twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాహుబలికి చేరువలో ‘ఖైదీ నెం 150’: రికార్డుల వేట షురూ...

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి నటించిన 'ఖైదీ నెం 150' ప్రపంచ వ్యాప్తంగా 40 దేశాలలో గ్రాండ్ గా రిలీజైంది. యూఎస్ఏలో ప్రీమియర్ షోలతో ప్రారంభమైన ఖైదీ నెం 150 బాక్సాఫీసు రికార్డుల వేట.... ఇప్పటి వరకు ఉన్న ఒక్కో రికార్డును బద్దలు కొడుతూ ముందుకు సాగుతోంది.

    యూఎస్ఏలో ఇప్పటి వరకు ప్రీమియర్ షో వసూళ్ల విషయంలో బాహుబలి అగ్రస్థానంలో ఉంది. ఆ సినిమా అక్కడ కేవలం ప్రీమియర్ షోల ద్వారానే $1.395 మిలియన్ డాలర్స్ వసూలు చేసి అగ్రస్థానంలో ఉండగా... ఆ తర్వాతి స్థానంలో సర్దార్ గబ్బర్ సింగ్ $616.6K వసూళ్లతో రెండో స్థానంలో ఉంది.

    ఖైదీ నెం 150 మూవీ ప్రీమియర్ షోకు అడ్వాన్స్ బుకింగ్ ఊహించని విధంగా జరిగింది. ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్లు టికెట్స్ అమ్ముడు పోయిన కొద్దీ ఎక్స్ ట్రా స్క్రీన్స్ యాడ్ చేసుకుంటూ వెళ్లారు. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం దాదాపు 100 లొకేషన్లలో ప్రీమియర్ షోలు పడగా...$840K వసూలైనట్లు సమాచారం. అయితే పూర్తి లెక్క అందితే తప్ప ప్రీమియర్ షోల ద్వారా ఎంత వసూలైంది అనేది తేలనుంది.

    USA premiere: Khaidi No 150 crosses $840k

    ఇక ఇపుడు అందరి చూపు.... ఖైదీ నెం 150 తొలి రోజు ఓపెనింగ్స్ ఎలా ఉంటాయనే దానిపైనే. పదేళ్ల తర్వాత రీఎంట్రీ ఇస్తున్న చిరంజీవి బాక్సాఫీసు స్టామినా ఎంత? అనేది ఆసక్తికరంగా మారింది.

    ఇప్పటి వరకు ఫస్ట్ డే షేర్ విషయంలో 22.4 కోట్ల(తెలుగు రాష్ట్రాలు)తో బాహుబలి మొదటి స్థానంలో ఉంది. మరి ఖైదీ నెం 150 'బాహుబలి' రికార్డును అందుకునే అవకాశం ఉందా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది. సినిమాను అత్యధిక థియేటర్లలో రిలీజ్ చేసారు. చాలా చోట్ల తొలిరోజు టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. మరి షేర్ ఎంత ఎంత వచ్చింది అనేది ఈరోజు సాయంత్రానికి తేలనుంది.

    English summary
    "KhaidiNo150 crosses $840k as shows started in few parts of USA. 1 milllion guaranteed! Something that fans didn't even dream of!!" Jeevi tweeted.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X