉగ్రం' అనే సినిమాను చేశాడు. క్రైమ్ థ్రిల్లర్ జోనర్‌లో వచ్చిన ఈ చిత్రానికి మంచి టాక్ వచ్చినా.. రెస్పాన్స్ ఆశించిన స్థాయిలో రావడం లేదు. ఈ నేపథ్యంలో 'ఉగ్రం' మూవీ 3 రోజుల్లో ఎంత వసూలు చేసిందో మీరే చూసేయండి!
అల్లరి నరేష్ ఉగ్ర రూపంతో: టాలెంటెడ్ హీరో అల్లరి నరేష్ ప్రధాన పాత్రలో నటించిన తాజా సినిమానే 'ఉగ్రం'. విజయ్ కనకమేడల తెరకెక్కించిన ఈ మూవీలో మీర్నా మీనన్ హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహూ గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తుంచారు. ఇందులో ఇంద్రజ, శత్రు తదితరులు కీలక పాత్రలను చేశారు. ఈ మూవీకి శ్రీ చరణ్ పాకాల సంగీతాన్ని సమకూర్చాడు.

ఉగ్రం మూవీ బిజినెస్ డీటేల్స్: అల్లరి నరేష్ నటించిన 'ఉగ్రం' మూవీకి నైజాంలో రూ. 2.00 కోట్లు, సీడెడ్‌లో రూ. 80 లక్షలు, ఆంధ్రాలో కలిపి రూ. 2.00 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 4.80 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, కర్నాకట ప్లస్ రెస్టాఫ్ ఇండియా ప్లస్ ఓవర్సీస్‌లో కలిపి రూ. 1.00 కోటి పలికింది. ఇలా ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 5.80 కోట్ల బిజినెస్ జరుపుకుంది.

3వ రోజు తెలుగు వసూళ్లు ఇలా: 'ఉగ్రం' మూవీకి 3వ రోజు తెలుగు రాష్ట్రాల్లో షాకింగ్‌గా వసూళ్లు తగ్గాయి. ఫలితంగా నైజాంలో రూ. 22 లక్షలు, సీడెడ్‌లో రూ. 9 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 7 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 5 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 3 లక్షలు, గుంటూరులో రూ. 5 లక్షలు, కృష్ణాలో రూ. 5 లక్షలు, నెల్లూరులో రూ. 2 లక్షలతో కలిపి.. రూ. 60 లక్షలు షేర్, రూ. 1.20 కోట్లు గ్రాస్ మాత్రమే వచ్చింది.
3 రోజులకూ ఎంత వచ్చింది?: 3 రోజుల్లో 'ఉగ్రం' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో తక్కువగానే వసూళ్లు వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 74 లక్షలు, సీడెడ్‌లో రూ. 30 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 23 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 15 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 9 లక్షలు, గుంటూరులో రూ. 15 లక్షలు, కృష్ణాలో రూ. 14 లక్షలు, నెల్లూరులో రూ. 8 లక్షలతో కలిపి.. రూ. 1.88 కోట్లు షేర్, రూ. 3.85 కోట్లు గ్రాస్ వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది: ఆంధ్రా, తెలంగాణలో 3 రోజుల్లో ఓ మోస్తరుగా రూ. 1.88 కోట్లు మాత్రమే రాబట్టిన 'ఉగ్రం' మూవీ.. ప్రపంచ వ్యాప్తంగానూ నిరాశనే ఎదుర్కొంటోంది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా ప్లస్ ఓవర్సీస్‌లలో కలిపి రూ. 22 లక్షలు మాత్రమే రాబట్టింది. ఇలా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 3 రోజుల్లోనూ రూ. 2.10 కోట్లు షేర్, రూ. 4.50 కోట్లు గ్రాస్ మాత్రమే వసూలు చేసింది.
మూవీకి టార్గెట్.. ఎంత రావాలి?: సీరియస్ యాక్షన్‌తో వచ్చిన 'ఉగ్రం' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 5.80 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 6.50 కోట్లుగా నమోదైంది. ఇక, 3 రోజుల్లో దీనికి రూ. 2.10 కోట్లు వచ్చాయి. అంటే.. మరో రూ. 4.40 కోట్లు రాబడితేనే ఈ సినిమా క్లీన్ హిట్ స్టేటస్‌ను సొంతం చేసుకుంటుంది.

వీకెండ్‌లోనే మరీ వీక్ కలెక్షన్లు: 'నాంది' తర్వాత అల్లరి నరేష్ - విజయ్ కనకమేడల కాంబినేషన్‌లో రూపొందిన 'ఉగ్రం' మూవీకి మిక్స్‌డ్ టాక్ రావడంతో రెస్పాన్స్ ఆశించిన స్థాయిలో రావడం లేదు. ఫలితంగా దీనికి వసూళ్లు కూడా మంచి దక్కడం లేదు. దీంతో వీకెండ్‌లో చాలా వీక్ కలెక్షన్లనే ఈ సినిమా రాబట్టింది. ఇదే కంటిన్యూ అయితే అల్లరి నరేష్ సినిమాకు నష్టాలు వచ్చే ప్రమాదం ఉంది.


Click it and Unblock the Notifications











