Ugram movie day 1 Collections ఉగ్రం మూవీకి క్రేజ్ ఆ రేంజ్‌లో.. కలెక్షన్లు మాత్రం.. తొలి రోజు ఎన్ని కోట్లంటే?
టాలీవుడ్‌లో హాస్య నటుడిగా ముద్ర వేసుకొన్న హీరో అల్లరి నరేష్, నాంది మూవీతో భారీ విజయాన్ని అందుకొన్న దర్శకుడు విజయ్ కనకమేడల కాంబినేషన్‌లో వచ్చిన మరో ప్రయోగాత్మక చిత్రం ఉగ్రం. మిస్పింగ్ కేసుల ఇన్వెస్టిగేషన్ నేపథ్యంగా రూపొందిన ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్ బ్యానర్ రూపొందించింది.
నిర్మాతలు సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మించారు. మలయాళ నటి మిర్నా మీనన్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం మే 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా తొలి రోజు కలెక్షన్లు, బడ్జెట్, థియేట్రికల్ బిజినెస్, బ్రేక్ ఈవెన్ వివారాల్లోకి వెళితే..

ఉగ్రం బడ్జెట్ ఎంతంటే?: డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కించిన ఉగ్రం చిత్రం అల్లరి నరేష్ కెరీర్‌లో అత్యధిక బడ్జెట్‌తో నిర్మించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ఈ సినిమాను సాహు, హరీష్ దాదాపు 15 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు. ప్రమోషనల్ కార్యక్రమాలు, నరేష్, విజయ్ కనకమేడల విజయంపై చూపించిన ధీమాతో ఈ సినిమాపై మంచి అటెన్షన్ ఏర్పడింది.

స్క్రీన్ కౌంట్ ఎంతంటే?: భారీ క్రేజ్ ఏర్పడటంతో ఉగ్రం చిత్రానికి మంచి థియేటర్ కౌంట్ నమోదు చేసుకొన్నది. ఈ సినిమాను దాదాపు నైజాంలో 110 స్క్రీన్లు, సీడెడ్‌లో 45 స్క్రీన్లు, ఆంధ్రాలో 165 స్క్రీన్లు కలిపి మొత్తంగా 320 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో 45 స్క్రీన్లలో విడుదల చేశారు. ఓవర్సీస్‌లో 150 స్క్రీన్లతో కలిపి మొత్తం 515 స్క్రీన్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేశారు.

ఉగ్రం ప్రీ రిలీజ్ బిజినెస్: ఉగ్రం ప్రీరిలీజ్ బిజినెస్ కూడా భారీగానే జరిగింది. ఈ సినిమా థియేట్రికల్ హక్కుల విషయానికి వస్తే.. నైజాంలో 2 కోట్లు, సీడెడ్‌లో 1 కోటి రూపాయాలు, ఆంధ్రాలో 2.5 కోట్లు మేర బిజినెస్ జరిగింది. ఆంధ్రా, నైజాంలో కలిపి మొత్తంగా 5.5 కోట్ల బిజినెస్ నమోదైంది. కర్ణాటక, ఓవర్సీస్ హక్కులు 1 కోటికి అమ్ముడుపోయాయి. మొత్తంగా ఈ సినిమా బిజినెస్ 6.5 కోట్లుగా నమోదైందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

ఉగ్రం తొలి రోజు కలెక్షన్లు: ఇక ఉగ్రం సినిమాకు మంచి ఓపెన్సింగ్స్ నమోదయ్యాయి. తొలి రోజు అన్ని వర్గాల నుంచి మంచి స్పందన లభించింది. ఈ సినిమా తొలి రోజున ఏపీ, తెలంగాణలో 1.5 కోట్ల షేర్, 2 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసింది. ఇక కర్ణాటక, ఓవర్సీస్‌లో కలుపుకొని మొత్తంగా ఈ చిత్రం 3 కోట్ల గ్రాస్ నమోదు చేసింది. దాంతో ఈ సినిమా సానుకూలంగానే జర్నీని మొదలుపెట్టింది.

ఉగ్రం లాభాల్లోకి రావాలంటే?: ఉగ్రం మిక్స్‌డ్ టాక్‌తో బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టింది. తొలి రోజు అడ్వాన్స్ బుకింగ్ రూపంలో, కరెంట్ బుకింగ్ రూపంలో పాజిటివ్ నెంబర్స్ రిజిస్టర్ చేసింది. ఈ సినిమాకు బ్రేక్ ఈవెన్ టార్గెట్ 16 కోట్ల గ్రాస్, 8 కోట్ల షేర్ బాక్సాఫీస్ వద్ద నమోదు చేయాల్సి ఉంది.తొలి రోజు 1.5 కోట్లు రాబట్టింది కనుక రాబోయే రోజుల్లో ఏ రేంజ్ కలెక్షన్లను నమోదు చేస్తుందో వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











