Uppena 6th day collections: 21 ఏళ్ల రికార్డు పటాపంచలు.. హృతిక్ రికార్డు బ్రేక్ చేసిన వైష్ణవ్ తేజ్

మెగా హీరో వైష్ణవ్ తేజ్, నూతన దర్శకుడు బుచ్చిబాబు కాంబినేషన్‌లో వచ్చిన ఉప్పెన చిత్రం స్టడీగా వసూళ్లను రాబడుతున్నది. ఈ చిత్రం ఇప్పటికే 50 కోట్ల గ్రాస్ వసూళ్లను అధిగమించడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేస్తున్నది. ఇక 6వ రోజు ఉప్పెన చిత్రం ఏ రేంజ్ కలెక్షన్లను రాబట్టిందంటే..

Recommended Video

Uppena Movie First Day Collections | Vaishnav Tej Record
50 కోట్లకుపైగా వసూళ్లతో

50 కోట్లకుపైగా వసూళ్లతో

ఉప్పెన చిత్రం విడుదలైన మొదటి ఆట నుంచే భారీ వసూళ్లను నమోదు చేస్తున్నది. ఈ చిత్రం ఇప్పటికే రూ.30 కోట్లకుపైగా షేర్‌ను, రూ.50 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఓ డెబ్యూ హీరో ఈ రేంజ్‌లో రికార్డు సాధించడం ఇదే మొదటి సారి. దాదాపు 21 క్రితం ఉన్న రికార్డును వైష్ణవ్ తేజ్ తిరగరాశాడు.

హృతిక్ రికార్డును అధిగమించిన వైష్ణవ్

హృతిక్ రికార్డును అధిగమించిన వైష్ణవ్

దేశవ్యాప్తంగా కలెక్షన్లను పరిశీలిస్తే.. హృతిక్ రోషన్ ఎంట్రీ ఇచ్చిన కహో నా ప్యార్ హై చిత్రం అప్పట్లో సునామీలా కలెక్షన్లను నమోదు చేసింది. అప్పట్లో ఓ డెబ్యూ హీరోగా హృతిక్ చిత్రం రూ.40 కోట్లకుపైగా నికర వసూళ్లను సాధించింది. ఇప్పటి వరకు హృతిక్ పేరిట ఉన్న రికార్డును వైష్ణవ్ తేజ్ సొంతం చేసుకొన్నారు.

6వ రోజు కలెక్షన్లు ఇలా..

6వ రోజు కలెక్షన్లు ఇలా..

ఇలాంటి రికార్డుల పరంపరలో ఉప్పెన చిత్రం 6వ రోజు కలెక్షన్లు ఓ మోస్తారుగా కనిపించాయి. ఈ చిత్రం నైజాంలో 54 లక్షలు, సీడెడ్‌లో 31 లక్షలు, ఉత్తరాంధ్రలో 40 లక్షలు, తూర్పు గోదావరి జిల్లాలో 24 లక్షలు, పశ్చిమ గోదావరి జిల్లాలో 11 లక్షలు, గుంటూరులో 12 లక్షలు, కృష్ణా జిల్లాలో 12.4 లక్షలు, నెల్లూరులో 8.6 లక్షలు వసూలు చేసింది.

 వసూళ్లలో కాస్త క్షీణత

వసూళ్లలో కాస్త క్షీణత

ఉప్పెన 6 రోజు మొత్తం కలెక్షన్ల విషయానికి వస్తే.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ చిత్రం రూ.1.93 కోట్లు నికర వసూళ్లను, 3.4 కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది. గత 5 రోజుల వసూళ్లను చూస్తే భారీగా కలెక్షన్లు తగ్గినట్టు కనిపిస్తున్నది. అయితే 6వ రోజున ఈ చిత్రం రూ.54.4 కోట్ల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది.

60 కోట్లకు చేరువైన ఉప్పెన

60 కోట్లకు చేరువైన ఉప్పెన

ఇక ప్రపంచవ్యాప్తంగా ఉప్పెన వసూళ్లను పరిశీలిస్తే.. 6 రోజు ముగిసే సమయానికి ఈ చిత్రం రూ.60 కోట్ల కలెక్షన్లకు చేరువైంది. కర్ణాటక, ఇతర రాష్ట్రాలు, ఓవర్సీస్ వసూళ్లతో ఈ చిత్రం రికార్డులు తిరగరాస్తున్నది. ఇప్పటికే ఈ చిత్రం రూ.15 కోట్ల లాభాలను సొంతం చేసుకొన్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X