Ustaad Bhagat Singh Day 10 Collections: భారీ నష్టాల్లో ఉస్తాద్‌ భగత్ సింగ్.. పవన్ మూవీకి 10వ రోజు ఎంతంటే?

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నెనీ, వై రవిశంకర్‌ నిర్మించగా హరీశ్ శంకర్ దర్శకత్వం వహించారు. శ్రీలీల, రాశీ ఖన్నాలు హీరోయిన్లుగా నటించగా.. పార్ధిబన్, అశుతోష్ రాణా, నవాబ్ షా, గౌతమి, రాజీవ్ కనకాల, చమ్మక్ చంద్ర, పోసాని కృష్ణమురళి, రావు రమేశ్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించగా... థమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించారు. అయనంకా బోస్ సినిమాటోగ్రాఫర్‌గా, ఛోటా కే ప్రసాద్ ఎడిటర్‌గా వ్యవహరించారు. మార్చి 19న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ మూవీ బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ఈవెన్ టార్గెట్ ఎంత? 10వ రోజు ఈ సినిమా ఎన్ని కోట్లు రాబట్టిందో పరిశీలిస్తే..

ఉస్తాద్ భగత్ సింగ్ బడ్జెట్
ఉస్తాద్ భగత్ సింగ్ బడ్జెట్ నటీనటులు, సాంకేతిక నిపుణుల పారితోషికం, ప్రొడక్షన్ కాస్ట్, ప్రమోషనల్ కార్యక్రమాలతో కలిపి ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి దాదాపు 150 కోట్ల రూపాయల బడ్జెట్ అయినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. భారీ హైప్‌కు తగినట్లుగానే ఉస్తాద్‌కు ఓ రేంజ్‌లో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. నైజాం థియేట్రికల్ రైట్స్ 50 కోట్ల రూపాయలు, ఆంధ్రా థియేట్రికల్ రైట్స్ 54 కోట్లు రూపాయలు, సీడెడ్‌ థియేట్రికల్ రైట్స్ 16 కోట్ల రూపాయలు చొప్పున 120 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ చేశాడు ఉస్తాద్.

Ustaad Bhagat Singh Day 10 Expected Box Office Collections Worldwide Pawan Kalyan s film struggling to recover its investment

తెలుగేతర రాష్ట్రాల విషయానికి వస్తే.. కర్ణాటక థియేట్రికల్ రైట్స్ 5 కోట్ల రూపాయలు, ఓవర్సీస్‌ థియేట్రికల్ రైట్స్ 12 కోట్ల రూపాయల మేర బిజినెస్ చేశాయి. దాంతో ఉస్తాద్ భగత్ సింగ్‌కు వరల్డ్ వైడ్‌గా దాదాపు 137 కోట్ల రూపాయల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది అని ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే బాక్సాఫీస్ వద్ద 138 కోట్ల రూపాయల షేర్, 276 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాల్సి ఉంది.

ఉస్తాద్ భగత్ సింగ్ కలెక్షన్స్
ఉస్తాద్ భగత్ సింగ్‌కు తొలిరోజున ఇండియాలో 34.75 కోట్ల రూపాయలు, రెండో రోజున 9.00 కోట్ల రూపాయలు, మూడో రోజున 9.10 కోట్ల రూపాయలు, నాలుగో రోజున 7.50 కోట్ల రూపాయలు, ఐదో రోజున 2.50 కోట్ల రూపాయలు, ఆరో రోజున 1.75 కోట్ల రూపాయలు, ఏడో రోజున 1.35 కోట్ల రూపాయలు, ఎనిమిదో రోజున కోటి రూపాయలు, తొమ్మిదో రోజున 1.10 కోట్ల రూపాయలు వసూలు చేసింది. తద్వారా 9 రోజుల వరకు ఇండియాలో 68.13 కోట్ల రూపాయల నెట్.. 80.11 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్లు సాక్‌నిక్ వెల్లడించింది. రోజుల వరకు తెలుగు రాష్ట్రాల్లో 71.73 కోట్ల రూపాయలు, కర్ణాటకలో 6.35 కోట్ల రూపాయలు, తమిళనాడులో 94 లక్షల రూపాయలు, రెస్టాఫ్ ఇండియాలో 1.25 కోట్ల రూపాయలు వసూలు చేసింది ఈ చిత్రం.

ఉస్తాద్ భగత్ సింగ్ ఓవర్సీస్ కలెక్షన్స్
ఉస్తాద్ భగత్ సింగ్‌కు నార్త్ అమెరికాలో శుక్రవారం వరకు 785k డాలర్లు (7.44 కోట్ల రూపాయలు) వసూలు చేసింది. యూఏఈ, యూకే, ఆస్ట్రేలియా తదితర దేశాలలో ఇప్పటి వరకు 500K డాలర్లు (4.74 కోట్ల రూపాయలు) రాబట్టింది. తద్వారా ఓవరాల్‌గా ఓవర్సీస్‌లో ఉస్తాద్ భగత్ సింగ్‌కు ఇప్పటి వరకు 12 కోట్ల రూపాయలు వసూలైంది. భారత్‌లో వచ్చిన గ్రాస్ + ఓవర్సీస్ కలెక్షన్స్ కలిపి 9 రోజుల వరకు ఉస్తాద్ భగత్ సింగ్‌కు వరల్డ్ వైడ్‌గా 92 కోట్ల రూపాయలు వసూలైనట్లు ట్రేడ్ పండితులు చెబుతున్నారు.

ఉస్తాద్ భగత్ సింగ్ తెలుగు రాష్ట్రాల కలెక్షన్స్
ఉత్తరాంధ్రలో 11.50 కోట్ల రూపాయలు, ఈస్ట్ గోదావరిలో 8.50 కోట్ల రూపాయలు, వెస్ట్ గోదావరిలో 5.90 కోట్ల రూపాయలు, కృష్ణాలో 5.60 కోట్ల రూపాయలు, గుంటూరులో 6.50 కోట్ల రూపాయలు, నెల్లూరులో 2.50 కోట్ల రూపాయలు, సీడెడ్‌లో 11.50 కోట్ల రూపాయలు, నైజాంలో25.32 కోట్ల రూపాయలు వసూలు చేసింది.

ఉస్తాద్ భగత్ సింగ్ 10వ రోజు వసూళ్ల అంచనా
ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ ఫెస్టివల్ సీజన్‌‌ను, వీకెండ్‌ను కూడా ఉపయోగించుకోలేకపోతోంది. శ్రీరామనవమి నాడు కేవలం కోటి 20 లక్షల రూపాయల గ్రాస్ మాత్రమే వసూలు చేయగలిగింది. దాంతో ఈ వీకెండ్ తర్వాత సినిమా పరిస్ధితి ఏంటీ? అంటూ అభిమానులు చర్చించుకుంటున్నారు. 10వ రోజు మధ్యాహ్నం 2 గంటల వరకు భారత్‌లో 493 షోలు ప్రదర్శితమై.. 17 శాతం మేర థియేట్రికల్ ఆక్యూపెన్సీ నమోదు చేసినట్లు సాక్‌నిక్ పేర్కొంది. కడపటి సమాచారం అందేసరికి ఉస్తాద్ భగత్ సింగ్‌కు ఇండియాలో కేవలం 12 లక్షల రూపాయల నెట్ మాత్రమే వసూలైంది. ఈ సినిమా 10వ రోజు తెలుగు రాష్ట్రాల్లో కోటి రూపాయలు, రెస్టాఫ్ ఇండియా + ఓవర్సీస్ కలెక్షన్స్ కలిపి 50 లక్షల రూపాయల చొప్పున వరల్డ్ వైడ్‌గా కోటి 50 లక్షల రూపాయలు రాబడుతుందని అంచనా వేస్తున్నారు.

ఉస్తాద్ భగత్ సింగ్ ఓవర్సీస్‌లో డిజాస్టర్‌గా నిలిచింది. నార్త్ అమెరికాలో 21.81 కోట్ల రూపాయల బ్రేక్ఈవెన్ టార్గెట్‌కు గాను కేవలం 800K డాలర్లు (7.58 కోట్ల రూపాయలు) మాత్రమే రాబట్టింది. ఓవరాల్‌గా ఓవర్సీస్ నుంచి 12 కోట్ల రూపాయలు రాబట్టి.. 40 శాతం మాత్రమే రికవరి సాధించి డిజాస్టర్‌గా నిలిచింది. మొత్తంగా ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ లాభాల్లోకి రావాలంటే 80 కోట్ల రూపాయల షేర్ రాబట్టాల్సి ఉంది. అయితే ప్రస్తుత ట్రెండ్‌ను బట్టి చూస్తే ఇది ఈజీ కాదని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X