Ustaad Bhagat Singh Day 11 Collections: ఉస్తాద్‌కు 100 కోట్లు కష్టమేనా? పవన్ మూవీకి 11వ రోజు ఎంతంటే?

హరీశ్ శంకర్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన మూవీ ఉస్తాద్ భగత్ సింగ్. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నెనీ, వై రవిశంకర్‌ నిర్మించారు. శ్రీలీల, రాశీ ఖన్నాలు హీరోయిన్లుగా నటించగా.. పార్ధిబన్, అశుతోష్ రాణా, నవాబ్ షా, గౌతమి, రాజీవ్ కనకాల, చమ్మక్ చంద్ర, పోసాని కృష్ణమురళి, రావు రమేశ్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించగా... థమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించారు. అయనంకా బోస్ సినిమాటోగ్రాఫర్‌గా, ఛోటా కే ప్రసాద్ ఎడిటర్‌గా వ్యవహరించారు. మార్చి 19న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ మూవీ బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? 10వ రోజు ఈ సినిమా ఎన్ని కోట్లు రాబట్టింది? ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ లాభాల్లోకి రావాలంటే ఎన్ని కోట్లు రావాలో పరిశీలిస్తే..

Also Read
NBK 111: నయనతార ఔట్.. బాలయ్యకు జోడీగా ఆ యంగ్ హీరోయిన్‌?
NBK 111: నయనతార ఔట్.. బాలయ్యకు జోడీగా ఆ యంగ్ హీరోయిన్‌?

ఉస్తాద్ భగత్ సింగ్ బడ్జెట్
ఉస్తాద్ భగత్ సింగ్ బడ్జెట్ నటీనటులు, సాంకేతిక నిపుణుల పారితోషికం, ప్రొడక్షన్ కాస్ట్, ప్రమోషనల్ కార్యక్రమాలతో కలిపి ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి దాదాపు 150 కోట్ల రూపాయల బడ్జెట్ అయినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. భారీ హైప్‌కు తగినట్లుగానే ఉస్తాద్‌కు ఓ రేంజ్‌లో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. నైజాం థియేట్రికల్ రైట్స్ 50 కోట్ల రూపాయలు, ఆంధ్రా థియేట్రికల్ రైట్స్ 54 కోట్లు రూపాయలు, సీడెడ్‌ థియేట్రికల్ రైట్స్ 16 కోట్ల రూపాయలు చొప్పున 120 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ చేశాడు ఉస్తాద్.

Ustaad Bhagat Singh Day 11 Expected Box Office Collections Worldwide Pawan Kalyan s film saw a significant slowdown

తెలుగేతర రాష్ట్రాల విషయానికి వస్తే.. కర్ణాటక థియేట్రికల్ రైట్స్ 5 కోట్ల రూపాయలు, ఓవర్సీస్‌ థియేట్రికల్ రైట్స్ 12 కోట్ల రూపాయల మేర బిజినెస్ చేశాయి. దాంతో ఉస్తాద్ భగత్ సింగ్‌కు వరల్డ్ వైడ్‌గా దాదాపు 137 కోట్ల రూపాయల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది అని ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే బాక్సాఫీస్ వద్ద 138 కోట్ల రూపాయల షేర్, 276 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాల్సి ఉంది.

Recommended For You
సల్మాన్ ఖాన్‌కు జోడీగా ఆ స్టార్ హీరోయిన్? క్రేజీ కాంబోతో దిల్‌రాజు మాస్టర్ ప్లాన్!
సల్మాన్ ఖాన్‌కు జోడీగా ఆ స్టార్ హీరోయిన్? క్రేజీ కాంబోతో దిల్‌రాజు మాస్టర్ ప్లాన్!

ఉస్తాద్ భగత్ సింగ్ కలెక్షన్స్
ఉస్తాద్ భగత్ సింగ్‌కు తొలిరోజున ఇండియాలో 34.75 కోట్ల రూపాయలు, రెండో రోజున 9.00 కోట్ల రూపాయలు, మూడో రోజున 9.10 కోట్ల రూపాయలు, నాలుగో రోజున 7.50 కోట్ల రూపాయలు, ఐదో రోజున 2.50 కోట్ల రూపాయలు, ఆరో రోజున 1.75 కోట్ల రూపాయలు, ఏడో రోజున 1.35 కోట్ల రూపాయలు, ఎనిమిదో రోజున కోటి రూపాయలు, తొమ్మిదో రోజున 1.10 కోట్ల రూపాయలు, పదో రోజున 86 లక్షల రూపాయలు వసూలు చేసింది. తద్వారా 10 రోజుల వరకు ఇండియాలో 69.12 కోట్ల రూపాయల నెట్.. 81.26 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్లు సాక్‌నిక్ వెల్లడించింది. ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో 72.63 కోట్ల రూపాయలు, కర్ణాటకలో 6.43 కోట్ల రూపాయలు, తమిళనాడులో 94 లక్షల రూపాయలు, రెస్టాఫ్ ఇండియాలో 1.28 కోట్ల రూపాయలు వసూలు చేసింది ఈ చిత్రం.

You May Also Like
Ustaad Bhagat Singh Day 10 Collections: భారీ నష్టాల్లో ఉస్తాద్‌ భగత్ సింగ్.. పవన్ మూవీకి 10వ రోజు ఎంతంటే?
Ustaad Bhagat Singh Day 10 Collections: భారీ నష్టాల్లో ఉస్తాద్‌ భగత్ సింగ్.. పవన్ మూవీకి 10వ రోజు ఎంతంటే?

ఉస్తాద్ భగత్ సింగ్ ఓవర్సీస్ కలెక్షన్స్
ఓవర్సీస్‌లో ఉస్తాద్ భగత్ సింగ్ కలెక్షన్స్ దారుణంగా పడిపోయాయి. నార్త్ అమెరికాలో పదో రోజున కేవలం 5 లక్షల రూపాయలు మాత్రమే వసూలు చేసింది. యూకే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యూఏఈ తదితర దేశాలలో కలిపి ఇప్పటి వరకు ఉస్తాద్ భగత్ సింగ్ ఓవర్సీస్‌లో 12 కోట్ల రూపాయలు రాబట్టింది. భారత్‌లో వచ్చిన గ్రాస్ + ఓవర్సీస్ కలెక్షన్స్ కలిపి ఉస్తాద్ భగత్ సింగ్ ఇప్పటి వరకు 93 కోట్ల రూపాయలు మాత్రమే వసూలు చేసింది ఈ చిత్రం.

Dhurandhar 2 AP TG Collections: 100 కోట్ల దిశగా ధురంధర్ 2.. ఆంధ్రా, నైజాంలలో రణ్‌వీర్ మూవీకి ఎన్ని కోట్లంటే?
Dhurandhar 2 AP TG Collections: 100 కోట్ల దిశగా ధురంధర్ 2.. ఆంధ్రా, నైజాంలలో రణ్‌వీర్ మూవీకి ఎన్ని కోట్లంటే?

ఉస్తాద్ భగత్ సింగ్ తెలుగు రాష్ట్రాల కలెక్షన్స్
ఉస్తాద్ భగత్ సింగ్‌కు ఇప్పటి వరకు నైజాంలో 15.85 కోట్ల రూపాయలు, సీడెడ్‌లో 6.95 కోట్ల రూపాయలు, విశాఖలో 6.50 కోట్ల రూపాయలు, ఈస్ట్ గోదావరిలో 5.05 కోట్ల రూపాయలు, వెస్ట్ గోదావరిలో 3.55 కోట్ల రూపాయలు, గుంటూరులో 4.10 కోట్ల రూపాయలు, కృష్ణాలో 3.90 కోట్ల రూపాయలు, నెల్లూరులో 1.75 కోట్ల రూపాయల చొప్పున తెలుగు రాష్ట్రాల్లో 47.65 కోట్ల రూపాయల షేర్ రాబట్టినట్లు ట్రేడ్ పండితులు చెబుతున్నారు.

Hema: స్టార్ హీరో కొడుకుతో కూతురి పెళ్లి.. క్లారిటీ ఇచ్చిన నటి హేమ..
Hema: స్టార్ హీరో కొడుకుతో కూతురి పెళ్లి.. క్లారిటీ ఇచ్చిన నటి హేమ..

ఉస్తాద్ భగత్ సింగ్ 11వ రోజు వసూళ్ల అంచనా
విడుదలై దాదాపు 10 రోజులు కావొస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ ఇప్పటి వరకు 100 కోట్ల రూపాయల కలెక్ట్ చేయకపోవడం సినీవర్గాలను, అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. 100 కోట్ల రూపాయల క్లబ్‌లో చేరడానికి ఉస్తాద్ భగత్ సింగ్‌ మరో 7 కోట్ల రూపాయల దూరంలో ఉన్నాడు. ఈ రోజు వీకెండ్ కావడంతో మెరుగైన వసూళ్లు సాధించడానికి ఇదే పవన్‌కి చివరి ఆదివారంగా విశ్లేషకులు చెబుతున్నారు.

పెళ్లయి పిల్లలున్న హీరోతో ఎఫైర్... సుఖం మోజులో బతుకు నాశనం.. ఆ హీరోయిన్ ఎవరంటే?
పెళ్లయి పిల్లలున్న హీరోతో ఎఫైర్... సుఖం మోజులో బతుకు నాశనం.. ఆ హీరోయిన్ ఎవరంటే?

11వ రోజు ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి మధ్యాహ్నం 2 గంటల వరకు ఇండియాలో 503 షోలకు గాను 19 శాతం మేర థియేట్రికల్ ఆక్యూపెన్సీ నమోదైనట్లు సాక్‌నిక్ నివేదించింది. కడపటి వార్తలు అందేసరికి పవన్ కళ్యాణ్ మూవీకి 21 లక్షల రూపాయల నికర వసూళ్లు వచ్చాయి. ఫస్ట్ షో, సెకండ్ షోలకు ఆక్యూపెన్సీ పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. 11వ రోజు ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి తెలుగు రాష్ట్రాల్లో కోటి రూపాయలు, రెస్టాఫ్ ఇండియా + ఓవర్సీస్ కలెక్షన్స్ కలిపి 50 లక్షల రూపాయల చొప్పున వరల్డ్ వైడ్‌గా కోటి 50 లక్షల రూపాయలు రాబడుతుందని అంచనా వేస్తున్నారు.

ఫ్లాపులతో ఐరన్‌లెగ్‌గా... కట్ చేస్తే 12 వేల కోట్ల ఆస్తికి అధిపతిగా, ఆ హీరోయిన్ ఎవరంటే?
ఫ్లాపులతో ఐరన్‌లెగ్‌గా... కట్ చేస్తే 12 వేల కోట్ల ఆస్తికి అధిపతిగా, ఆ హీరోయిన్ ఎవరంటే?

ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ లాభాల్లోకి రావాలంటే బాక్సాఫీస్ వద్ద 138 కోట్ల రూపాయల షేర్ రాబట్టాల్సి ఉండగా.. ఇప్పటి వరకు కేవలం 54 కోట్ల రూపాయలు మాత్రమే వసూలు చేసింది. ఈ సినిమా బ్రేక్ఈవెన్ కావాలంటే బాక్సాఫీస్ వద్ద 84 కోట్ల రూపాయల షేర్ రాబట్టాల్సి ఉంది. ప్రస్తుత పరిస్ధితులు చూస్తుంటే ఇది అసాధ్యంగానే కనిపిస్తోంది. మరి థియేట్రికల్ రన్ ముగిసేసరికి ఉస్తాద్ భగత్ సింగ్ ఎన్ని కోట్లు రాబడుతుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X