Uppena Collections.. దూసుకుపోతోన్న ఉప్పెన.. ఇప్పటి వరకు ఎంత వచ్చిందంటే?
ఉప్పెన చిత్రం ఇంకా తన ధాటిని కొనసాగిస్తూనే ఉంది. బాక్సాఫీస్ వద్ద ఉప్పెనలా దూసుకుపోతూనే ఉంది. ఇప్పటికే రెండింతల లాభాన్ని తన ఖాతాలో వేసుకుంది ఉప్పెన. మూడో వారంలో అడుగుపెట్టినా కూడా వసూళ్లు మాత్రం ఆగడం లేదు. ఇప్పటి వరకు సాధించిన లెక్కలన్నీ ఒకెత్తు అయితే.. తాజాగా మేకర్స్ తీసుకున్న నిర్ణయాలు మరో ఎత్తు. ఇంతగా లాభాలు వస్తుండటంతో.. హీరో హీరోయిన్ దర్శకుడి అదనపు పారితోషకాలు ఇచ్చినట్టు తెలుస్తోంది. ఉప్పెన 16వ రోజు వసూళ్లు ఎలా ఉన్నాయో ఓ సారి చూద్దాం.

పదహారో రోజు అలా..
ఉప్పెన పదహారో రోజు బాగానే దూసుకుపోయింది. ఏరియాల వారిగా చూసుకుంటే.. నైజాంలో 21లక్షలు, సీడెడ్‌లో 10లక్షలు, ఉత్తరాంధ్రలో 8లక్షలు, ఈస్ట్ 6లక్షలు, వెస్ట్ 2.3లక్షలు, గుంటూరు 2.9లక్షలు, కృష్ణా 3.1లక్షలు, నెల్లూరు 2లక్షలను కొల్లగొట్టేసింది.

మొత్తంగా పదహారో రోజు ఎంతంటే..
అయితే మొత్తంగా ఉప్పెన పదహారో రోజు మంచి వసూళ్లనే సాధించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో 55లక్షల షేర్‌ను కొల్లగొట్టింది.. 95లక్షల గ్రాస్‌ను వసూళ్లు చేసింది. ఇక మొత్తంగా పదహారో రోజుల్లో ఉప్పెన ఎంత కొల్లగొట్టిందంటే..

మొత్తంగా ఎంతంటే..
ఉప్పెన ఈ పదహారు రోజుల్లో ఏరియాల వారిగా చూసుకుంటే ఎంత కొల్లగొట్టిందంటే.. నైజాంలో 14.41కోట్లు, సీడెడ్‌లో 7.11కోట్లు, ఉత్తరాంధ్రలో 8.08కోట్లు, ఈస్ట్ 4.66కోట్లు, వెస్ట్ 2.48కోట్లు, గుంటూరు 2.78కోట్లు, కృష్ణా 2.95 కోట్లు, నెల్లూరు 1.64కోట్లను కొల్లగొట్టేసింది. అలా మొత్తంగా ఇప్పటి వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో 71.15కోట్ల గ్రాస్.. 44.11 కోట్ల షేర్ సాధించింది.

అన్నీ కలిపి..
రెండు తెలుగు రాష్ట్రాల్లో 71.15కోట్ల గ్రాస్‌ను కొల్లగొట్టగా.. కర్ణాటక రెస్టాఫ్ ఇండియాలో కలిపి 2.25కోట్లు, ఓవర్సీస్‌లో 1.33కోట్లు వచ్చాయి. అలా మొత్తంగా 76.75 కోట్ల గ్రాస్.. 47.69కోట్ల షేర్‌ను రాబట్టింది. అయితే మొత్తంగా ఇప్పటి వరకు ఉప్పెనకు కళ్లు చెదిరే లాభాలు వచ్చాయి.

ఎంత లాభం అంటే..
ఉప్పెన మూవీ మొత్తంగా 20.5 కోట్ల మేరకు బిజినెస్ చేసింది. అయితే ఈ మొత్తాన్ని కూడా మూడు నాలుగు రోజుల్లోనే రాబట్టేసింది. 21 కోట్ల షేర్ రాబడితే బ్రేక్ ఈవెన్ సాధించే ఈ మూవీకి ఇప్పటికి 47కోట్ల షేర్ వచ్చింది. అంటే దాదాపుగా 26.69 కోట్ల లాభాలు వచ్చాయి. మొత్తంగా ఇది డబుల్ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది.


Click it and Unblock the Notifications











