twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాక్సాఫీస్‌పై సర్జికల్ స్ట్రయిక్స్.. ఊపందుకొన్న యూరీ కలెక్షన్లు.. సింబా రికార్డుపై గురి!

    |

    బాలీవుడ్‌లో యూరి: ది సర్జికల్ స్ట్రయిక్స్ సినిమా ప్రభంజనం కొనసాగుతూనే ఉంది. తాజాగా సరిహద్దుల్లో చోటుచేసుకొన్న సంఘటనలతో యూరి చిత్రానికి మరోసారి క్రేజ్ పెరిగింది. దాంతో మళ్లీ సినిమా కలెక్షన్లలో వేగం పుంజుకొన్నది. ఈ ఏడాది రిలీజైన సినిమాల్లో అతిపెద్ద సక్సెస్ సాధించిన చిత్రంగా యూరి ఘనతను సాధించింది. మొత్తం కలెక్షన్లు ఎంతంటే..

     తొలి ఆట నుంచే భారీ కలెక్షన్లు

    తొలి ఆట నుంచే భారీ కలెక్షన్లు

    2016లో పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో భారత సేనలు చేసిన సర్జికల్ స్ట్రయిక్స్ ఆధారంగా రూపొందిన ఈ చిత్రానికి తొలి ఆట నుంచే థియేటర్లలో ప్రేక్షకుల నుంచి బ్రహ్మాండమైన స్పందన వ్యక్తమైంది. దాంతో ఈ సంవత్సరం విడుదలైన సింబా చిత్రం కలెక్షన్లను కూడా మించిపోయేలా కనిపిస్తున్నది.

     సింబా మూవీ రికార్డుపై కన్ను

    సింబా మూవీ రికార్డుపై కన్ను

    తాజా యూరీ కలెక్షన్ల వివరాలను ప్రముఖ ట్రేడ్ అనలిస్టు తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. యూరీ సర్జికల్ స్ట్రయిక్స్ చిత్రం బాక్సాఫీస్ వద్ద కుమ్మేస్తున్నది. ఎనిమిదో వారంలో ఈ చిత్రం భారీ కలెక్షన్లు రాబడుతున్నది. సింబా చిత్రం సాధించిన కలెక్షన్లపై ఈ సినిమా కన్నేసింది. త్వరలోనే సింబా వసూళ్లను అధిగమించడం ఖాయం అని తరుణ్ ట్వీట్‌లో పేర్కొన్నాడు.

    ‘యూరి: ది సర్జికల్ స్ట్రైక్' 50 రోజుల కలెక్షన్.. రూ. 237 కోట్లు!‘యూరి: ది సర్జికల్ స్ట్రైక్' 50 రోజుల కలెక్షన్.. రూ. 237 కోట్లు!

     రూ.250 క్లబ్ వైపు పరుగు

    రూ.250 క్లబ్ వైపు పరుగు

    యూరీ చిత్రం ఎనిమిదో వారంలో శుక్రవారం రోజున రూ.38 లక్షలు, శనివారం రూ.80 లక్షలు, ఆదివారం రూ.1.18 కోట్లు, సోమవారం రూ.67 లక్షలు సాధించింది. మొత్తంగా ఈ చిత్రం ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా రూ.240.38 కోట్లు వసూలు చేసింది. త్వరలోనే రూ.250 క్లబ్‌లో చేరిపోతుందని తరుణ్ ఆదర్శ్ ట్వీట్‌లో వెల్లడించారు.

     మరోసారి ఊపందుకొన్న వసూళ్లు

    మరోసారి ఊపందుకొన్న వసూళ్లు

    ఇటీవల చోటుచేసుకొన్న పుల్వామా దాడి, ఆ తర్వాత పాక్ భూభాగంలో భారత వాయు సేనల రెండో సర్జికల్ స్ట్రయిక్స్‌ ఘటనల తర్వాత యూరీ చిత్రంపై మరోసారి ఫోకస్ పెరిగింది. అలాగే పాక్ చెరలో అభినందన్ ఉండటం.. అనంతరం దేశభక్తి ప్రజల్లో ఉప్పొంగడంతో సినిమాపై మరింత క్రేజ్ పెరిగింది. దాంతో బలహీనంగా ఉన్న వసూళ్లు మరోసారి చెలరేగిపోతున్నాయి.

    English summary
    Vicky Kaushal starrer Uri: The Surgical Strike has turned out to be a blockbuster film. The film released on January 11, 2019, is based on the surgical strike conducted by the Indian military against the suspected militants in PoK happened in 2016. The film is inching closer to Rs 250 mark at the domestic box-office.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X