twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    దమ్మున్న మూవీ అంటే ఇదేరా... ‘బాహుబలి-2’ రికార్డులను బద్దలు కొట్టింది!

    |

    రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన 'బాహుబలి-2' ఇండియన్ బాక్సాఫీసు వద్ద క్రియేట్ చేసిన వసూళ్ల సునామీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆ రికార్డులు బద్దలు కొట్టాలంటే ఆ స్థాయి మూవీ లేదా బిగ్గ్ స్టార్స్ నటించిన సినిమాలతోనే సాధ్యం అనే అభిప్రాయాలు వ్యక్తం అయ్యేవి. అయితే పెద్ద స్టార్స్ లేక పోయినా సినిమాలో దమ్ముంటే ఆ రికార్డులు బద్దలు కొట్టడం సాధ్యమే అని తాజాగా రుజువైంది.

    విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో నటించిన 'యురి-ది సర్జికల్ స్ట్రైక్' అనే చిత్రం బాక్సాఫీసు వద్ద సంచలనాలు నమోదు చేస్తూ దూసుకెళుతోంది. తాజాగా ఇది 23, 24వ రోజు(శని, ఆదివారం) బాహుబలి-2 రికార్డులను బద్దలు కొట్టి చరిత్ర సృష్టించింది.

    23వ రోజు బాహుబలి 2 రికార్డ్ బద్దలు

    23వ రోజు బాహుబలి 2 రికార్డ్ బద్దలు

    సినిమా విడుదలైన 23వ(4వ శనివారం) రోజు బాహుబలి-2 చిత్రం రూ. 6.35 కోట్లు వసూలు చేయగా, యురి-ది సర్జికల్ స్ట్రైక్ రూ. 6.53 కోట్లు రాబట్టి ఆ రికార్డును బద్దలు కొట్టింది. ‘యురి-ది సర్జికల్ స్ట్రైక్' వసూళ్లు ఇంత స్ట్రాంగ్‌గా ఉండటం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్య పరుస్తోంది.

    24వ రోజు రికార్డ్ సైతం ఢమాల్

    24వ రోజు రికార్డ్ సైతం ఢమాల్

    బాహుబలి 2 మూవీ 24వ రోజు (4వ ఆదివారం) రికార్డు రూ. 7.80 కోట్లు సైతం ‘యురి-ది సర్జికల్ స్ట్రైక్' మూవీ దెబ్బకు ఢమాల్ అనక తప్పలేదు. ఇది రూ. 8.71 కోట్లు రాబట్టింది. దీంతో ఈ మూవీ ఇంకెన్ని రికార్డులను నమోదు చేస్తుందో అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

    బాక్సాఫీస్‌ను కుదిపేస్తున్న యూరీ చిత్రం.. 200 కోట్లు కొల్లగొట్టేందుకు..బాక్సాఫీస్‌ను కుదిపేస్తున్న యూరీ చిత్రం.. 200 కోట్లు కొల్లగొట్టేందుకు..

    టోటల్ కలెక్షన్ రూ. 189.7 కోట్లు

    టోటల్ కలెక్షన్ రూ. 189.7 కోట్లు

    24 రోజుల్లో ఇండియన్ బాక్సాఫీసు వద్ద ‘యురి-ది సర్జికల్ స్ట్రైక్' రూ. 189.7 కోట్లు వసూలు చేసింది. త్వరలోనే ఈ చిత్రం రూ. 200 కోట్ల మార్కును అందుకుంటుందని అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

    భారీ లాభాలు

    భారీ లాభాలు

    కేవలం రూ. 45 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ‘యురి-ది సర్జికల్ స్ట్రైక్' చిత్రాన్ని ఆధిత్య ధర్ దర్శకత్వం వహించారు. 2016లో యురిలో మిలటరీ బేస్ క్యాంపుపై జరిగిన సంఘటన ఆధారంగా దీన్ని తెరకెక్కించారు. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే రూ. 245 కోట్లు రాబట్టి నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు భారీ లాభాలు తెచ్చిపెట్టింది.

    English summary
    "Uri The Surgical Strike creates HISTORY. Smashes Day 23, Day 24 records held by Baahubali2. Day 23 Baahubali2 ₹ 6.35 cr... Uri ₹ 6.53 cr, Day 24 Baahubali2 ₹ 7.80 cr... Uri ₹ 8.71 cr. Now Uri holds the record of highest Day 23 and Day 24. MONSTROUS HIT!" Taran Aadarsh tweeted.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X