twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాక్సాఫీస్‌పై సర్జికల్ స్ట్రయిక్.. యూరీ మెరుపు కలెక్షన్లు..పాక్‌పై దాడి మాదిరిగానే!

    |

    పాకిస్థాన్ శత్రు సేనలపై భారత జవాన్లు జరిపిన మెరుపు దాడుల మాదిరిగానే యూరీ: ది సర్జికల్ స్ట్రయిక్ చిత్రం కలెక్షన్లను సాధిస్తున్నది. 2016 సెప్టెంబర్ 29న పాకిస్థాన్‌పై భారత్ చేసిన మెరుపుదాడుల కథతో రూపొందిన ఈ చిత్రం కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నది. పూర్తిస్థాయి ఎమోషనల్ కంటెంట్‌తో, దేశభక్తి, ఇతర అంశాలను మేళవించిన ఈ చిత్రానికి ఆదిత్య ధార్ దర్శకుడు. చిన్న బడ్జెట్ చిత్రంగా రూపొందిన ఈ సినిమా రూ.200 కోట్ల క్లబ్‌ వైపు దూసుకెళ్తూ ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తున్నది. వివరాల్లోకి వెళితే..

    రూ.200 కోట్ల క్లబ్ దిశగా

    రూ.200 కోట్ల క్లబ్ దిశగా

    యూరీ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా భారీ స్పందన వ్యక్తమవుతున్నది. త్వరలోనే ఈ చిత్రం రూ.200 కోట్ల మైలురాయిని చేరుకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సినిమా విజయం బాలీవుడ్ ఫిలింమేకింగ్‌ను, ప్రేక్షకుల అభిరుచిని గొప్పగా చాటిచెప్పిన చిత్రం అని ట్రేడ్ అనలిస్టు తరుణ్ ఆదర్శ్ వెల్లడించారు.

    ముంబైలో వసూళ్ల మోత

    ముంబైలో వసూళ్ల మోత

    యూరీ: సర్జికల్ స్ట్రయిక్స్ సినిమా ముంబై, ఢిల్లీ, యూపీలో వసూళ్ల మోత మోగిస్తున్నది. ముంబైలోనే ఈ చిత్రం రూ.50 కోట్ల మార్కును దాటింది. ఢిల్లీ, యూపీ సర్క్యూట్లలో రూ.25 కోట్లు రాబట్టింది. దేశవ్యాప్తంగా కలెక్షన్లలో ముంబై, ఢిల్లీ, యూపీ ప్రాంతాల్లో రూ.75 కోట్లు రాబట్టడం విశేషంగా పేర్కొన్నవచ్చును అని తరుణ్ మరో ట్వీట్‌లో పేర్కొన్నారు.

    10 రోజుల్లోనే కుమ్మేసింది... 100 కోట్ల కాసుల వర్షం.. బడ్జెట్ ఎంతో తెలిస్తే షాకే!10 రోజుల్లోనే కుమ్మేసింది... 100 కోట్ల కాసుల వర్షం.. బడ్జెట్ ఎంతో తెలిస్తే షాకే!

     రూ.150 కోట్ల మైలురాయిని

    రూ.150 కోట్ల మైలురాయిని

    దేశభక్తి ప్రధానంగా ఎమోషనల్ కంటెంట్‌తో రూపొందిన యూరీ చిత్రం ఆదివారం రూ.150 కోట్ల మైలురాయిని దాటింది. దేశవ్యాప్తంగాగా ఈ చిత్రం శుక్రవారం రూ.4.40 కోట్లు, శనివారం రూ.9.75 కోట్లు రాబట్టడంతో మొత్తం వసూళ్లు రూ.148.18 కోట్లకుకు చేరుకొన్నది. ఆదివారం కలెక్షన్లతో ఈ చిత్రం రూ.150 కోట్ల క్లబ్ చేరడం ఖాయంగా కనిపించింది.

    ఎదురులేని భారీ వసూళ్లతో

    ఎదురులేని భారీ వసూళ్లతో

    దేశభక్తి, భావోద్వేగ కథతో రూపొందిన ఈ చిత్రంలో సంజూ ఫేం వికీ కుషాల్, పరేష్ రావల్, యామీ గౌతమీ తదితరులు నటించారు. ఈ చిత్రాన్ని రోని స్క్రీవ్‌వాలా నిర్మించగా, ఆదిత్య ధార్ దర్శకత్వం వహించారు. రానున్న రోజుల్లో భారీ చిత్రాల విడుదల లేకపోవడం వల్ల ఈ చిత్ర వసూళ్లకు ఎదురే లేదనే మాట వినిపిస్తున్నది.

    English summary
    Vicky Kaushal's military drama 'Uri: The Surgical Strike' has emerged as 2019's first hit. In just three days of its release, the Aditya Dhar directorial has minted Rs 150 crore. 'Uri', that also stars Paresh Rawal, Yami Gautam and Mohit Raina in key roles. Trade analyst Taran Adarsh tweeted the figures that the film cross the Rs 200 crore mark soon.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X