Urvasivo Rakshasivo Collections: హిట్ టాక్‌తో షాకింగ్ కలెక్షన్లు.. 5 రోజులకు ఇంతే.. ఇంకెంత రావాలంటే!

తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంతో మంది వారసులు ఎంట్రీ ఇచ్చారు. అందులో కొందరు మాత్రమే సక్సెస్‌ఫుల్‌గా కెరీర్‌లను ముందుకు తీసుకు వెళ్తుండగా.. మరికొందరు మాత్రం ఇప్పటికీ సరైన బ్రేక్ లేక ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి వారిలో అల్లు అరవింద్ కుమారుడు శిరీష్ ఒకడు. చాలా కాలం క్రితమే హీరోగా పరిచయం అయిన అతడు.. భారీ హిట్‌ను సొంతం చేసుకోలేకపోయాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఇటీవలే 'ఊర్వశివో రాక్షసివో' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా ఐదు రోజుల్లో ఎంత వసూలు చేసిందో మీరే చూడండి!

ఊర్వశివో రాక్షసివో అంటూ వచ్చి

ఊర్వశివో రాక్షసివో అంటూ వచ్చి

యంగ్ హీరో అల్లు శిరీష్ నటించిన తాజా చిత్రం 'ఊర్వశివో రాక్షసివో'. రాకేష్ శశి తెరకెక్కించిన ఈ మూవీలో అను ఇమ్మాన్యూయేల్ హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రాన్ని జీఏ2 పిక్చర్స్, తిరుమల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ధీరజ్, విజయ్ నిర్మించారు. ఈ మూవీకి అచ్చు, అనూప్ సంగీతాన్ని అందించారు. ఇందులో వెన్నెల కిశోర్, సునీల్, పోసాని, ఆమని కీలక పాత్రలు చేశారు.

అల్లు శిరీష్ మూవీ బిజినెస్ ఇలా

అల్లు శిరీష్ మూవీ బిజినెస్ ఇలా

అల్లు శిరీష్‌కు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడిప్పుడే మార్కెట్ ఏర్పడుతుంది. దీనికితోడు అతడి తాజా చిత్రం 'ఊర్వశివో రాక్షసివో'పై ఆరంభం నుంచే అంచనాలు నెలకొన్నాయి. దీంతో ఈ మూవీకి ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలకు కలిపి రూ. 7.00 కోట్లు మేర బిజినెస్ అయింది. అందుకు అనుగుణంగానే ఈ మూవీని ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో గ్రాండ్‌గా విడుదల చేశారు.

5వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?

5వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?

శిరీష్ నటించిన 'ఊర్వశివో రాక్షసివో' మూవీకి ఆరంభంలోనే మంచి టాక్ వచ్చింది. దీంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో దీనికి మంచి వసూళ్లు వచ్చాయి. కానీ, అవి అనుకున్న రీతిలో భారీగా రావడం లేదు. వీకెండ్ తర్వాత దీనికి కలెక్షన్లు మరింతగా డౌన్ అవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఐదో రోజు ఈ సినిమాకు రెండు రాష్ట్రాల్లో కలిపి రూ. 18 లక్షలు షేర్ మాత్రమే వచ్చింది.

5 రోజులకు కలిపి ఎంతొచ్చింది

5 రోజులకు కలిపి ఎంతొచ్చింది

రెండు రాష్ట్రాల్లో 'ఊర్వశివో రాక్షసివో' మూవీ 5 రోజుల్లో తక్కువ వసూళ్లనే రాబట్టింది. ఫలితంగా నైజాంలో రూ. 77 లక్షలు, సీడెడ్‌లో రూ. 26 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 30 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 19 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 11 లక్షలు, గుంటూరులో రూ. 15 లక్షలు, కృష్ణాలో రూ. 17 లక్షలు, నెల్లూరులో రూ. 9 లక్షలతో.. రూ. 2.04 కోట్లు షేర్, రూ. 3.85 కోట్లు గ్రాస్ వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లిలా

ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లిలా

5 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో రూ. 2.04 కోట్లు వసూలు చేసిన అల్లు శిరీష్ 'ఊర్వశివో రాక్షసివో' మూవీ.. ప్రపంచ వ్యాప్తంగా నిరాశ పరిచింది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్ ఏరియాల్లో కలుపుకుని ఈ సినిమాకు కేవలం రూ. 32 లక్షలే వసూలు అయ్యాయి. వీటితో కలిపి 5 రోజుల్లో ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా రూ. 2.36 కోట్లు షేర్‌, రూ. 4.50 కోట్లు గ్రాస్‌ దక్కింది.

టార్గెట్ ఎంత? ఎంత రావాలి?

టార్గెట్ ఎంత? ఎంత రావాలి?

యంగ్ హీరో శిరీష్ నటించిన 'ఊర్వశివో రాక్షసివో' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 7.00 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 7.50 కోట్లుగా నమోదైంది. ఇక, 5 రోజుల్లో ఈ సినిమాకు రూ. 2.36 కోట్లు వచ్చాయి. అంటే మరో 5.14 కోట్లు రాబడితేనే ఈ సినిమా క్లీన్ హిట్‌ స్టేటస్‌ను చేరుతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X