Ugram Total Collections: నరేష్‌కు 6.50 కోట్ల టార్గెట్.. ఫుల్ రన్‌లో ఇంతే.. ఎన్ని కోట్ల నష్టం అంటే!

సాధారణంగా కొందరు హీరోలు కొన్ని జోనర్లలో సినిమాలు చేయడానికి మాత్రమే పరిమితం అవుతారు. మరికొందరు మాత్రం అన్ని రకాల చిత్రాలు చేస్తూ ఆల్‌రౌండర్లు అనిపించుకుంటారు. అందులో అల్లరి నరేష్ ఒకడు. ఆరంభంలో కామెడీ చిత్రాలు చేసిన అతడు.. ఇప్పుడు ప్రయోగాలతో వస్తున్నాడు.

ఈ క్రమంలోనే ఇటీవలే 'ఉగ్రం' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. క్రైమ్ థ్రిల్లర్ జోనర్‌లో వచ్చిన ఈ చిత్రానికి మంచి టాక్ వచ్చినా.. రెస్పాన్స్ ఆశించిన స్థాయిలో రావడం లేదు. ఈ నేపథ్యంలో 'ఉగ్రం' మూవీ ఫుల్ రన్‌లో ఎంత రాబట్టిందంటే!

Ugram Movie Worldwide Official Closing Collections Report

ఉగ్రం అంటూ వచ్చిన నరేష్: టాలెంటెడ్ హీరో అల్లరి నరేష్ నటించిన తాజా సినిమానే 'ఉగ్రం'. విజయ్ కనకమేడల తెరకెక్కించిన ఈ మూవీలో మీర్నా మీనన్ హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహూ గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తుంచారు. ఇందులో ఇంద్రజ, శత్రు తదితరులు కీలక పాత్రలను పోషించారు. ఈ మూవీకి శ్రీ చరణ్ పాకాల సంగీతాన్ని అందించాడు.

Ugram Movie Worldwide Official Closing Collections Report

ఉగ్రం మూవీ బిజినెస్ డీటేల్స్: క్రైమ్ థ్రిల్లర్‌ జోనర్‌లో వచ్చిన 'ఉగ్రం' మూవీకి నైజాంలో రూ. 2.00 కోట్లు, సీడెడ్‌లో రూ. 80 లక్షలు, ఆంధ్రాలో కలిపి రూ. 2.00 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 4.80 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, కర్నాకట ప్లస్ రెస్టాఫ్ ఇండియా ప్లస్ ఓవర్సీస్‌లో కలిపి రూ. 1.00 కోటి పలికింది. ఇలా ప్రపంచ వ్యాప్తంగా ఇది రూ. 5.80 కోట్ల బిజినెస్‌ చేసుకుంది.

Ugram Movie Worldwide Official Closing Collections Report

అలాంటి టాక్.. వసూళ్లు ఇలా: 'నాంది' హిట్ తర్వాత అదే కాంబోలో వచ్చిన 'ఉగ్రం' మూవీకి ఆరంభంలోనే మంచి టాక్ వచ్చింది. కానీ, అనూహ్యంగా ఈ చిత్రానికి మొదటి రోజు నుంచే వసూళ్లు ఆశించిన రీతిలో రావట్లేదు. ఫలితంగా ఈ సినిమా కేవలం వారం రోజుల లోపే చాలా చోట్ల రన్‌ను కూడా ముగించేసింది. దీంతో అల్లరి నరేష్ ఉగ్ర రూప ప్రయోగం సఫలం కాకుండానే మిగిలిపోయింది.

Ugram Movie Worldwide Official Closing Collections Report

తెలుగులో ఎంత వచ్చింది?: 'ఉగ్రం' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ రన్‌లో వసూళ్లు అంతగా రాలేదు. ఫలితంగా నైజాంలో రూ. 1.20 కోట్లు, సీడెడ్‌లో రూ. 46 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 39 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 25 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 16 లక్షలు, గుంటూరులో రూ. 25 లక్షలు, కృష్ణాలో రూ. 26 లక్షలు, నెల్లూరులో రూ. 14 లక్షలతో కలిపి.. రూ. 3.11 కోట్లు షేర్, రూ. 6.65 కోట్లు గ్రాస్ వచ్చింది.

Ugram Movie Worldwide Official Closing Collections Report

ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది: ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఓ మోస్తరుగా రూ. 3.11 కోట్లు మాత్రమే రాబట్టిన 'ఉగ్రం' మూవీ.. ప్రపంచ వ్యాప్తంగానూ నిరాశనే ఎదుర్కొంది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా ప్లస్ ఓవర్సీస్‌లలో కలిపి రూ. 34 లక్షలు మాత్రమే రాబట్టింది. ఇలా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ముగింపు సమయానికి రూ. 3.45 కోట్లు షేర్‌, రూ. 7.45 కోట్లు గ్రాస్ మాత్రమే వసూలు చేసింది.

Ugram Movie Worldwide Official Closing Collections Report

మూవీకి టార్గెట్.. నష్టం ఎంత?: సక్సెస్‌ఫుల్ కాంబోలో వచ్చిన 'ఉగ్రం' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 5.80 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 6.50 కోట్లుగా నమోదైంది. ఇక, ఫుల్ రన్‌లో దీనికి రూ. 3.45 కోట్లు వచ్చాయి. అంటే దీనికి రూ. 3.05 కోట్లు నష్టాలు మిగిలాయి. ఫలితంగా ఈ చిత్రం డిజాస్టర్‌ అయిపోయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X