Uppena collections ఇది ఎవ్వరికీ అందని రికార్డ్.. మొదటి వారంలో కళ్లు తిరిగే కలెక్షన్స్
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉప్పెన జోరు ఇంకా తగ్గడం లేదు. మొదటి రోజు నుంచి కలెక్షన్ల జోరు పుంజుకుంటూనే ఉంది. మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించి నిర్మాతలకు లాభాల పంట పండిస్తోంది ఉప్పెన. ఇప్పటికీ కళ్లు చెదిరే కలెక్షన్లతో దూసుకుపోతోంది. మొత్తానికి విజయవంతంగా మొదటి వారం గడిచింది. ఈ వారంలోనే ఉప్పెన బాక్సాఫీస్ పని పట్టేసింది. అలా మొత్తం వారంలో ఎంత కొల్లగొట్టిందో తాజాగా నిర్మాతలు ప్రకటించింది.

టాక్‌తో సంబంధం లేకుండా..
ఉప్పెనకు టాక్‌తో సంబంధం లేకుండా కలెక్షన్ల వర్షం కురుస్తోంది. ముందు నుంచి అంచనాలు భారీగానే ఉండటంతో ఫస్ట్ డే కలెక్షన్లలో కొత్త రికార్డులు క్రియేట్ చేసింది. పది కోట్లకు పైగా షేర్ కొల్లగొట్టి ఔరా అనిపించింది ఉప్పెన. ఓ డెబ్యూ హీరోకు ఈ రేంజ్ ఓపెనింగ్స్ అంటే మామూలు విషయం కాదు.

అందరూ కొత్తవాళ్లే..
దర్శకుడు, హీరో, హీరోయిన్లు ఇలా అందరూ కొత్తవాళ్లే. అయినా కూడా సినిమా అలా లేదు.. దాని రిజల్ట్ అలా లేదు. బాక్సాఫీస్ వద్ద రికార్డులను కుమ్మేస్తోంది. మొదటి మూడు రోజుల్లోనే రూ.30 కోట్లకుపైగా షేర్‌ను, రూ.50 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఇలా ఓ డెబ్యూ హీరోకు ఇంతలా వసూళ్లు రావడం తెలుగులో ఇదే మొదటి సారి.

ఎవ్వరికీ అందని రికార్డ్..
ఇలా మొదటి సినిమాతోనే వసూళ్ల ప్రభంజనం సృష్టించడం ఎవ్వరి వల్లా కాలేదు. బన్నీ, చెర్రీ, ప్రభాస్ ఇలా ఎవ్వరూ కూడా తమ మొదటి చిత్రంతోనే ఇంతటి భారీ బ్లాక్ బస్టర్‌ను సొంతం చేసుకోలేదు. ఇకపై ఎవ్వరూ కూడా ఇలాంటి రికార్డును సొంతం చేసుకోకపోవచ్చు.

ఏడో రోజు అలా..
సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 7వ రోజు సాలిడ్‌గా హోల్డ్ చేసి 1.44 కోట్ల షేర్ ని రెండు తెలుగు రాష్ట్రాలలో సొంతం చేసుకుంది. అంటే6 వ రోజు వచ్చిన 1.93 కోట్లతో పోల్చితే 20% శాతం తక్కువే. అయినా కూడా బాక్సాఫీస్ వద్ద ఇంకా ఉప్పెన జోరు కొనసాగుతూనే ఉంది.

70 కోట్ల గ్రాస్..
అయితే తాజాగా ఉప్పెన నిర్మాతలు మైత్రీ తాజాగా ఓ పోస్టర్‌ను రిలీజ్ చేసింది. ఈ సినిమా 70 కోట్ల గ్రాస్‌ను కొల్లగొట్టిందని అధికారికంగా ప్రకటించారు. మొత్తంగా మొదటి వారంలో 70 కోట్ల గ్రాస్‌ను అందుకుని ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేసింది. రెండో వారంలోనూ ఉప్పెన జోరు కొనసాగేలానే కనిపిస్తోంది. కపటధారి, నాంది, చక్ర వంటివి బరిలో ఉన్నా కూడా ఉప్పెన దూసుకెళ్లేలానే ఉంది.


Click it and Unblock the Notifications











