షాక్: ‘మహర్షి’ యూఎస్ఏ ప్రీమియర్‌ షో అంచనాలు తారుమారు!

Recommended Video

Maharshi Fails To Beat Mahesh Last Movies Spyder,Bharat Ane Nenu || Filmibeat Telugu

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'మహర్షి'. సినిమాపై ముందు నుంచీ భారీ అంచనాలు ఉండటంతో ఓవర్సీస్ మార్కెట్లో బిగ్గెస్ట్ రిలీ‌జ్‌ చేశారు. 2500పైగా ప్రీమియర్ షోలు వేశారు. యూఎస్ఏలో బాహుబలి మూవీని మించిపోయే స్థాయిలో షోలు పడ్డాయి.

ఇంత భారీ మొత్తంలో రిలీజ్ చేయడంతో అప్పటి వరకు యూఎస్ఏ బాక్సాఫీసు వద్ద ఉన్న నాన్ బాహుబలి ప్రీమియర్ షో కలెక్షన్ రికార్డులన్నీ బద్దలవుతాయని అంచనా వేశారు. 'మహర్షి' మూవీ ప్రీమియర్ షోల ద్వారా 2 మిలియన్ డాలర్ మార్కును అందుకుంటుందని అంచనా వేశారు. అయితే అందరి అంచనాలు తారు మారయ్యాయి.

యూఎస్ఏలో 260 లొకేషన్లలో విడుదల

యూఎస్ఏలో 260 లొకేషన్లలో విడుదల

యూఎస్ఏలో బాహుబలి 2, భరత్ అనే నేను లాంటి పెద్ద సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేసిన ‘గ్రేట్ ఇండియా ఫిల్మ్స్' సంస్థ ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ దక్కించుకుంది. ‘మహర్షి' చిత్రాన్ని యూఎస్ఏలో 260 లొకేషన్లలో విడుదల చేశారు.

‘మహర్షి' యూఎస్ఏ ప్రీమియర్‌ షో అంచనాలు తారుమారు!

‘మహర్షి' యూఎస్ఏ ప్రీమియర్‌ షో అంచనాలు తారుమారు!

ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం 224 లొకేషన్ల నుంచి $502k (హాఫ్ మిలియన్) వసూలైంది. ఇది మంచి మొత్తమే అయినప్పటికీ.... అంచనాలను అందుకునే స్థాయిలో మాత్రం లేదని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. కనీసం 1 మిలియన్ మార్క్ అందుకోక పోవడం నిరాశ పరిచే విషయమే అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

మహేష్ బాబు గత సినిమాలను బీట్ చేయడంలో ఫెయిల్

మహేష్ బాబు గత సినిమాలను బీట్ చేయడంలో ఫెయిల్

మహేష్ బాబు గత చిత్రాలైన ‘స్పైడర్', ‘భరత్ అనే నేను' ప్రీమియర్ షో రికార్డులను కూడా ‘మహర్షి' బీట్ చేయలేక పోయింది. గతంలో స్పైడర్ మూవీ 1 మిలియన్ డాలర్ వసూలు చేయగా, భరత్ అనే నేను 800K వసూలు చేసింది. మహేష్ బాబు గత చిత్రాలు బ్రహ్మోత్సవం: $560k, శ్రీమంతుడు $536k, ఆగడు: $524k వసూలు చేసింది.

యూఎస్ఏ టాప్ ప్రీమియర్ షో కలెన్స్

యూఎస్ఏ టాప్ ప్రీమియర్ షో కలెన్స్

  • 1. బాహుబలి 2: ది కంక్లూజన్ : 2.4 మిలియన్ డాలర్
  • 2. అజ్ఞాతవాసి $1.5 మిలియన్ డాలర్
  • 3. బాహుబలి: 1.3 మిలియన్
  • 4. ఖైదీ నెం.150 : 1.29 మిలియన్
  • 5. స్పైడర్ : 1 మిలియన్ డాలర్
  • మహర్షి

    మహర్షి

    మహేష్ బాబు కెరీర్లో 25వ చిత్రంగా ‘మహర్షి' తెరకెక్కింది. పూజా హెడ్గే హీరోయిన్‌గా నటిస్తుండగా... అల్లరి నరేష్ కీలక పాత్రలో నటించారు. ఇంకా అనన్య, మీనాక్షి దీక్షిత్, జగపతి బాబు, రాజేంద్రప్రసాద్, సాయి కుమార్, ముఖేష్ రిషి, ప్రకాష్ రాజ్, నాజర్, నరేష్, పోసాని, జయసుధ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X