Urvasivo Rakshasivo Collections: 7 కోట్ల బిజినెస్.. వారంలో షాకింగ్‌గా.. శిరీష్ హిట్ కొట్టాలంటే!
టాలీవుడ్‌లోకి ఈ మధ్య కాలంలోనే ఎంతో మంది స్టార్లు తమ వారసులను హీరోలుగా పరిచయం చేశారు. అయితే, అందులో కొందరు మాత్రం ఇప్పటికీ సరైన హట్ లేక ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. అలాంటి వారిలో స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ చిన్న కుమారుడు శిరీష్ ఒకడు. అప్పుడెప్పుడో హీరోగా ఎంట్రీ ఇచ్చిన అతడు.. ఎన్నో సినిమాలు చేసినా భారీ హిట్‌ను మాత్రం అందుకోలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఇటీవలే 'ఊర్వశివో రాక్షసివో' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా వారం రోజుల్లో ఎంత వసూలు చేసిందో చూసేద్దాం పదండి!

ఊర్వశివో రాక్షసివో అనే సినిమా
స్టార్ కిడ్ అల్లు శిరీష్ నటించిన తాజా సినిమానే 'ఊర్వశివో రాక్షసివో'. రాకేష్ శశి తెరకెక్కించిన ఈ మూవీలో అను ఇమ్మాన్యూయేల్ హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రాన్ని జీఏ2 పిక్చర్స్, తిరుమల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ధీరజ్, విజయ్ నిర్మించారు. ఈ మూవీకి అచ్చు, అనూప్ సంగీతాన్ని అందించారు. ఇందులో వెన్నెల కిశోర్, సునీల్, పోసాని, ఆమని కీలక పాత్రలు పోషించారు.

అల్లు శిరీష్ మూవీ బిజినెస్ ఇలా
తెలుగు రాష్ట్రాల్లో అల్లు శిరీష్‌కు పెద్దగా మార్కెట్ లేదు. కానీ, అతడు నటించిన తాజా చిత్రం 'ఊర్వశివో రాక్షసివో'పై ఆరంభం నుంచే అంచనాలు నెలకొన్నాయి. దీంతో ఈ మూవీకి ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలకు కలిపి రూ. 7.00 కోట్లు మేర బిజినెస్ అయినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అందుకు అనుగుణంగానే ఈ మూవీని అన్ని ఏరియాల్లో గ్రాండ్‌గా రిలీజ్ చేశారు.

7వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?
అల్లు శిరీష్ నటించిన 'ఊర్వశివో రాక్షసివో' మూవీకి మొదటి ఆట నుంచే మంచి టాక్ వచ్చింది. దీంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో దీనికి మంచి వసూళ్లు వచ్చాయి. కానీ, అవి అనుకున్న రీతిలో భారీగా రావడం లేదు. వీకెండ్ నుంచి వసూళ్లు పడిపోతూనే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఏడో రోజు ఈ సినిమాకు రెండు రాష్ట్రాల్లో కలిపి రూ. 10 లక్షలు షేర్ మాత్రమే వసూలైంది.

వారం రోజులకు ఎంతొచ్చింది
తెలుగు రాష్ట్రాల్లో 'ఊర్వశివో రాక్షసివో' మూవీ వారం రోజుల్లో తక్కువ వసూళ్లనే రాబట్టింది. ఫలితంగా నైజాంలో రూ. 85 లక్షలు, సీడెడ్‌లో రూ. 28 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 36 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 21 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 12 లక్షలు, గుంటూరులో రూ. 17 లక్షలు, కృష్ణాలో రూ. 19 లక్షలు, నెల్లూరులో రూ. 10 లక్షలతో.. రూ. 2.28 కోట్లు షేర్, రూ. 4.35 కోట్లు గ్రాస్ దక్కింది.

ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లిలా
వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో రూ. 2.28 కోట్లు మాత్రమే రాబట్టి శిరీష్ 'ఊర్వశివో రాక్షసివో' మూవీ.. ప్రపంచ వ్యాప్తంగా నిరాశ పరిచింది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్ ఏరియాల్లో కలుపుకుని ఈ సినిమాకు కేవలం రూ. 34 లక్షలే వసూలు అయ్యాయి. వీటితో కలిపి 7 రోజుల్లో ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా రూ. 2.62 కోట్లు షేర్, రూ. 4.95 కోట్లు గ్రాస్ దక్కింది.

టార్గెట్ ఎంత? ఎంత రావాలి?
అల్లు శిరీష్ - అను ఇమ్మాన్యూయేల్ జంటగా నటించిన 'ఊర్వశివో రాక్షసివో' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 7.00 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 7.50 కోట్లుగా నమోదైంది. ఇక, వారం రోజుల్లో ఈ సినిమాకు రూ. 2.62 కోట్లు వచ్చాయి. అంటే మరో 4.88 కోట్లు రాబడితేనే ఇది హిట్ అవుతుంది.


Click it and Unblock the Notifications











