»   » 'బాహుబలి' ట్రైలర్ షాకిచ్చే రికార్డ్

'బాహుబలి' ట్రైలర్ షాకిచ్చే రికార్డ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ఇప్పుడు ఎక్కడ విన్నా 'బాహుబలి' గురించిన వార్తలే. నేషనల్ మీడియా, లోకల్ మీడియా రెండింటిలోనూ ఈ చిత్రం గురించి ఏదో ఒక విశేషం బాహుబలి వస్తూనే ఉంది. ముఖ్యంగా నిన్న ట్రైలర్ రిలీజైన క్షణం నుంచి సంచలానలకు నాందిగా నిలిచింది. సిని అభిమానులను, సినీ ప్రముఖులను అందరినీ ఈ ట్రైలర్ ఆశ్చర్యపరిచింది. నిన్న రిలీజైన సమయం నుంచి ఇప్పటివరకూ (16 గంటలు పైగానే అయ్యింది) 8.5 లక్షల వ్యూస్ పైగా వచ్చి రికార్డ్ క్రియేట్ చేసింది. ఇదే కొనసాగి మరో పది గంటల్లో... పది లక్షలు వ్యూస్ వస్తాయని అంచనా వేస్తున్నారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


ముఖ్యంగా సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలలో వారు అనుసరించిన వ్యూహాలు ఈ ట్రైలర్ పూర్తి స్దాయిలో విజయవంతమవటానికి కారణమయ్యాయి. అందరూ ముక్త కంఠంతో హాలీవుడ్ చిత్రం ట్రైలర్ చూసిన ఫీలింగ్ వచ్చిందని అంటున్నారు.


Read More: గ్రాండ్‌గా ఉంది: ‘బాహుబలి' అఫీషియల్ ట్రైలర్ (వీడియో)


ముఖ్యంగా ఇప్పటివరకూ ఎన్నడూ లేని విధంగా కేవలం సినిమా ట్రైలర్ ని చూడ్డానికి భారీగా జనాలు థియేటర్స్ కు వెళ్లారు. అలాగే ఈ సినిమా ట్రైలర్ కి ఊహించని విధంగా రెస్పాన్స్ వచ్చింది. దాదాపు రెండు వందల కోట్ల వరకూ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఏ స్దాయిలో ప్రబావం చూపిస్తుందో అని ఆసక్తిగా చూస్తున్నారు.


Unbelievable record of Baahubali trailer

కీరవాణి నేపధ్యసంగీతం, అంతర్జాతీయ ప్రమాణాలతో రూపొందిన గ్రాఫిక్స్, ప్రభాస్ రాజసం, రానా లుక్స్, వార్ ఎపిసోడ్స్, వాటర్ ఫాల్ షాట్స్ ట్రైలర్ కి హై లైట్ గా నిలిచాయి. రాజమౌళి నే అంతా సినీ బాహుబలి అని పిలుస్తున్నారు.


ప్రభాస్‌, రానా, తమన్నా, అనుష్క ప్రధాన పాత్రధారులుగా ఆర్కా మీడియా వర్క్స్‌ పతాకంపై శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని నిర్మిస్తున్న ఈ చిత్రానికి కె.రాఘవేంద్రరావు సమర్పకుడు. హిందీలో ఈ చిత్రాన్ని కరణ్‌ జోహార్‌, ఎ.ఎ.ఫిల్మ్స్‌ సంయుక్తంగా విడుదల చేస్తున్నాయి. సినిమా తెలుగు ట్రైలర్‌ను చిత్రబృందం సోమవారం కొన్ని థియేటర్లతో పాటు, ఆన్‌లైన్‌లో కూడా విడుదల చేసింది.


Unbelievable record of Baahubali trailer

హిందీ ట్రైలర్‌ను కరణ్‌ జోహార్‌ ఆధ్వర్యంలో ముంబయిలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆవిష్కరించారు. ఇప్పటివరకు ఫస్ట్‌లుక్‌ల రూపంలో విడుదల చేసిన ప్రధాన పాత్రలన్నీ ట్రైలర్‌లో కనిపించాయి. సినిమా నేపథ్య ప్రాంతం 'మహిష్మతి' రాజ్యం పరిచయమైంది. ముంబయిలో జరిగిన ట్రైలర్‌ విడుదల కార్యక్రమంలో రాజమౌళి, ప్రభాస్‌, రానా, అనుష్క, తమన్నా తదితరులు పాల్గొన్నారు.


అలాగే నిన్నటి రోజు ఉదయం వినూత్నంగా పలు థియేటర్లలో ఈ చిత్రం ట్రైలర్‌ను ఉచితంగా ప్రదర్శించారు. ఆన్‌లైన్‌లో విడుదలకు ముందే ట్రైలర్‌ను వీక్షించిన అభిమానులు వివిధ సోషల్‌ మీడియా మాధ్యమాల ద్వారా వారి ఆనందాన్ని పంచుకున్నారు. జులై 10న ఈ చిత్రం పేక్షకుల ముందుకు రానుంది.

English summary
SS Rajamouli directorial "Baahubali" trailer has garnered above 8lakhs hits within just 16 hours of uploading
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu