Urvasivo Rakshasivo Collections అల్లు శిరీష్ రొమాన్స్‌కు పాజిటివ్ బజ్.. మూడు రోజుల కలెక్షన్లు చూస్తే ఇలా!
ప్రముఖ నిర్మాణ సంస్థ జీఏ2 బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పించిన చిత్రం ఊర్వశివో రాక్షసివో. అల్లు శిరీష్, అను ఇమ్మాన్యుయేల్ నటించిన ఈ సినిమాకు రాకేష్ దర్శకత్వం వహించారు. ధీరజ్ సహ నిర్మాతగా మారారు. ఈ సినిమా రిలీజ్‌కు ముందు బజ్ పెద్దగా కనిపించలేదు. కానీ రిలీజ్ తర్వాత తొలి ఆట నుంచి పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తున్నది. అయితే తొలివారాంతంలో ఈ సినిమా సాధించిన వసూళ్ల వివరాలు ఎలా ఉన్నాయంటే?

420 స్క్రీన్లలో విడుదల
వరుస వైఫల్యాలతో బాధపడుతున్న అల్లు శిరీష్ తన రూట్ మార్చి.. యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాను ఏపీ, నైజాంలో కలిపి మొత్తం 300 స్క్రీన్లు, ప్రపంచవ్యాప్తంగా 420 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. శిరీష్ కెరీర్లోనే అత్యధికంగా స్క్రీన్లలో రిలీజైన సినిమాగా ఊర్వశివో రాక్షసివో ఘనతను సొంతం చేసుకొన్నది.

తొలి రెండు రోజుల్లో వసూళ్లు
ఊర్వశివో రాక్షసివో సినిమా పాజిటివ్ బజ్ క్రియేట్ కావడంతో శిరీష్ కెరీర్‌పరంగా చూస్తే... తొలి రోజు భారీ వసూళ్లను సాధించింది. తొలి రోజు ఈ చిత్రం 77 లక్షల వసూళ్లను రాబట్టింది. ఇక రెండో రోజు మౌత్ టాక్‌తో వసూళ్లను పెంచుకొన్నది. రెండో రోజు 1 కోటి రూపాయల వసూళ్లను రాబట్టింది.

మూడో రోజు తెలుగు, రాష్ట్రాల్లో
అయితే ఊర్వశివో రాక్షసివో మూవీ మూడో రోజు పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. ఆదివారం భారీ వసూళ్లను సాధిస్తుందని భావించిన ట్రేడ్ వర్గాలకు కొంత నిరాశే కలిగింది. ఆదివారం రోజున 95 లక్షల రూపాయలను రాబట్టింది. దాంతో ఈ సినిమా గత మూడు రోజుల్లో ఏపీ, నైజాం, ఇతర రాష్ట్రాల్లో కలిపి 2.72 కోట్ల వసూళ్లను రాబట్టింది.

అమెరికాలో కలెక్షన్లు
ఇక అమెరికాలో ఊర్వశివో రాక్షసివో సినిమాకు మంచి రెస్పాన్స్ కనిపిస్తున్నది. చిన్న సినిమాలతో పోల్చుకొంటే.. మోస్తారు వసూళ్లను రాబడుతున్దని. ఆదివారం ఈ చిత్రం 21606 డాలర్లను వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం గత మూడు రోజుల్లో 50515 డాలర్లను కలెక్ట్ చేసింది. అంటే.. భారతీయ కరెన్సీలో 41 లక్షలు రాబట్టింది.

ఊర్వశివో బ్రేక్ ఈవెన్ సాధించాలంటే?
ఇక ఊర్వశివో రాక్షసివో రాక్షసివో చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్‌ను 7.5 కోట్లకుపైగానే వాల్యూ చేశారు. దాంతో ఈ చిత్రం లాభాల్లోకి రావాలంటే. కనీసం 8 కోట్లు సాధించాల్సిన పరిస్థితి ఉంది. అయితే ఈ సినిమా ఇప్పటి వరకు 3.15 కోట్ల వసూళ్లను రాబట్టింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే.. ఇంకా 5 కోట్ల వరకు కలెక్షన్లను సాధించాల్సి ఉందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.


Click it and Unblock the Notifications











