వందకోట్ల పోస్టర్.. ఉప్పెనపై సుకుమార్ చెప్పిందే నిజమైందా?
ఉప్పెన సినిమా సాధిస్తోన్న రికార్డులు, నిర్మాతలు ప్రకటిస్తోన్న కలెక్షన్లు లెక్కల గురించి అందరికీ తెలిసిందే. ఉప్పెన సినిమాకు టాక్ అదిరిపోయిందని, కలెక్షన్లు కూడా దుమ్ములేపుతున్నాయని అందరికీ తెలిసిందే. అయితే ట్రేడ్ వర్గాల లెక్కలకు, నిర్మాతలు ప్రకటిస్తోన్న లెక్కలకు మధ్య తేడా ఉంటోందని విమర్శలు కూడా వచ్చాయి. అయితే అవన్నీంటిని పట్టించుకోని నిర్మాతలు తాజాగా మరో అడుగు ముందుకు వేశారు.

సుకుమార్ నాడు అలా..
ఉప్పెన సినిమా విడుదల కాకముందే సుకుమార్ దాని భవిష్యత్తు ఫలితాన్ని అంచనా వేసేశాడు.ప్రీ రిలీజ్ ఈవెంట్ నాడే.. ఉప్పెన కలెక్షన్ల సత్తాను చాటిచెప్పాడు. వంద కోట్ల సినిమా అవుతుందని ఎంతో ధీమాగా అన్నాడు. ఇక మొదటి ఆట ముగిశాక మరోసారి అందరి ముందే వంద కోట్ల సినిమా అవుతుందని చెప్పుకొచ్చాడు.

కలెక్షన్లలో రికార్డులు..
అయితే ఉప్పెన సినిమా కలెక్షన్లలో కొత్త రికార్డులు క్రియేట్ చేస్తోందన్న విషయం మాత్రం అందరూ అంగీకరించదగినదే. విడుదలై నాలుగు వారాలు గడిచినా కూడా కలెక్షన్లు మాత్రం తగ్గడం లేదు. బరిలోకి ఎన్ని కొత్త చిత్రాలు దిగినా కూడా ఉప్పెన కలెక్షన్లే ఎక్కువగా ఉంటున్నాయి.

22వ రోజు అలా..
ఉప్పెన 22వ రోజు ఓ మాదిరి కలెక్షన్లను సాధించింది. పది లక్షల షేర్‌ను మాత్రమే కొల్లగొట్టింది. అలా మొత్తంగా 22వ రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ. 46.54 కోట్ల షేర్, రూ. 76.28 కోట్ల గ్రాస్ అందుకుంది. ఇక ఓవర్సీస్, రెస్టాప్ ఇండియా ఇలా అన్ని లెక్కలు వేసి చూస్తే దగ్గరదగ్గరగా 80 కోట్ల గ్రాస్‌ను సాధించినట్టు తెలుస్తోంది.

వంద కోట్ల పోస్టర్..
అయితే తాజాగా ఉప్పెన నిర్మాణ సంస్థ అయిన మైత్రీ మూవీస్ ఓ పోస్టర్‌ను విడుదల చేసింది. వంద కోట్ల గ్రాస్‌ను కొల్లగొట్టిందంటూ తెలిపేలా ఓ పోస్టర్‌ను విడుదల చేశారు. మొత్తానికి సుకుమార్ అన్నట్టుగా ఉప్పెన వంద కోట్ల సినిమా అని నిరూపించేశారు.

కలెక్షన్లపై అనుమానాలు..
ట్రేడ్ వర్గాలు చెబుతున్న లెక్కలకు, ఇప్పుడు వీరు వదిలిన పోస్టర్‌కు చాలా తేడాలున్నాయని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇందులో ఏది నిజం, ఏది అబద్దం అంటూ జుట్టు పీక్కుంటున్నారు. ఈ లెక్కల విషయాలు పక్కన పెడితే ఉప్పెన మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ అని అందరూ ఏకాభిప్రాయంతో ఒప్పుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











