Ustaad Bhagat Singh Closing Collections: ఉస్తాద్ క్లోజింగ్ కలెక్షన్స్.. పవన్ మూవీకి ఎన్ని కోట్ల నష్టమంటే?

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నెనీ, వై రవిశంకర్‌‌లు సంయుక్తంగా నిర్మించిన చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్. హరీశ్ శంకర్ దర్శకత్వం వహించారు. శ్రీలీల, రాశీ ఖన్నాలు హీరోయిన్లుగా నటించారు. పార్ధిబన్, అశుతోష్ రాణా, నవాబ్ షా, గౌతమి, రాజీవ్ కనకాల, చమ్మక్ చంద్ర, పోసాని కృష్ణమురళి, రావు రమేశ్ తదితరులు ఈ చిత్రంలో కీలకపాత్రలు పోషించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించగా... థమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించారు. అయనంకా బోస్ సినిమాటోగ్రాఫర్‌గా, ఛోటా కే ప్రసాద్ ఎడిటర్‌గా వ్యవహరించారు.

ఉగాది, రంజాన్ పండుగలను పురస్కరించుకుని మార్చి 19న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ నేపథ్యంలో ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ఈవెన్ టార్గెట్ ఎంత? ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ ఎన్ని కోట్లు రాబట్టాడు? ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ లాభమెంత? నష్టమెంత? అనేది పరిశీలిస్తే..

ఉస్తాద్ భగత్ సింగ్ బడ్జెట్
ఉస్తాద్ భగత్ సింగ్ బడ్జెట్ నటీనటులు, సాంకేతిక నిపుణుల పారితోషికం, ప్రొడక్షన్ కాస్ట్, ప్రమోషనల్ కార్యక్రమాలతో కలిపి ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి దాదాపు 150 కోట్ల రూపాయల బడ్జెట్ అయినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. భారీ హైప్‌కు తగినట్లుగానే ఉస్తాద్‌కు ఓ రేంజ్‌లో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. నైజాం థియేట్రికల్ రైట్స్ 50 కోట్ల రూపాయలు, ఆంధ్రా థియేట్రికల్ రైట్స్ 54 కోట్లు రూపాయలు, సీడెడ్‌ థియేట్రికల్ రైట్స్ 16 కోట్ల రూపాయలు చొప్పున 120 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ చేశాడు ఉస్తాద్.

Ustaad Bhagat Singh Box Office Collections Worldwide Pawan Kalyan s film Closing Collections at Global Box Office Report

ఉస్తాద్ భగత్ సింగ్ బ్రేక్ఈవెన్ టార్గెట్ ఎంత?
తెలుగేతర రాష్ట్రాల విషయానికి వస్తే.. కర్ణాటక థియేట్రికల్ రైట్స్ 5 కోట్ల రూపాయలు, ఓవర్సీస్‌ థియేట్రికల్ రైట్స్ 12 కోట్ల రూపాయల మేర బిజినెస్ చేశాయి. దాంతో ఉస్తాద్ భగత్ సింగ్‌కు వరల్డ్ వైడ్‌గా దాదాపు 137 కోట్ల రూపాయల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది అని ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే బాక్సాఫీస్ వద్ద 138 కోట్ల రూపాయల షేర్, 276 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాల్సి ఉంది.

ఉస్తాద్ భగత్ సింగ్ కలెక్షన్స్
ఉస్తాద్ భగత్ సింగ్‌కు తొలిరోజున ఇండియాలో 34.75 కోట్ల రూపాయలు, రెండో రోజున 9.00 కోట్ల రూపాయలు, మూడో రోజున 9.10 కోట్ల రూపాయలు, నాలుగో రోజున 7.50 కోట్ల రూపాయలు, ఐదో రోజున 2.50 కోట్ల రూపాయలు, ఆరో రోజున 1.75 కోట్ల రూపాయలు, ఏడో రోజున 1.35 కోట్ల రూపాయలు, ఎనిమిదో రోజున కోటి రూపాయలు, తొమ్మిదో రోజున 1.10 కోట్ల రూపాయలు, పదో రోజున 86 లక్షల రూపాయలు, పదకొండో రోజున 1.03 కోట్ల రూపాయలు, పన్నెండవ రోజున 35 లక్షల రూపాయలు, పదమూడో రోజున 37 లక్షల రూపాయలు, 14వ రోజున 35 లక్షల రూపాయలు రాబట్టినట్లు సాక్‌నిక్ తెలిపింది.

తద్వారా 14 రోజుల వరకు ఇండియాలో 71.08 కోట్ల రూపాయల నెట్.. 83.51 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్లు సాక్‌నిక్ వెల్లడించింది. ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో 78.41 రూపాయలు, కర్ణాటకలో 6.70 కోట్ల రూపాయలు, తమిళనాడులో 1.22 కోట్ల రూపాయలు, రెస్టాఫ్ ఇండియాలో కోటి 20 లక్షల రూపాయలకు పైగా వసూలు చేసింది. ఇక ఓవర్సీస్‌లో ఈ సినిమాకు 12.24 కోట్ల రూపాయలు వసూలైంది. భారత్‌లో వచ్చిన గ్రాస్ + ఓవర్సీస్ కలెక్షన్స్ కలిపి ఇప్పటి వరకు ఉస్తాద్ భగత్ సింగ్‌కు 14 రోజుల వరకు వరల్డ్ వైడ్‌గా 95.25 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టింది. రిలీజై రెండు వారాలు గడుస్తున్నా 100 కోట్ల రూపాయల గ్రాస్ మార్క్ అందుకోకపోవడం అభిమానులను సైతం ఆవేదనకు గురిచేసింది.

ఉస్తాద్ భగత్ సింగ్ ఓవర్సీస్ కలెక్షన్స్
ప్రీమియర్స్ + డే 1 కలెక్షన్స్‌తో నార్త్ అమెరికాలో ఉస్తాద్ దుమ్మురేపినప్పటికీ ఆ తర్వాత నెమ్మదిగా కలెక్షన్స్ కోల్పోయింది. నార్త్ అమెరికాలో 800కే డాలర్లు (భారత కరెన్సీలో 7.41 కోట్ల రూపాయలు) రాబట్టింది. నార్త్ అమెరికాలో ఈ సినిమా బ్రేక్ఈవెన్ కావాలంటే బాక్సాఫీస్ వద్ద 12.50 కోట్ల రూపాయలు రాబట్టాల్సి ఉండగా దాదాపు 6 కోట్ల రూపాయల నష్టాన్ని మిగిల్చింది. యూకే, ఐర్లాండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, గల్ఫ్ తదితర దేశాలలో కలిపి మొత్తంగా ఓవర్సీస్‌లో 12 కోట్లకు పైగా వసూలు చేసింది. ఓవరాల్‌గా ఓవర్సీస్‌లో బ్రేక్ఈవెన్ కావాలంటే 25 కోట్ల రూపాయలు రాబట్టాల్సి ఉండగా దాదాపు 13 కోట్ల నష్టాన్ని మిగిల్చింది.

తెలుగు రాష్ట్రాల్లో ఉస్తాద్ కలెక్షన్స్
14 రోజుల వరకు ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి నైజాంలో 27.50 కోట్ల రూపాయలు, సీడెడ్‌లో 11.25 కోట్ల రూపాయలు, ఉత్తరాంధ్రలో 10.40 కోట్ల రూపాయలు, ఈస్ట్ గోదావరిలో 8.15 కోట్ల రూపాయలు, వెస్ట్ గోదావరిలో 5.70 కోట్ల రూపాయలు, గుంటూరులో 6.65 కోట్ల రూపాయలు, కృష్ణాలో 6.35 కోట్ల రూపాయలు, నెల్లూరులో 2.85 కోట్ల రూపాయలు చొప్పున తెలుగు రాష్ట్రాల్లో 78.41 కోట్ల రూపాయల గ్రాస్.. 48.28 కోట్ల రూపాయల షేర్ వసూలైంది.

ఉస్తాద్ భగత్ సింగ్‌కి భారీ నష్టాలు
ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ నిన్నటితో 14 రోజుల థియేట్రికల్ రన్ పూర్తి చేసుకుంది. ఫస్ట్ వీకెండ్ మినహాయించి నాలుగో రోజు నుంచి ఉస్తాద్ భగత్ సింగ్ ఏమాత్రం ప్రభావం చూపలేకపోయాడు. మిక్స్‌డ్ టాక్‌కు తోడు, ధురంధర్ ప్రభావంతో పవన్ మూవీకి కలెక్షన్స్ పడిపోయాయి. ఏప్రిల్ 3 నుంచి కొత్త సినిమాలు విడుదల కానుండటంతో ఉస్తాద్‌ థియేట్రికల్ రన్ దాదాపు ముగిసినట్లేనని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇప్పటి వరకు అందుతున్న లెక్కల ప్రకారం ఉస్తాద్ భగత్ సింగ్ ఓవరాల్‌గా 47 శాతం మేర రికవరీ సాధించినట్లుగా విశ్లేషకులు చెబుతున్నారు. ఓవర్సీస్‌లో కేవలం 26 శాతం మాత్రమే రికవరీ సాధించి భారీ డిజాస్టర్‌గా నిలిచింది. 138 కోట్ల రూపాయల డిస్ట్రిబ్యూషన్ షేర్‌కు గాను కేవలం 57 కోట్ల రూపాయలు వసూలు చేసిన ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ నిర్మాతలకు దాదాపు 80 కోట్లకు పైగా నష్టాలను మిగిల్చి పవన్ కళ్యాణ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచింది. అయితే డిజిటల్ రైట్స్, శాటిలైట్ రైట్స్, ఆడియో రైట్స్, డబ్బింగ్ రైట్స్ ద్వారా నిర్మాత కొంత మేరకు సేఫ్ జోన్‌లోకి వచ్చి ఉండొచ్చని ట్రేడ్ పండితులు భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X