'నిన్ను కలిసాక' ఏమైంది?
ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్ పై శివనాగేశ్వరావు దర్శకత్వంలో వచ్చిన నిన్ను కలిసాక చిత్రం యావరేజ్ టాక్ కూడా తెచ్చుకోలేకపోయింది. రెండు టీనేజ్ జంటల ప్రేమ కథగా వచ్చిన ఈ చిత్రం యూత్ నే కాక ఏ వర్గాన్ని ఆకట్టుకోలేకపోతోంది. చిత్రం,నువ్వే కావాలి,నచ్చావులే వంటి సూపర్ హిట్స్ ఇచ్చిన సంస్ధ నుంచి వచ్చిన చిత్రం అంటే ఆశ్చర్యమే అనిపిస్తుంది.
కథలో చందు (చైతన్య), బిందు (ప్రియ), అభిరామ్ (సంతోష్), దీప్తి (దీప షా) రెండు ప్రేమ జంటలు. ఓ సాఫ్టా వేర్ కంపెనీలో మూడు నెలల ప్రాజెక్ట్ వర్క్ కోసం అభిరామ్ న్యూయార్క్ బయిలుదేరతాడు.అలాగే మరో పెయిర్ లోని బిందు కూడా అదే పనిమీద అదే ఫ్లయిట్ లో బయలుదేరుతుంది. ఇద్దరి మధ్యా పరిచయం అవుతుంది. అంతేకాక ఇద్దరికీ ఒకే కంపెనీ లో జాబ్ రావటంతో పక్కపక్క రూమ్స్ లోనే ఉంటూ మరింత దగ్గరవుతారు. అలా ఈ మూడు నెలల్లో వారు ప్రేమలో పడ్డామని అర్ధం చేసుకుంటారు. అయితే ఒకరికొకరు చెప్పుకోకుండానే ఇండియాకు బయిలు దేరతారు. అయితే ఇండియాలో ఎదురు చూస్తున్న వారి లవర్స్ పరిస్ధితి ఎలా ఉంది. చివరకు అభి,బిందులు ఏం చేసారన్నది మిగతా కథ.
ఇక ఈ సినిమాలో దర్శకత్వ విలువలు ఎంత లో స్టాండర్డ్స్ లో ఉన్నాయో..మిగతా విభాగాలు అదే స్టాండర్డ్స్ మెయింటైన్ చేయటం విశేషం. నటీనటుల్లో కొత్త వాళ్ళు అధ్బుతమనిపించకపోయినా ఫవరాలేదనిపించారు. ప్రేమ బాబా పాత్రలో చేసిన శివనాగేశ్వరావు ఆకట్టుకునే రీతిలో లేదు. ఇక గెస్ట్ లుగా కనిపించిన జగపతిబాబు, తరుణ్ వృధా అనిపించారు. పాటలు ఒకటి రెండు బాగున్నా వాటి ఇంపాక్ట్ కనపడదు. ఏదైమైనా నచ్చావులే వంటి హిట్ తర్వాత ఉషాకిరణ్ నుంచి ఇంత నీరసమైన సినిమా ఊహించటం కష్టమే.


Click it and Unblock the Notifications











