Ugram Business: నరేష్ మూవీకి రికార్డు బిజినెస్.. ఏకంగా అన్ని వందల థియేటర్లు.. సినీ పెద్దలే షాక్

లెజెండరీ డైరెక్టర్ కుమారుడిగా సినిమాల్లోకి వచ్చినా.. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు విలక్షణ హీరో నరేష్. 'అల్లరి' అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన అతడు.. అప్పటి నుంచి వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ వచ్చాడు. తద్వారా తక్కువ సమయంలోనే యాభై చిత్రాలను పూర్తి చేశాడు. ఇక, కామెడీ హీరోగా పేరొందిన ఈ టాల్ హీరో.. ఈ మధ్య పంథాను మార్చుకుని సీరియస్ సినిమాలు చేస్తోన్నాడు. ఇందులో భాగంగానే ఇప్పుడు 'ఉగ్రం' అనే సినిమాతో రాబోతున్నాడు. ఈ నేపథ్యంలో ఈ మూవీ బిజినెస్, థియేటర్స్ లెక్కను చూద్దాం పదండి!

'ఉగ్రం' అంటూ మరో ప్రయోగం:టాలీవుడ్ టాలెంటెడ్ హీరో అల్లరి నరేష్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రమే 'ఉగ్రం'. విజయ్ కనకమేడల తెరకెక్కించిన ఈ మూవీలో మీర్నా మీనన్ హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహూ గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తుంచారు. ఇందులో ఇంద్రజ, శత్రు తదితరులు కీలక పాత్రలను చేశారు. ఈ మూవీకి శ్రీ చరణ్ పాకాల సంగీతం ఇచ్చాడు.

Ugram Movie Pre Release Business and Theaters Count

అలాంటి స్టోరీ... ఊరమాస్ రోల్:ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ మిస్టరీ కేసును చేధించే క్రమంలో కొన్ని సమస్యలను ఎదుర్కోవడంతో పాటు కుటుంబాన్ని కోల్పోతాడు. ఆ తర్వాత అతడు ప్రత్యర్థులపై ఎలా పగ తీర్చుకున్నాడు? ఈ క్రమంలోనే ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడు? అనే అంశాలతో 'ఉగ్రం' మూవీ తెరకెక్కింది. ఇందులో నరేష్ ఊరమాస్ అవతారంతో కనిపించబోతున్నాడు.

Ugram Movie Pre Release Business and Theaters Count

ప్రమోషన్స్ పూర్తి.. సందడిగానే:'నాంది' తర్వాత విజయ్ దర్శకత్వంలో అల్లరి నరేష్ నటించిన 'ఉగ్రం' మూవీ విడుదలకు సమయం దగ్గర పడడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను ముమ్మరం చేసేసింది. ఇప్పటికే చాలా ఈవెంట్లు కూడా చేసింది. అలాగే, ఇప్పటికే కొన్ని ఇంటర్వ్యూలు చేసుకున్నారు. ఇక, శుక్రవారమే దీన్ని ప్రపంచ వ్యాప్తంగా ఎంతో గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతున్నారు.

Ugram Movie Pre Release Business and Theaters Count

అన్ని థియేటర్లలో నరేష్ ఫిల్మ్:'ఉగ్రం' సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. దీంతో ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ మూవీని నైజాంలో 110, సీడెడ్‌లో 45, ఆంధ్రా ప్రాంతంలోని అన్ని ఏరియాల్లో కలిపి 165, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో 85, ఓవర్సీస్‌లో 150 థియేటర్లలో విడుదల కాబోతుంది. అంటే మొత్తంగా ఈ చిత్రం 515 - 520 థియేటర్లలో వస్తుంది.

నరేష్ మూవీ బిజినెస్ డీటేల్స్:పవర్‌ఫుల్ కంటెంట్‌తో రాబోతున్న 'ఉగ్రం' మూవీపై నరేష్ అభిమానులతో పాటు సినీ ప్రియులంతా ఫోకస్ చేస్తున్నారు. దీంతో ఈ సినిమాకు డిమాండ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని అన్ని ఏరియాలను కలుపుకుని మొత్తంగా ఈ సినిమాకు రూ. 6 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇది నరేష్ కెరీర్‌లోనే రికార్డు బిజినెస్ అని సమాచారం.

Ugram Movie Pre Release Business and Theaters Count

ఎన్ని కోట్లు వస్తే హిట్ అంటే!:నరేష్ నటించిన 'ఉగ్రం' సినిమాకు అతడి కెరీర్‌లోనే అత్యధికంగా రూ. 6.00 కోట్లు బిజినెస్ జరిగింది. దీంతో ఈ సినిమాకు రూ. 6.50 కోట్లు బ్రేక్ ఈవెన్ టార్గెట్ నమోదైంది. అంటే.. ఇంత మొత్తం వసూలు చేస్తేనే 'ఉగ్రం' సినిమా విజయం సాధిస్తుంది. మంచి టాక్ వస్తే.. ఈ కలెక్షన్లు సాధించే అవకాశం ఉంటుందని చెప్పొచ్చు. ఇక, రేపు రామబాణం కూడా విడుదలవుతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X