Ustaad Bhagat Singh Day 1 Collections: ఉస్తాద్ భగత్ సింగ్‌‌ కలెక్షన్స్.. పవన్ మూవీకి తొలిరోజు ఎన్ని కోట్లంటే?

హరీశ్ శంకర్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్. మార్చి 19న వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకొచ్చింది. గబ్బర్ సింగ్ తర్వాత దాదాపు 14 ఏళ్లకు హరీశ్ శంకర్- పవన్ కళ్యాణ్ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో చిత్ర పరిశ్రమలో భారీ అంచనాలు నెలకొన్నాయి. పవన్ గత చిత్రం ఓజీ బ్లాక్ బస్టర్ కావడంతో ఉస్తాద్ భగత్ సింగ్ కలెక్షన్స్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఉస్తాద్ భగత్ సింగ్ బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ఈవెన్ టార్గెట్ ఎంత? తొలిరోజు పవన్ కళ్యాణ్ మూవీ ఎన్ని కోట్ల రూపాయలు రాబట్టిందో పరిశీలిస్తే..

ఉస్తాద్ భగత్ సింగ్ బడ్జెట్ ఎంత?
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాతలు నవీన్ యెర్నెనీ, వై రవిశంకర్‌లు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో పవన్ సరసన రాశీ ఖన్నా, శ్రీలీలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. పార్ధిబన్, అశుతోష్ రాణా, నవాబ్ షా, గౌతమి, రాజీవ్ కనకాల, చమ్మక్ చంద్ర, పోసాని కృష్ణమురళి, రావు రమేశ్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూరుస్తుండగా.. థమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు. అయనంకా బోస్ సినిమాటోగ్రాఫర్‌గా, ఛోటా కే ప్రసాద్ ఎడిటర్‌గా వ్యవహరించారు

Ustaad Bhagat Singh Day 1 Expected Box Office Collections Worldwide Pawan kalyan s film good start at GBOC

ఉస్తాద్ భగత్ సింగ్ బడ్జెట్ అండ్ బిజినెస్
నటీనటులు, సాంకేతిక నిపుణుల పారితోషికం, ప్రొడక్షన్ కాస్ట్, ప్రమోషనల్ కార్యక్రమాలతో కలిపి ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి దాదాపు 150 కోట్ల రూపాయల బడ్జెట్ అయినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. భారీ హైప్‌కు తగినట్లుగానే ఉస్తాద్‌కు ఓ రేంజ్‌లో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. నైజాం థియేట్రికల్ రైట్స్ 50 కోట్ల రూపాయలు, ఆంధ్రా థియేట్రికల్ రైట్స్ 54 కోట్లు రూపాయలు, సీడెడ్‌ థియేట్రికల్ రైట్స్ 16 కోట్ల రూపాయలు, కర్ణాటక థియేట్రికల్ రైట్స్ 5 కోట్ల రూపాయలు, ఓవర్సీస్‌ థియేట్రికల్ రైట్స్ 12 కోట్ల రూపాయల మేర బిజినెస్ చేశాయి. దాంతో ఉస్తాద్ భగత్ సింగ్‌కు వరల్డ్ వైడ్‌గా దాదాపు 137 కోట్ల రూపాయల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది అని ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. దాంతో పవన్ కళ్యాణ్ మూవీ లాభాల్లోకి రావాలంటే బాక్సాఫీస్ వద్ద 140 కోట్ల రూపాయల షేర్.. 280 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టాల్సి ఉంటుంది విశ్లేషకులు విలువ కట్టారు.

ఉస్తాద్ భగత్ సింగ్ అడ్వాన్స్ బుకింగ్
ఉస్తాద్ భగత్ సింగ్‌కు అడ్వాన్స్ సేల్‌లో ఇండియాలో మొత్తం 4566షోలకు గాను 20.20 కోట్ల రూపాయలు వసూలైంది. అమెరికాలో 430 సెంటర్స్‌లో, 1117 షోలకు గాను, 12859 టికెట్లు అమ్ముడై 2,91,344 డాలర్లు ( 2.71 కోట్ల రూపాయలు) రాబట్టింది. మొత్తంగా నార్త్ అమెరికాలో ప్రీమియర్స్ అడ్వాన్స్ సేల్స్‌లో ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ.. 350K డాలర్లు (భారత కరెన్సీలో 3.26 కోట్ల రూపాయలు) వసూలు చేసింది. మొత్తంగా వరల్డ్ వైడ్‌గా ప్రీమియర్స్ + డే 1 అడ్వాన్స్ బుకింగ్ కింద ఉస్తాద్ భగత్ సింగ్ 28 కోట్ల రూపాయలు రాబట్టినట్లుగా విశ్లేషకులు చెబుతున్నారు.

ఉస్తాద్ భగత్ సింగ్ తొలి రోజు కలెక్షన్స్
ధురంధర్ 2 మూవీ నుంచి గట్టి పోటీ ఎదురవుతున్నప్పటికీ ఉస్తాద్ భగత్ సింగ్ మెరుగైన బుకింగ్స్ రాబడుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఉగాదితో పాటు లాంగ్ వీకెండ్ రావడంతో ఉస్తాద్‌కు కలిసొస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. తొలిరోజు పవన్ కళ్యాణ్ మూవీకి ఇండియాలో మధ్యాహ్నం 2 గంటల వరకు 2064 షోలు ప్రదర్శితమై.. 60.7 శాతం ఆక్యూపెన్సీ నమోదైనట్లుగా సాక్‌నిక్ నివేదించింది. ఇప్పటి వరకు హైదరాబాద్‌లో 754 షోలు, బెంగళూరులో 388 షోలు, విశాఖపట్నంలో 317 షోలు, విజయవాడలో 219 షోలు, గుంటూరులో 94 షోలు చొప్పున ప్రదర్శితమైనట్లుగా సాక్‌నిక్ పేర్కొంది.

తొలిరోజు వసూళ్ల అంచనా
కడపటి వార్తలు అందేసరికి ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి ఇండియాలో తొలిరోజున 13 కోట్ల రూపాయల నెట్ వసూళ్లు వచ్చాయి. పవన్ కళ్యాణ్ మూవీకి తొలిరోజున తెలుగు రాష్ట్రాలలో 35 కోట్ల రూపాయలు, కర్ణాటక‌లో 5 కోట్ల రూపాయలు, రెస్టాఫ్ ఇండియాలో 3 కోట్ల రూపాయలు, ఓవర్సీస్‌లో 15 కోట్ల రూపాయలు చొప్పున తొలిరోజు ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి వరల్డ్ వైడ్‌గా 60 కోట్ల రూపాయల రేంజ్‌లో ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X