Uppena 9th day collections: సుకుమార్ టార్గెట్‌కు దూరంగానే.. వైష్ణవ్ తేజ్ మూవీకి గట్టి పోటీగా..
లాక్‌డౌన్‌తో కష్టాల్లో కూరుకుపోయిన తెలుగు సినీ పరిశ్రమకు చిన్న చిత్రాలు మంచి ఊపును, జోష్‌ను కలిగించాయి. లాక్‌డౌన్ తర్వాత థియేటర్లలో రిలీజైన సోలో బతుకే సో బెటర్, 30 రోజుల్లో ప్రేమించడం ఎలా, జాంబిరెడ్డి చిత్రాలు ప్రేక్షకులను మెప్పించాయి. ఆ తర్వాత రిలీజైన ఉప్పెన చిత్రం తెలుగు సినిమా పరిశ్రమలోని కొన్ని రికార్డులను తిరగరాస్తూ భారీ కలెక్షన్లను సాధిస్తున్నది. ఉప్పెన చిత్రం 9వ రోజు కలెక్షన్లు ఇలా ఉన్నాయి.
Recommended Video
మలయాళీ ముద్దుగమ్మగా సన్నీలియోన్.. కేరళ కుట్టిగా అందంతో ఆకట్టుకొంటూ

ఉప్పెన రోజువారీ కలెక్షన్లు
ఉప్పెన చిత్రం కలెక్షన్లూ ట్రేడ్, సినీ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ఈ చిత్రం తొలి రోజున రూ.9.35 కోట్ల కలెక్షన్లతో జైత్రయాత్రను ప్రారంభించింది. రెండో రోజు రూ.6.86, మూడో రోజు 8.26 కోట్లు, నాలుగు రోజు రూ.4.17 కోట్లు, ఐదో రోజు రూ.3.12 కోట్లు, ఆరో రోజు 1.93 కోట్లు, ఏడో రోజు రూ.1.44 కోట్లు, ఎనిమిదో రోజు రూ.1.23 కోట్లు, తొమ్మిదో రోజు రూ.1.49 కోట్లు రాబట్టింది.

9వ రోజున ఉప్పెన వసూళ్లు
ఇక 9వ రోజు ఏరియాలో వారీగా ఉప్పెన సాధించిన వసూళ్ల విషయానికి వస్తే.. నైజాంలో ఈ చిత్రం రూ.43 లక్షలు, సీడెడ్‌లో రూ.24 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ.34 లక్షలు వసూలు చేసింది. అయితే కొద్ది రోజులుగా ఉప్పెనకు పోటీ పెరడంతో వసూళ్లు కూడా నెమ్మదించాయి.

ఆంధ్రాలో 9వ రోజు
ఇక ఆంధ్రా విషయానికి వస్తే కలెక్షన్ల విషయంలో అదే పరిస్థితి కనిపిస్తున్నది. తూర్పు గోదావరి జిల్లాలో రూ.16 లక్షలు, పశ్చిమ గోదావరి రూ.7.4 లక్షలు, గుంటూరు రూ. 8.7 లక్షలు, కృష్ణా జిల్లాలో రూ.9 లక్షలు, నెల్లూరులో రూ.7 లక్షలు వసూలు చేసింది.

మొత్తం 9 రోజులు కలెక్షన్లు
ఇదిలా ఉండగా, మొత్తం తొమ్మిది రోజుల్లో ఉప్పెన ప్రాంతాల వారీగా వసూళ్లను ఇలా రాబట్టింది. నైజాంలో రూ.12.26 కోట్ల షేర్, సీడెడ్‌లో రూ.6.10 కోట్ల షేర్, ఉత్తరాంధ్రలో రూ.6.83 కోట్లు, తూర్పు గోదావరి జిల్లాలో రూ.3.96 కోట్లు, పశ్చిమ గోదావరి రూ.2.22 లక్షలు, గుంటూరు రూ. 2.42 లక్షలు, కృష్ణా జిల్లాలో రూ.2.42 లక్షలు, నెల్లూరులో రూ.1.40 లక్షలు వసూలు చేసింది.

రూ. 41 కోట్ల నికరం.. 65 కోట్ల గ్రాస్ వసూళ్లు
ఇక తొమ్మిదో రోజు సాధించిన రూ.1.49 కోట్లు నికర వసూళ్లు, రూ.2.25 కోట్ల గ్రాస్ కలెక్షన్లతో ఈ చిత్రం మొత్తంగా రూ.41.10 కోట్లు షేర్, రూ.65 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. ఇప్పటికే బిజినెస్‌కు మించిన లాభాలాను సాధించి బ్లాక్‌బస్టర్ టాక్‌ను సొంతం చేసుకొన్నది. అయితే దర్శకుడు సుకుమార్ ఊహించినట్టు ఈ చిత్రం రూ.100 కోట్లు వసూలు చేస్తుందా అనే విషయాన్ని వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











