US Collections సంచలనం రేపుతున్న కశ్మీర్ ఫైల్స్.. బచ్చన్ పాండే, జేమ్స్ కలెక్షన్ల పరిస్థితి ఏమిటంటే?
అమెరికా బాక్సాఫీస్ వద్ద భారతీయ చిత్రాలు సందడి చేస్తున్నాయి. చాలా రోజుల తర్వాత భారీ బడ్జెట్ చిత్రాలు, స్టార్ హీరోల సినిమాలు ప్రేక్షకులను థియేటర్లలో పలకరించాయి. ప్రస్తుతం అమెరికాలో భారీ కలెక్షన్లు వసూలు చేస్తున్న సినిమాల వివరాల్లోకి వెళితే...
ది కాశ్మీర్ ఫైల్స్ కలెక్షన్లు..
కశ్మీర్ పండితులపై మిలిటెంట్ల ఊచకోత నేపథ్యంగా రూపొందిన ది కాశ్మీర్ ఫైల్స్ చిత్రం అమెరికాలో అనూహ్యమైన కలెక్షన్లు సాధిస్తున్నది.

తొలి రోజున $81,227
రెండో రోజున $168,893
మూడో రోజున $224,326
నాలుగో రోజున $120,079
ఐదో రోజున $148,006
ఆరో రోజున $154,014
ఏడో రోజున $109,984
ఎనిమిదో రోజున $398,385
తొమ్మిదో రోజున $586,963
పదో రోజున $475,751 వసూలు చేసింది. ఓవరాల్‌గా పది రోజుల్లో 2,467,718 అమెరికా డాలర్లు అంటే.. అక్షరాల 18.81 కోట్లు వసూలు చేసింది. అమెరికాలో 2022 సంవత్సరంలో అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా రికార్డు క్రియేట్ చేసింది. ఈ ఏడాది అత్యధికంగా గంగూభాయ్ 3.1 మిలియన్ డాలర్లు కలెక్ట్ చేయడం విశేషం.
జేమ్స్ మూవీ కలెక్షన్లు ఇలా..
ఇదిలా ఉండగా, స్వర్గీయ పునీత్ రాజ్ కుమార్ నటించిన జేమ్స్ చిత్రానికి మంచి స్పందన కనిపించింది.
ప్రీమియర్ల ద్వారా 28,689 డాలర్లు, తొలి రోజున 25,437 డాలర్లు, రెండో రోజున 35,818 డాలర్లు, మూడో రోజున 21,752 డాలర్లు వసూలు చేసింది. ఓవరాల్‌గా జేమ్స్ చిత్రం 109,696 డాలర్లు అంటే.. 83.6 లక్షల రూపాయలు రాబట్టింది.
అమెరికాలో అక్షయ్ కుమార్ మూవీ రిపోర్ట్
ఇక అక్షయ్ కుమార్ నటించిన చిత్రం బచ్చన్ పాండే మూవీ భారీగానే వసూళ్లు రాబట్టింది.
తొలి రోజున 109,983 డాలర్లు, రెండో రోజున 151,775 డాలర్లు, మూడో రోజున 112,786 డాలర్లను వసూలు చేసింది. ఓవరాల్‌గా ఈ చిత్రం 374,544 డాలర్లు, భారతీయ కరెన్సీలో 2.85 కోట్ల రూపాయలను వసూలు చేసింది.


Click it and Unblock the Notifications











