Don't Miss!
- News మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లేలా మరింత ఉధృతంగా వైఎస్ జగన్ చివరి విడత ప్రచారం
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్‌లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్‌కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్‌మి 5G స్మార్ట్‌ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
దమ్మున్న మూవీ అంటే ఇదేరా... ‘బాహుబలి-2’ రికార్డులను బద్దలు కొట్టింది!
రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన 'బాహుబలి-2' ఇండియన్ బాక్సాఫీసు వద్ద క్రియేట్ చేసిన వసూళ్ల సునామీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆ రికార్డులు బద్దలు కొట్టాలంటే ఆ స్థాయి మూవీ లేదా బిగ్గ్ స్టార్స్ నటించిన సినిమాలతోనే సాధ్యం అనే అభిప్రాయాలు వ్యక్తం అయ్యేవి. అయితే పెద్ద స్టార్స్ లేక పోయినా సినిమాలో దమ్ముంటే ఆ రికార్డులు బద్దలు కొట్టడం సాధ్యమే అని తాజాగా రుజువైంది.
విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో నటించిన 'యురి-ది సర్జికల్ స్ట్రైక్' అనే చిత్రం బాక్సాఫీసు వద్ద సంచలనాలు నమోదు చేస్తూ దూసుకెళుతోంది. తాజాగా ఇది 23, 24వ రోజు(శని, ఆదివారం) బాహుబలి-2 రికార్డులను బద్దలు కొట్టి చరిత్ర సృష్టించింది.
23వ రోజు బాహుబలి 2 రికార్డ్ బద్దలు
సినిమా విడుదలైన 23వ(4వ శనివారం) రోజు బాహుబలి-2 చిత్రం రూ. 6.35 కోట్లు వసూలు చేయగా, యురి-ది సర్జికల్ స్ట్రైక్ రూ. 6.53 కోట్లు రాబట్టి ఆ రికార్డును బద్దలు కొట్టింది. ‘యురి-ది సర్జికల్ స్ట్రైక్' వసూళ్లు ఇంత స్ట్రాంగ్‌గా ఉండటం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్య పరుస్తోంది.
24వ రోజు రికార్డ్ సైతం ఢమాల్
బాహుబలి 2 మూవీ 24వ రోజు (4వ ఆదివారం) రికార్డు రూ. 7.80 కోట్లు సైతం ‘యురి-ది సర్జికల్ స్ట్రైక్' మూవీ దెబ్బకు ఢమాల్ అనక తప్పలేదు. ఇది రూ. 8.71 కోట్లు రాబట్టింది. దీంతో ఈ మూవీ ఇంకెన్ని రికార్డులను నమోదు చేస్తుందో అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
బాక్సాఫీస్‌ను కుదిపేస్తున్న యూరీ చిత్రం.. 200 కోట్లు కొల్లగొట్టేందుకు..
టోటల్ కలెక్షన్ రూ. 189.7 కోట్లు
24 రోజుల్లో ఇండియన్ బాక్సాఫీసు వద్ద ‘యురి-ది సర్జికల్ స్ట్రైక్' రూ. 189.7 కోట్లు వసూలు చేసింది. త్వరలోనే ఈ చిత్రం రూ. 200 కోట్ల మార్కును అందుకుంటుందని అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
భారీ లాభాలు
కేవలం రూ. 45 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ‘యురి-ది సర్జికల్ స్ట్రైక్' చిత్రాన్ని ఆధిత్య ధర్ దర్శకత్వం వహించారు. 2016లో యురిలో మిలటరీ బేస్ క్యాంపుపై జరిగిన సంఘటన ఆధారంగా దీన్ని తెరకెక్కించారు. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే రూ. 245 కోట్లు రాబట్టి నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు భారీ లాభాలు తెచ్చిపెట్టింది.