Ugram 4 Days Collections: సోమవారం అసలు దెబ్బ.. చిన్న టార్గెట్ అయినా నష్టాలు తప్పేలా లేవు
కామెడీ మాత్రమే కాకుండా యాక్షన్ పాత్రలను కూడా చేయగలను అని ఈసారి నరేష్ ఉగ్రం సినిమాతో నిరూపించాలని అనుకున్నాడు. అయితే నటుడిగా అతను చాలా సరికొత్తగా ప్రయోగాలు చేస్తూ ఉండడం మెచ్చుకోదగిన విషయం. అయితే ఉగ్రం సినిమా కమర్షియల్ గా బాక్సాఫీస్ వద్ద మాత్రం అనుకున్నంత స్థాయిలో పాజిటివ్ గా అయితే ఏమీ అందుకోలేదు.
ఇక ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్స్ కూడా అనుకున్నంత స్థాయిలో రాలేదు. ఇక సోమవారం రోజు మరింత తగ్గడంతో సినిమా పెట్టిన పెట్టుబడినీ వెనక్కి తీసుకువచ్చే అవకాశం లేదని అనిపిస్తుంది. ఇక మొత్తంగా ఉగ్రం సినిమా నాలుగు రోజుల్లో ఇలాంటి కలెక్షన్స్ అందుకుంది అనే వివరాల్లోకి వెళితే..

ఉగ్రం సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్: అల్లరి నరేష్ 'ఉగ్రం' నైజాంలో రూ. 2.00 కోట్లు, సీడెడ్‌లో రూ. 80 లక్షలు, ఆంధ్రాలో కలిపి రూ. 2.00 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 4.80 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, కర్నాకట ప్లస్ రెస్టాఫ్ ఇండియా ప్లస్ ఓవర్సీస్‌లో కలిపి రూ. 1.00 కోటి పలికింది. ఇలా ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 5.80 కోట్ల బిజినెస్ జరుపుకుంది.

4వ రోజు వసూళ్లు ఇలా: 'ఉగ్రం' సినిమా వీకెండ్ లో అనుకున్నంతగా బెస్ట్ ఒపెనింగ్స్ ఏమి అందుకోలేదు. 4వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏరియాల వారిగా చూసుకుంటే.. నైజాంలో రూ. 10 లక్షలు, సీడెడ్‌లో రూ. 9 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 7 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 5 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 3 లక్షలు, గుంటూరులో రూ. 5 లక్షలు, కృష్ణాలో రూ. 5 లక్షలు, నెల్లూరులో రూ. 2 లక్షలతో కలిపి.. రూ. 60 లక్షలు షేర్, రూ. 1.20 కోట్లు గ్రాస్ మాత్రమే వచ్చింది.

4 రోజుల ఏపీ నైజాం కలెక్షన్స్: 4 రోజుల్లో 'ఉగ్రం' సినిమా తెలుగు రాష్ట్రాల్లో తక్కువగానే వసూళ్లు అంసుకుంది. ఇక నైజాంలో రూ. 74 లక్షలు, సీడెడ్‌లో రూ. 30 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 23 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 15 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 9 లక్షలు, గుంటూరులో రూ. 15 లక్షలు, కృష్ణాలో రూ. 14 లక్షలు, నెల్లూరులో రూ. 8 లక్షలతో కలిపి.. రూ. 1.98 కోట్లు షేర్, రూ. 3.95 కోట్లు గ్రాస్ వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన కలెక్షన్స్: ఆంధ్రా, తెలంగాణలో 4 రోజుల్లో ఓ మోస్తరుగా రూ. 1.98 కోట్లు మాత్రమే రాబట్టిన 'ఉగ్రం' సినిమా.. ప్రపంచ వ్యాప్తంగానూ నిరాశనే ఎదుర్కొంటోంది. ఇక కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా ప్లస్ ఓవర్సీస్‌లలో కలిపి రూ. 26 లక్షలు మాత్రమే అందుకుంది. ఇలా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 4 రోజుల్లోనూ రూ. 2.30 కోట్లు షేర్, రూ. 4.70 కోట్లు గ్రాస్ మాత్రమే వసూలు చేసింది.

ఇంకా రావాల్సింది ఎంతంటే?: నరేష్ సీరియస్ పోలీస్ పాత్రలో కనిపించిన విధానం బాగానే ఆకట్టుకుంది. యావరేజ్ టాక్ రావడం వలన తప్పకుండా సినిమా పెట్టిన పెట్టుబడి వెనక్కి తీసుకు వస్తుందని అందరూ అనుకున్నారు. కానీ పరిస్థితి అలా కనిపించడం లేదు.
'ఉగ్రం' అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 5.80 కోట్లు మేర బిజినెస్ చేయగా.. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 6.50 కోట్లుగా నమోదైంది. ఇక, 4 రోజుల్లో రూ. 2.30 కోట్లు వచ్చాయి. అంటే.. మరో రూ. 4.10 కోట్లు రాబడితేనే ఈ సినిమా క్లీన్ హిట్ స్టేటస్‌ను సొంతం చేసుకుంటుంది.


Click it and Unblock the Notifications











