Ustaad Bhagat Singh Box Office: షాకింగ్‌గా ఉస్తాద్ భగత్ సింగ్ అడ్వాన్స్ బుకింగ్.. పవన్ మూవీకి ఎన్ని కోట్లంటే?
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సెన్సేషనల్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్. ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ ఈ సినిమాను అట్టహాసంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో శ్రీలీల, రాశీ ఖన్నా, గౌతమీ, చమ్మక్ చంద్ర, అశుతోష్ రాణా, నవాబ్ షా,నర్రా శ్రీను, నాగ మహేష్, చమ్మక్ చంద్ర, రెడిన్ కింగ్స్ లే, టెంపర్ వంశీ నటిస్తున్నారు.
ఈ సినిమాకు సంగీతాన్ని దేవీ శ్రీ ప్రసాద్ అందిస్తుండగా, ఎస్ థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చేస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫి: ఆయనంకా బోస్, ఎడిటర్: కార్తీక్ శ్రీనివాస్ వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా ఉగాది పండుగను పురస్కరించుకొని మార్చి 19వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ అవుతున్నది. ఈ క్రమంలో ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ రెస్పాన్స్ ఎలా ఉంది? ఇప్పటి వరకు ఎన్ని కోట్ల రూపాయలు కలెక్షన్లను ప్రీ బుకింగ్ ద్వారా వసూలు చేసిందనే వివరాల్లోకి వెళితే..

ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా అడ్వాన్స్ బుకింగ్ బుక్ మై షో, డిస్ట్రిక్ట్, తదితర యాప్‌లలో సోమవారం రాత్రి నుంచి ప్రారంభమయ్యాయి. ఈ ప్రీ బుకింగ్‌కు అనూహ్యమైన స్పందన లభిస్తున్నది. ఈ సినిమాకు సంబంధించిన టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. ఈ సినిమా తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక, తమిళనాడు, ఓవర్సీస్‌లో అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్లు ఇలా ఉన్నాయి.
పవన్ కల్యాణ్ మూవీకి సంబంధించి తాజా సమాచారం ప్రకారం.. తెలుగు రాష్ట్రాల్లో భారీగా బుకింగ్ జరుగుతున్నది. నైజాంలో సుమారుగా 1.75 కోట్ల రూపాయలు, ఆంధ్రప్రదేశ్‌లో 4.5 కోట్ల రూపాయలు వసూలు చేసింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఇంకా రెండు రోజుల సమయం ఉండటంతో ఇంకా భారీగా వసూళ్లు నమోదు అవుతాయని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.
ఇక తెలుగేతర రాష్ట్రాల విషయానికి వస్తే.. కర్ణాటకలో ఈ చిత్రం ఇప్పటి వరకు 50 లక్షల రూపాయలు, తమిళనాడులో 10 లక్షల రూపాయలు, ఇతర రాష్ట్రాల్లో 5 లక్షల రూపాయలు వసూలు చేసింది. ఇండియాలో ఈ చిత్రం ఇప్పటి వరకు సుమారుగా 7 కోట్ల రూపాయలు వసూలు చేసింది.
ఇదిలా ఉంటే,, ఓవర్సీస్‌లో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా అడ్వాన్స్ బుకింగ్ ఊపందుకొంటున్నది. నార్త్ అమెరికాలో 300K డాలర్లు అంటే.. 2.8 కోట్ల రూపాయలు, యూకే, ఆస్ట్రేలియా ఇతర దేశాల్లో 100K డాలర్లు అంటే 1 కోటి రూపాయలు మేర వసూళ్లను సాధించింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ సినిమా ఇప్పటి వరకు అడ్వాన్స్ బుకింగ్ ద్వారా 11 కోట్ల మేర వసూళ్లను రాబట్టింది అని ట్రేడ్ వర్గాల సమాచారం. అయితే గత చిత్రం ఓజీతో పోల్చుకొంటే తక్కువగానే ఉండటం గమనార్హం.
ఈ సినిమా బడ్జెట్ విషయానికి వస్తే.. పవన్ కల్యాణ్ రెమ్యునరేషన్ మినహాయించి ఈ చిత్రంలో నటీనటులు, సాంకేతిక నిపుణుల పారితోషికం, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి ఈ సినిమా బడ్జెట్ సుమారుగా 150 కోట్ల రూపాయల మేర అయింది. ఈ సినిమాను దాదాపు మైత్రీ మూవీ మేకర్స్ సొంతంగా, అలాగే కమిషన్ బేస్ మీద రిలీజ్ చేస్తున్నట్టు సమాచారం.


Click it and Unblock the Notifications

















