UBS first Week collection: ఉస్తాద్‌కు షాకిచ్చిన ఫస్ట్‌ వీక్ కలెక్షన్స్.. పవన్ మూవీకి తొలి వారం ఎన్ని కోట్లంటే?

దాదాపు 14 ఏళ్ల తర్వాత హరీశ్ శంకర్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ అభిమానులను తీవ్రంగా నిరాశ పరిచింది. ఉగాది, రంజాన్ పర్వదినాలను పురస్కరించుకుని మార్చి 19న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకొచ్చింది. తొలి రోజు నుంచే మిక్స్‌డ్ టాక్‌కు తోడు, ధురంధర్ ప్రభంజనం నేపథ్యంలో ఉస్తాద్‌పై గట్టి ప్రభావం పడింది. ఓపెనింగ్‌ డేను మినహాయిస్తే ఆ తర్వాతి నుంచి ఉస్తాద్ క్రమంగా కలెక్షన్స్ కోల్పోతూ వచ్చాడు. మార్చి 25 నాటికి ఉస్తాద్ విడుదలై వారం రోజులు పూర్తయిన నేపథ్యంలో ఫస్ట్ వీక్‌లో పవన్ కళ్యాణ్ మూవీ ఎన్ని కోట్లు రాబట్టిందో పరిశీలిస్తే..

ఉస్తాద్ భగత్ సింగ్ బడ్జెట్
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నెనీ, వై రవిశంకర్‌‌లు ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాన్ని నిర్మించారు. పవన్ కళ్యాణ్ సరసన రాశీఖన్నా, శ్రీలీలలు హీరోయిన్లుగా నటించారు. పార్ధిబన్, అశుతోష్ రాణా, నవాబ్ షా, గౌతమి, రాజీవ్ కనకాల, చమ్మక్ చంద్ర, పోసాని కృష్ణమురళి, రావు రమేశ్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించగా... థమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించారు. అయనంకా బోస్ సినిమాటోగ్రాఫర్‌గా, ఛోటా కే ప్రసాద్ ఎడిటర్‌గా వ్యవహరించారు. నటీనటులు, సాంకేతిక నిపుణుల పారితోషికం, ప్రొడక్షన్ కాస్ట్, ప్రమోషనల్ కార్యక్రమాలతో కలిపి ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి దాదాపు 150 కోట్ల రూపాయల బడ్జెట్ అయినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి.

Ustaad Bhagat Singh 7 Days Box Office Collections Worldwide Pawan Kalyan s film heading towards 90 cores mark

ఉస్తాద్ భగత్ సింగ్ బ్రేక్ఈవెన్ టార్గెట్
భారీ హైప్‌కు తగినట్లుగానే ఉస్తాద్‌కు ఓ రేంజ్‌లో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. నైజాం థియేట్రికల్ రైట్స్ 50 కోట్ల రూపాయలు, ఆంధ్రా థియేట్రికల్ రైట్స్ 54 కోట్లు రూపాయలు, సీడెడ్‌ థియేట్రికల్ రైట్స్ 16 కోట్ల రూపాయలు చొప్పున 120 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ చేశాడు ఉస్తాద్. తెలుగేతర రాష్ట్రాల విషయానికి వస్తే.. కర్ణాటక థియేట్రికల్ రైట్స్ 5 కోట్ల రూపాయలు, ఓవర్సీస్‌ థియేట్రికల్ రైట్స్ 12 కోట్ల రూపాయల మేర బిజినెస్ చేశాయి. దాంతో ఉస్తాద్ భగత్ సింగ్‌కు వరల్డ్ వైడ్‌గా దాదాపు 137 కోట్ల రూపాయల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది అని ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. దాంతో పవన్ కళ్యాణ్ మూవీ లాభాల్లోకి రావాలంటే బాక్సాఫీస్ వద్ద 140 కోట్ల రూపాయల షేర్.. 280 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టాల్సి ఉంటుంది విశ్లేషకులు విలువ కట్టారు.

ఇండియాలో ఉస్తాద్ భగత్ సింగ్ కలెక్షన్స్
ఉస్తాద్ భగత్ సింగ్‌కు తొలిరోజున ఇండియాలో 34.75 కోట్ల రూపాయలు, రెండో రోజున 9.00 కోట్ల రూపాయలు, మూడో రోజున 9.10 కోట్ల రూపాయలు, నాలుగో రోజున 7.50 కోట్ల రూపాయలు, ఐదో రోజున 2.50 కోట్ల రూపాయలు, ఆరో రోజున 1.75 కోట్ల రూపాయలు, ఏడో రోజున 1.14 కోట్ల రూపాయలు వసూలు చేసింది. మొత్తంగా తొలి వారం పవన్ కళ్యాణ్ ఇండియాలో 65.74 కోట్ల రూపాయల నెట్.. 77.36 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాడు. తొలి వారం తెలుగు రాష్ట్రాల్లో 68.05 కోట్ల రూపాయలు, కర్ణాటకలో 6.15 కోట్ల రూపాయలు, తమిళనాడులో 91 లక్షల రూపాయలు, రెస్టాఫ్ ఇండియాలో కోటి రూపాయలు వసూలు చేసింది.

తెలుగు రాష్ట్రాల్లో తొలివారం కలెక్షన్స్
నైజాంలో 24.50 కోట్ల రూపాయలు, సీడెడ్‌లో 11.20 కోట్ల రూపాయలు, ఉత్తరాంధ్రలో 8.15 కోట్ల రూపాయలు, ఈస్ట్ గోదావరిలో 5.90 కోట్ల రూపాయలు, గుంటూరులో 5.25 కోట్ల రూపాయలు, వెస్ట్ గోదావరిలో 4.80 కోట్ల రూపాయలు, కృష్ణాలో 4.60 కోట్ల రూపాయలు, నెల్లూరులో 3.65 కోట్ల రూపాయలు చొప్పున తెలుగు రాష్ట్రాల్లో ఉస్తాద్‌కు తొలివారం 68.05 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి.

ఉస్తాద్ భగత్ సింగ్ ఓవర్సీస్ కలెక్షన్స్
ఉస్తాద్ భగత్ సింగ్‌కు నార్త్ అమెరికాలో ప్రీమియర్స్ + ఫస్ట్ డే కలిపి 5.15 లక్షల డాలర్లు (4.84 కోట్ల రూపాయలు), రెండో రోజున 80 వేల డాలర్లు (75 లక్షల రూపాయలు) ఫస్ట్ వీకెండ్‌లో 7.25 లక్షల డాలర్లు (6.82 కోట్ల రూపాయలు) చొప్పున వసూలు చేసింది. అయితే సోమవారం నుంచి నార్త్ అమెరికాలో కలెక్షన్స్ క్రమంగా పడిపోవడంతో తొలి వారం ముగిసేనాటికి ఉస్తాద్ భగత్ సింగ్‌కు అక్కడ 8 లక్షల డాలర్లు (భారత కరెన్సీలో 7.52 కోట్ల రూపాయలు) రాబట్టింది.

ఉస్తాద్ భగత్ సింగ్ తొలి వారం కలెక్షన్స్
యూకేలో 1.20 లక్షల డాలర్లు (1.12 కోట్ల రూపాయలు), ఆస్ట్రేలియా+ న్యూజిలాండ్‌లో 95 వేల డాలర్లు (89 లక్షల రూపాయలు) సహా వారం రోజుల్లో ఉస్తాద్ భగత్ సింగ్‌కు ఓవర్సీస్‌లో 11.30 కోట్ల రూపాయలు వసూలైంది. భారత్‌లో వచ్చిన గ్రాస్ + ఓవర్సీస్ కలెక్షన్స్ కలిపి ఉస్తాద్ భగత్ సింగ్‌కు తొలి వారం వరల్డ్ వైడ్‌గా 88.66 కోట్ల రూపాయల గ్రాస్.. 53 కోట్ల రూపాయల షేర్ రాబట్టింది. అయితే తొలి వారం ముగిసినా పవన్ కళ్యాణ్ మూవీ కనీసం 100 రూపాయల మార్క్ చేరకపోవడంపై ట్రేడ్ పండితులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X