Upendra Kabza Collections: మరో KGF అన్నారు.. కానీ బాక్సాఫీస్ వద్ద ఊహించని దెబ్బ.. పాపం నిర్మాత!
కన్నడ సినిమా పరిశ్రమలో కూడా ఇటీవల కాలంలో భారీ బడ్జెట్ సినిమాలు బాగానే తెరకెక్కుతున్నాయి. ముఖ్యంగా కేజీఎఫ్ సినిమా వచ్చిన తర్వాత అక్కడ ఇండస్ట్రీకి మంచి గుర్తింపు అయితే దక్కింది. ఇక కాంతార సినిమా కూడా మరో లెవెల్ కు తీసుకువెళ్ళింది. అయితే KGF తరహాలోనే కబ్జా సినిమాను కూడా ఇటీవల తెరపైకి తీసుకు వచ్చారు. అయితే సినిమా మాత్రం ఊహించని విధంగా నెగిటివ్ టాక్ అందుకుంది. ఇక మొత్తంగా నాలుగు రోజుల్లో ఈ సినిమా ఎంత కలెక్ట్ చేసింది ఏ స్థాయిలో నష్టాలను కలుగజేయబోతోంది అనే వివరాల్లోకి వెళితే..

పాన్ ఇండియా ప్రాజెక్టుగా
భారీ బడ్జెట్ తో తెరపైకి వచ్చిన ఈ సినిమా లో ఉపేంద్ర సుదీప్ శివరాజ్ కుమార్ కలిసి నటించారు. ఇక కబ్జా సినిమాపై మొదటి నుంచి కూడా కన్నడ ఇండస్ట్రీలో భారీ అంచనాలు నెలకొన్నాయి. అలాగే తెలుగులో కలెక్షన్స్ అందుకోవచ్చు అని కూడా అంచనాలు ఏర్పడ్డాయి. సినిమాను పాన్ ఇండియా ప్రాజెక్టుగా ఈనెల 17వ తేదీన విడుదల చేశారు. ఇక ఈ సినిమాలో శ్రియ కూడా ఒక ముఖ్యమైన పాత్రలో నటించింది.

ఏపీ, నైజాం కలెక్షన్స్
కబ్జా సినిమా తప్పకుండా బాక్స్ ఆఫీస్ వద్ద KGF తరహాలోని సక్సెస్ అందుకుంటుంది అని చిత్ర యూనిట్ సభ్యులు ప్రమోషన్స్ అయితే బాగానే చేశారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన కలెక్షన్స్ వివరాలలోకి వెళితే తెలుగు రాష్ట్రాల్లో అయితే ఈ సినిమాకు పెద్దగా ఓపెనింగ్స్ ఏమీ దక్కలేదు. మొత్తంగా ఈ సినిమా ఏపీ నైజంలో నాలుగు రోజుల్లో 2.50 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ 1.20 కోట్ల వరకు షేర్ కలెక్షన్స్ అందుకుంది.

తెలుగులో ఎంత రావాలంటే..
కబ్జా సినిమా తెలుగు మార్కెట్లో అయితే పెద్దగా బిజినెస్ కూడా చేయలేకపోయింది. మొత్తంగా ఈ సినిమాను 3 కోట్ల రేంజ్ లో అయితే ఫ్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు సమాచారం. ఇక నాలుగు రోజుల్లో ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో 1.20 కోట్ల షేర్ అందుకుంది. ఇక మూడు కోట్ల టార్గెట్ ను అందుకోవాలి అంటే ఇంకా 1.80 కోట్ల రేంజ్ లో షేర్ రావాల్సి ఉంటుంది.

వరల్డ్ వైడ్ కలెక్షన్స్
కబ్జా సినిమా 4 రోజులు పూర్తి చేసుకున్న తర్వాత వరల్డ్ వైడ్ గా కూడా పెద్దగా కలెక్షన్స్ ఏమీ పెరగలేదు. కర్ణాటకలోని ఈ సినిమాకు చాలా తక్కువ స్థాయిలో ఓపెనింగ్స్ వచ్చాయి. కర్ణాటకలో 4 రోజుల్లో 19 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చింది. ఇక తమిళనాడులో 68 లక్షలు కేరళలో 40 లక్షలు మిగిలిన రాష్ట్రాల్లో 3 కోట్లు, ఓవర్సీస్ లో 1. 40 కోట్లు రేంజ్ లో కలెక్షన్స్ వచ్చాయి. మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు 4 రోజుల్లో 27 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ 13.7 కోట్ల షేర్ కలెక్షన్స్ దక్కింది.

టోటల్ గా ఎంత రావాలి?
ఇక బాక్స్ ఆఫీస్ వద్ద మొత్తంగా కబ్జా సినిమా 46 కోట్ల టార్గెట్ తో విడుదల అయింది. ఇక ఈ సినిమా ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 13.27 కోట్ల రేంజ్ లో షేర్ కలెక్షన్స్ అందుకుంది. ఇక సక్సెస్ కావాలి అంటే 32.73 కోట్ల షేర్ కలెక్షన్స్ రావాల్సి ఉంది. కానీ ఈ సినిమా నాలుగో రోజు డౌన్ కావడంతో మొత్తంగా మరో 5 కోట్లు అయినా వస్తాయో రావో అనే అనుమానాలు ఏర్పడుతున్నాయి. మరి మిగిలిన రోజులలో సినిమా మొత్తం గా ఎంతవరకు కలెక్ట్ చేస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











