Don't Miss!
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్‌తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్‌నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్‌బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
బాక్సాఫీస్‌ను కుదిపేస్తున్న యూరీ చిత్రం.. 200 కోట్లు కొల్లగొట్టేందుకు..
విలక్షణ నటుడు వికీ కౌశల్ నటించిన యూరి: ది సర్జికల్ స్ట్రయిక్ చిత్రం ఇప్పటికే బ్లాక్‌బస్టర్ టాక్‌ను సొంతం చేసుకొని సరికొత్త రికార్డుల వైపు దూసుకెళ్తున్నది. గతంలో రికార్డు స్థాయి కలెక్షన్లను సాధించిన సంజూ, పద్మావతి, సింబా చిత్రాల రికార్డులపై అధిపత్యం సాధించింది. ప్రస్తుతం నాలుగో వారంలోకి ప్రవేశించిన ఈ చిత్రం వసూళ్లు ఇలా ఉన్నాయి.
మూడో వారంలో కూడా భారీగా
యూరి చిత్రానికి సంబంధించిన మూడో వారం కలెక్షన్లు భారీగా ఉన్నాయి. మూడోవారం ఈ సినిమా రూ.31 కోట్లు సంపాదించింది. 21 రోజుల కలెక్షన్లను పరిగణనలోకి తీసుకొంటే సంజూ, పద్మావత్ లాంటి భారీ చిత్రాల వసూళ్ల గణాంకాలను బ్రేక్ చేయడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది.
ప్రపంచవ్యాప్తంగా మూడో వారం వసూళ్లు
యూరీ చిత్రంపై మూడోవారంలో కూడా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ప్రపంచవ్యాప్తంగా మూడో వారం శుక్రవారం రూ.4.40 కోట్లు, శనివారం రూ.9.86 కోట్లు, ఆదివారం రూ. 9.28 కోట్లు, సోమవారం రూ.3.43 కోట్లు, మంగళవారం రూ.3.39 కోట్లు, బుధవారం రూ.3.37 కోట్లు, గురువారం రూ.3.31 కోట్లు వసూలు చేసింది.
రూ.200 కోట్ల వైపు అడుగులు
యూరీ చిత్రం విడుదలైన తొలి ఆట నుంచే సానుకూలమైన టాక్‌ను సొంతం చేసుకొన్నది. ఈ చిత్రం తొలివారం రూ.71.26 కోట్లు, రెండోవారం రూ.62.77 కోట్లు, మూడో వారం 37.04 కోట్లు సాధించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం రూ.171.07 కోట్ల వసూళ్లను సాధించింది. నాలుగో వారంలో రూ.175 కోట్ల కలెక్షన్లను దాటే పరిస్థితి కనిపిస్తున్నది అని తరణ్ ఆదర్ష్ ట్వీట్ చేశారు.
ఓవర్సీస్లో 5 మిలియన్ల క్లబ్‌లోకి
ఓవర్సీస్ మార్కెట్లో యూరీ: ది సర్జికల్ స్ట్రయిక్ చిత్రం 5 మిలియన్ల యూఎస్ డాలర్లను సొంతం చేసుకొన్నది. అంటే ఈ చిత్రం సుమారు రూ.35.78 కోట్లు వసూలు చేసింది. అమెరికా, కెనడాలో కలిపి 2.8 మిలియన్ డాలర్లు, యూఏఈలో రూ.1.12 మిలియన్ డాలర్లు, ఆస్ట్రేలియాలో 540k డాలర్లు, యూకేలో 207K మిలియన్ డాలర్లు, సింగపూర్‌లో 175k డాలర్లు, న్యూజిలాండ్‌లో 91K, ఆఫ్రికా దేశాల్లో 38K, పోలండ్ 10కే, జర్మనీ 8K డాలర్లు వసూలు చేసింది.
దేశభక్తి ప్రధానంగా యూరీ
దేశభక్తి, భావోద్వేగ కథతో రూపొందిన ఈ చిత్రంలో సంజూ ఫేం వికీ కుషాల్, పరేష్ రావల్, యామీ గౌతమీ తదితరులు నటించారు. ఈ చిత్రాన్ని రోని స్క్రీవ్వాలా నిర్మించగా, ఆదిత్య ధార్ దర్శకత్వం వహించారు. రానున్న రోజుల్లో భారీ చిత్రాల విడుదల లేకపోవడం వల్ల ఈ చిత్ర వసూళ్లకు ఎదురే లేదనే మాట వినిపిస్తున్నది.