Ugram 5 Days Collections: ఉగ్రం సినిమాకు కూడా అదే దెబ్బ.. పెట్టుబడిలో సగం పోయినట్లే..

అల్లరి హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్టార్ ఇమేజ్ ను సంపాదించుకున్న నరేష్ ఒకప్పుడు గ్యాప్ లేకుండా ఎన్నో కామెడీ సినిమాలు చేశాడు అయితే ఈసారి మాత్రం నరేష్ ఆడియన్స్ కు సరికొత్తగా కట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు అతను నటించిన ప్రోగ్రామ్ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత స్థాయిలో అయితే ఓపెనింగ్ అందుకోలేదు వీకెండ్ తర్వాత కలెక్షన్ అయితే మరింత దారుణంగా పడిపోయాయి ఇక ఐదు రోజుల్లో ఈ సినిమాకు మొత్తం ఎంత కలెక్షన్స్ వచ్చాయి అనే వివరాల్లోకి వెళితే..

ప్రీ రిలీజ్ బిజినెస్ : అల్లరి నరేష్ 'ఉగ్రం' ఏపీ తెలంగాణలో డీసెంట్ బిజినెస్ చేసింది. నైజాంలో రూ. 2.00 కోట్లు, సీడెడ్‌లో రూ. 80 లక్షలు, ఆంధ్రాలో కలిపి రూ. 2.00 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 4.80 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, కర్నాకట ప్లస్ రెస్టాఫ్ ఇండియా ప్లస్ ఓవర్సీస్‌లో కలిపి రూ. 1.00 కోటి పలికింది. ఇలా ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 5.80 కోట్ల బిజినెస్ జరుపుకుంది.

 ugram-allari-naresh-

5వ రోజు ఏపి నైజాం కలెక్షన్స్ : 'ఉగ్రం' సినిమా ఫస్ట్ వీకెండ్ లో అనుకున్నంతగా ఒపెనింగ్స్ ఏమి అందుకోలేదు. 5వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏరియాల వారిగా చూసుకుంటే.. నైజాంలో రూ. 6 లక్షలు, సీడెడ్‌లో రూ. 2 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 2 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 2 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 3 లక్షలు, గుంటూరులో రూ. 4 లక్షలు, కృష్ణాలో రూ. 1 లక్షలు, నెల్లూరులో రూ. 1 లక్షలతో కలిపి.. రూ. 20 లక్షలు షేర్, రూ. 33 లక్షల గ్రాస్ మాత్రమే వచ్చింది.

 ugram-allari-naresh-
5 రోజుల ఏపీ నైజాం టోటల్ కలెక్షన్స్ : 5 రోజుల్లో ఈ సినిమా ఆంద్రప్రదేశ్ తెలంగాణాలో తక్కువగానే వసూళ్లు అంసుకుంది. ఏరియాల వారిగా టోటల్ చూసుకుంటే.. నైజాంలో రూ. 90 లక్షలు, సీడెడ్‌లో రూ. 37 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 30 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 20 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 12 లక్షలు, గుంటూరులో రూ. 19 లక్షలు, కృష్ణాలో రూ. 19 లక్షలు, నెల్లూరులో రూ. 10 లక్షలతో కలిపి.. రూ. 1.98 కోట్లు షేర్, రూ. 3.95 కోట్లు గ్రాస్ వచ్చింది.
 ugram-allari-naresh-

వరల్డ్ వైడ్ కలెక్షన్స్ మొత్తం ఎంతంటే : ఆంధ్రా, తెలంగాణలో 5 రోజుల్లో ఓ మోస్తరుగా రూ. 1.98 కోట్లు మాత్రమే రాబట్టిన 'ఉగ్రం' సినిమా.. వరల్డ్ వైడ్ గా నిరాశనే ఎదుర్కొంటోంది. ఇక కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా ప్లస్ ఓవర్సీస్‌లలో కలిపి రూ. 25 లక్షలు మాత్రమే అందుకుంది. ఇలా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 5 రోజుల్లోనూ రూ. 2.63 కోట్లు షేర్‌, రూ. 5.75 కోట్లు గ్రాస్ మాత్రమే వసూలు చేసింది.

 ugram-allari-naresh-

నష్టాలు తప్పేలా లేవుగా : నరేష్ ఉగ్రం సినిమా కోసం చాలానే హార్డ్ వర్క్ చేశాడు. సీరియస్ పోలీస్ పాత్రలో కనిపించిన విధానం బాగానే ఆకట్టుకుంది. కొంత యావరేజ్ టాక్ రావడం వలన తప్పకుండా సినిమా పెట్టిన పెట్టుబడి మినిమమ్ వెనక్కి తీసుకు వస్తుందని అందరూ అనుకున్నారు. కానీ పరిస్థితి అలా కనిపించడం లేదు. 'ఉగ్రం' అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 5.80 కోట్లు మేర బిజినెస్ చేయగా.. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 6.50 కోట్లుగా నమోదైంది. ఇక, 5 రోజుల్లో రూ. 2.63 కోట్లు వచ్చాయి. అంటే.. మరో రూ. 3.87 కోట్లు రాబడితేనే ఈ సినిమా క్లీన్ హిట్ స్టేటస్‌ను సొంతం చేసుకుంటుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X