UBS AP, TG Box Office: ఆంధ్రా, నైజాంలలో ఉస్తాద్‌కు షాకింగ్ కలెక్షన్స్.. 2 రోజుల్లో పవన్‌ ఎంత రాబట్టాడంటే?

హరీశ్ శంకర్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాతలు నవీన్ యెర్నెనీ, వై రవిశంకర్‌ నిర్మించారు. రాశీ ఖన్నా, శ్రీలీలు హీరోయిన్లుగా నటించారు. పార్ధిబన్, అశుతోష్ రాణా, నవాబ్ షా, గౌతమి, రాజీవ్ కనకాల, చమ్మక్ చంద్ర, పోసాని కృష్ణమురళి, రావు రమేశ్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూరుస్తుండగా.. థమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించారు. అయనంకా బోస్ సినిమాటోగ్రాఫర్‌గా, ఛోటా కే ప్రసాద్ ఎడిటర్‌గా వ్యవహరించారు. ఉగాది, రంజాన్ పండుగలను పురస్కరించుకుని మార్చి 19న ఉస్తాద్ భగత్ సింగ్ వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో ఉస్తాద్ భగత్ సింగ్ రెండు రోజుల్లో రాబట్టిన కలెక్షన్స్ ఎంత? అనేది పరిశీలిస్తే..

ఉస్తాద్ భగత్ సింగ్ బడ్జెట్
నటీనటులు, సాంకేతిక నిపుణుల పారితోషికం, ప్రొడక్షన్ కాస్ట్, ప్రమోషనల్ కార్యక్రమాలతో కలిపి ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి దాదాపు 150 కోట్ల రూపాయల బడ్జెట్ అయినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. భారీ హైప్‌కు తగినట్లుగానే ఉస్తాద్‌కు ఓ రేంజ్‌లో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. నైజాం థియేట్రికల్ రైట్స్ 50 కోట్ల రూపాయలు, ఆంధ్రా థియేట్రికల్ రైట్స్ 54 కోట్లు రూపాయలు, సీడెడ్‌ థియేట్రికల్ రైట్స్ 16 కోట్ల రూపాయలు చొప్పున 120 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ చేశాడు ఉస్తాద్. తెలుగు రాష్ట్రాల్లో ఉస్తాద్ భగత్ సింగ్ బ్రేక్ఈవెన్ కావాలంటే 121 కోట్ల రూపాయల షేర్.. 245 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాల్సి ఉంది.

Ustaad Bhagat Singh 2 Days Box Office Collections in Telugu States Pawan Kalyan s Movie Nizam Andhra Box office Report

ఉస్తాద్ భగత్ సింగ్ బ్రేక్ఈవెన్ టార్గెట్
ఇక కర్ణాటక థియేట్రికల్ రైట్స్ 5 కోట్ల రూపాయలు, ఓవర్సీస్‌ థియేట్రికల్ రైట్స్ 12 కోట్ల రూపాయల మేర బిజినెస్ చేశాయి. దాంతో ఉస్తాద్ భగత్ సింగ్‌కు వరల్డ్ వైడ్‌గా దాదాపు 137 కోట్ల రూపాయల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది అని ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. దాంతో పవన్ కళ్యాణ్ మూవీ లాభాల్లోకి రావాలంటే బాక్సాఫీస్ వద్ద 140 కోట్ల రూపాయల షేర్.. 280 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టాల్సి ఉంటుంది విశ్లేషకులు విలువ కట్టారు.

ఉస్తాద్ భగత్ సింగ్ కలెక్షన్స్
ఉస్తాద్ భగత్ సింగ్‌కు తొలిరోజున ఇండియాలో 34.75 కోట్ల రూపాయలు, రెండో రోజున 9.25 కోట్ల రూపాయలు చొప్పున ఇప్పటి వరకు 44 కోట్ల రూపాయల నెట్.. 52 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టినట్లు సాక్‌నిక్ వెల్లడించింది. ఇక ఓవర్సీస్ కలెక్షన్స్ పరిశీలిస్తే.. నార్త్ అమెరికాలో ఇప్పటి వరకు 550K డాలర్లు (భారత కరెన్సీలో 5.17 కోట్ల రూపాయలు) రాబట్టింది. యూకే, యూరప్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తదితర దేశాలతో వచ్చిన వసూళ్లతో కలిపి మొత్తంగా ఓవర్సీస్‌లో ఉస్తాద్ భగత్ సింగ్‌కు 7 కోట్ల రూపాయలు వసూలైంది. ఓవర్సీస్‌లో వచ్చిన గ్రాస్ + ఇండియా కలెక్షన్స్ కలిపి ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ మూవీకి వరల్డ్ వైడ్‌గా 59 కోట్ల రూపాయల కలెక్షన్స్ వచ్చాయి.

ఉస్తాద్ భగత్ సింగ్ తెలుగు రాష్ట్రాల కలెక్షన్స్
ఉస్తాద్ భగత్ సింగ్‌కు తొలిరోజున 34.75 కోట్ల రూపాయలు, రెండో రోజున 9.25 కోట్ల రూపాయలు చొప్పున ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో 44 కోట్ల రూపాయలు చొప్పున వసూలు చేసింది ఉస్తాద్ భగత్ సింగ్. తొలిరోజున నైజాంలో 7.57 కోట్ల రూపాయలు, సీడెడ్‌లో 3.90 కోట్ల రూపాయలు, ఉత్తరాంధ్రలో 4.1 కోట్ల రూపాయలు, ఈస్ట్ గోదావరిలో 3.63 కోట్ల రూపాయలు, వెస్ట్ గోదావరిలో 2.50 కోట్ల రూపాయలు, గుంటూరులో 2.84 కోట్ల రూపాయలు, కృష్ణాలో 2.40 కోట్ల రూపాయలు, నెల్లూరులో 1.14 కోట్ల రూపాయలు చొప్పున 28 కోట్ల రూపాయల షేర్ వసూలు చేసింది. రెండో రోజుకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.

మిక్స్‌డ్ టాక్‌కు తోడు, ధురంధర్ 2 మూవీ ఎఫెక్ట్ ఈ సినిమాపై బాగా పడినట్లుగా విశ్లేషకులు చెబుతున్నారు. ఉస్తాద్ భగత్ సింగ్ సేఫ్ జోన్‌లోకి రావాలంటే ఇంకా కనీసం 100 కోట్ల రూపాయల షేర్... 200 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాల్సి ఉంది. శనివారం నుంచి ధురంధర్ 2 తెలుగులో అందుబాటులోకి రానుండటంతో ఉస్తాద్‌కు టఫ్ ఫైట్ ఎదురయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. వీకెండ్ తర్వాత ఉస్తాద్ అసలు రిజల్ట్ తెలుస్తుందని అంచనా వేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X