Urvasivo Rakshasivo day 1 collections అల్లు శిరీష్ మూవీకి హిట్ టాక్.. ఫస్ట్ డే కలెక్షన్లు ఎంతంటే?

అల్లు శిరీష్, అను ఇమ్మాన్యుయేల్ జంటగా రాకేశ్ దర్శకత్వలో జీఏ2 బ్యానర్‌లో సమర్పించిన ఊర్వశివో రాక్షసివో చిత్రం తొలి ఆట నుంచే పాజిటివ్ నోట్‌తో బాక్సాఫీస్ యాత్రను ప్రారంభించింది. ధీరజ్‌ మొగిలిలేని, విజయ్‌ ఎం నిర్మించిన ఈ చిత్రం నవంబర్ 4వ తేదీన ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమా తొలి రోజు కలెక్షన్ల అంచనా వివరాల్లోకి వెళితే...

లివింగ్ రిలేషన్‌షిప్ నేపథ్యంగా

లివింగ్ రిలేషన్‌షిప్ నేపథ్యంగా

ఊర్వశివో రాక్షసివో సినిమాకు తొలి ఆట నుంచే హిట్ టాక్ మీడియాలో వచ్చింది. ఆ తర్వాత మధ్యాహ్నం, ఫస్ట్, సెకండ్ షోలకు బుకింగ్ భారీగా పెరిగింది. లివింగ్ రిలేషన్‌షిప్, పెళ్లికి ముందే దాంపత్య జీవితం అనే కాన్సెప్ట్‌తో వచ్చిన చిత్రం యూత్‌కు బాగా కనెక్ట్ అయిందనే విషయం రిపోర్టులో స్పష్టమైంది. దాంతో యూత్ నుంచి భారీ స్పందన లభించింది.

అను, శిరీష్ కెమిస్ట్రీ

అను, శిరీష్ కెమిస్ట్రీ

ఇక ఊర్వశివో రాక్షసివో సినిమా ఆక్యుపెన్సీ కూడా భారీగానే నమోదైంది. వెన్నెల కిషోర్, సునీల్ కామెడీ, అను ఇమ్మాన్యుయేల్, శిరీష్ కెమిస్ట్రీ హైలెట్‌గా మారడంతో సినిమాకు మంచి స్పందన వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో మంచి ఆక్యుపెన్సీ నమోదైంది. ఏపీ, తెలంగాణ, కర్నాటక, ఇతర ప్రాంతాల్లో సుమారు 45 శాతానికి పైగా ఆక్యుపెన్సీ కనిపించింది.

బ్రేక్ ఈవెన్ ఎంతంటే?

బ్రేక్ ఈవెన్ ఎంతంటే?

ఊర్వశివో రాక్షసివో సినిమా టీజర్, ట్రైలర్లు, ప్రమోషన్ కార్యక్రమాలు ఊపు తెప్పించడంతో ట్రేడ్ వర్గాల్లో ఆసక్తి పెరిగింది. ఈ సినిమాపై అంచనాలు పెరగడంతో భారీగా బిజినెస్ కూడా జరిగింది. తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటక, ఓవర్సీస్ బిజినెస్ సుమారు 7 కోట్ల మేర జరిగింది. దాంతో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ 7.5 కోట్లుగా వ్యాల్యూ కట్టారు. అల్లు శిరీష్ కెరీర్‌లోనే హయ్యెస్ట్ బిజినెస్ జరగడం ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది.

ప్రపంచవ్యాప్తంగా స్క్రీన్ కౌంట్

ప్రపంచవ్యాప్తంగా స్క్రీన్ కౌంట్

ఊర్వశివో రాక్షసివో సినిమాను అత్యధిక థియేటర్లలో రిలీజ్ చేశారు. నైజాంలో 100 స్క్రీన్లు, సీడెడ్‌లో 45 స్క్రీన్లు, ఆంధ్రాలో 130 పైగా స్క్రీన్లలో రిలీజ్ చేశారు. ఏపీ, నైజాంలో దాదాపు 275 నుంచి 300 స్కీన్లలో రిలీజ్ అయింది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం 420కిపైగా స్క్రీన్లలో రిలీజ్ చేశారు.

ఊర్వశివో రాక్షసివో తొలి రోజు కలెక్షన్ల ఎంతంటే?

ఊర్వశివో రాక్షసివో తొలి రోజు కలెక్షన్ల ఎంతంటే?


ఊర్వశివో రాక్షసివో సినిమా కలెక్షన్ల విషయానికి వస్తే.. శిరీష్ కెరీర్‌లో ఎన్నడూ లేని విధంగా తెలుగు రాష్ట్రాలతోపాటు ఇతర రాష్ట్రాల్లో భారీ కలెక్షన్లు నమోదయ్యాయి. ఈ చిత్రం దేశవ్యాప్తంగా 70 లక్షల షేర్, 1.2 గ్రాస్ కలెక్షన్లు నమోదు చేయవచ్చని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X