Ustaad Bhagat Singh Day 12 Collections: దారుణంగా పడిపోయిన ఉస్తాద్ కలెక్షన్స్.. పవన్ మూవీ హిట్ కావాలంటే?

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నెనీ, వై రవిశంకర్‌ నిర్మించిన చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్. పవన్ కళ్యాణ్ హీరో కాగా.. శ్రీలీల, రాశీ ఖన్నాలు హీరోయిన్లుగా నటించగా హరీశ్ శంకర్ దర్శకత్వం వహించారు. 11 రోజులు కావొస్తున్నా ఇప్పటి వరకు ఉస్తాద్ భగత్ సింగ్‌ 100 కోట్ల రూపాయలు కలెక్ట్ చేయకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఈ సినిమా రికవరీ సాధించడం అంత ఆషామాషీ కాదని చెబుతున్నారు విశ్లేషకులు. ఈ నేపథ్యంలో 12వ రోజు ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి వసూళ్లు ఎంత అనేది పరిశీలిస్తే..

పార్ధిబన్, అశుతోష్ రాణా, నవాబ్ షా, గౌతమి, రాజీవ్ కనకాల, చమ్మక్ చంద్ర, పోసాని కృష్ణమురళి, రావు రమేశ్ తదితరులు ఈ చిత్రంలో కీలకపాత్రలు పోషించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించగా... థమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించారు. అయనంకా బోస్ సినిమాటోగ్రాఫర్‌గా, ఛోటా కే ప్రసాద్ ఎడిటర్‌గా వ్యవహరించారు. మార్చి 19న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకొచ్చింది.

Ustaad Bhagat Singh Day 12 Expected Box Office Collections Worldwide Pawan Kalyan s film difficult to reach break-even

ఉస్తాద్ భగత్ సింగ్ బడ్జెట్
ఉస్తాద్ భగత్ సింగ్ బడ్జెట్ నటీనటులు, సాంకేతిక నిపుణుల పారితోషికం, ప్రొడక్షన్ కాస్ట్, ప్రమోషనల్ కార్యక్రమాలతో కలిపి ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి దాదాపు 150 కోట్ల రూపాయల బడ్జెట్ అయినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. భారీ హైప్‌కు తగినట్లుగానే ఉస్తాద్‌కు ఓ రేంజ్‌లో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. నైజాం థియేట్రికల్ రైట్స్ 50 కోట్ల రూపాయలు, ఆంధ్రా థియేట్రికల్ రైట్స్ 54 కోట్లు రూపాయలు, సీడెడ్‌ థియేట్రికల్ రైట్స్ 16 కోట్ల రూపాయలు చొప్పున 120 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ చేశాడు ఉస్తాద్.

తెలుగేతర రాష్ట్రాల విషయానికి వస్తే.. కర్ణాటక థియేట్రికల్ రైట్స్ 5 కోట్ల రూపాయలు, ఓవర్సీస్‌ థియేట్రికల్ రైట్స్ 12 కోట్ల రూపాయల మేర బిజినెస్ చేశాయి. దాంతో ఉస్తాద్ భగత్ సింగ్‌కు వరల్డ్ వైడ్‌గా దాదాపు 137 కోట్ల రూపాయల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది అని ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే బాక్సాఫీస్ వద్ద 138 కోట్ల రూపాయల షేర్, 276 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాల్సి ఉంది.

ఉస్తాద్ భగత్ సింగ్ కలెక్షన్స్
ఉస్తాద్ భగత్ సింగ్‌కు తొలిరోజున ఇండియాలో 34.75 కోట్ల రూపాయలు, రెండో రోజున 9.00 కోట్ల రూపాయలు, మూడో రోజున 9.10 కోట్ల రూపాయలు, నాలుగో రోజున 7.50 కోట్ల రూపాయలు, ఐదో రోజున 2.50 కోట్ల రూపాయలు, ఆరో రోజున 1.75 కోట్ల రూపాయలు, ఏడో రోజున 1.35 కోట్ల రూపాయలు, ఎనిమిదో రోజున కోటి రూపాయలు, తొమ్మిదో రోజున 1.10 కోట్ల రూపాయలు, పదో రోజున 86 లక్షల రూపాయలు, పదకొండో రోజున 1.03 కోట్ల రూపాయలు వసూలు చేసింది. తద్వారా 11 రోజుల వరకు ఇండియాలో 70 కోట్ల రూపాయల నెట్.. 82.27 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్లు సాక్‌నిక్ వెల్లడించింది.

ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో 73.22 కోట్ల రూపాయలు, కర్ణాటకలో 6.50 కోట్ల రూపాయలు, తమిళనాడులో 1.15 కోట్ల రూపాయలు, రెస్టాఫ్ ఇండియాలో 79 లక్షల రూపాయలు వసూలు చేసింది. ఉస్తాద్ భగత్ సింగ్‌కు ఓవర్సీస్‌లో ఇప్పటి వరకు 12.11 కోట్ల రూపాయలు వసూలైంది. దాంతో ఇండియాలో వచ్చిన గ్రాస్ + ఓవర్సీస్ కలెక్షన్స్ కలిపి ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ మూవీకి వరల్డ్ వైడ్‌గా 94 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టింది.

ఉస్తాద్ భగత్ సింగ్ 12వ రోజు వసూళ్ల అంచనా
వీకెండ్ వరకు ఏదోలా బండి నెట్టుకొచ్చిన ఉస్తాద్ భగత్ సింగ్‌కు సోమవారం నుంచి గట్టి పరీక్ష ఎదురుకానుంది. వర్కింగ్ డేస్ మొదలవుతుండటంతో పాటు ధురంధర్ 2 నుంచి పోటీ నేపథ్యంలో ఉస్తాద్ థియేట్రికల్ రన్‌పై గట్టి ప్రభావం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. 12వ రోజు ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి మధ్యాహ్నం 3 గంటల వరకు ఇండియాలో 487 షోలకు గాను 15 శాతం మేర థియేట్రికల్ ఆక్యూపెన్సీ నమోదైనట్లు సాక్‌నిక్ నివేదించింది. కడపటి వార్తలు అందేసరికి పవన్ కళ్యాణ్ మూవీకి కేవలం 6 లక్షల రూపాయల నికర వసూళ్లు వచ్చాయి. 11వ రోజు ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి వరల్డ్ వైడ్‌గా కోటి రూపాయల కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ ఇప్పటి వరకు థియేట్రికల్ షేర్ పరంగా కేవలం 42 శాతం మాత్రమే రికవరీ సాధించింది. పరిస్ధితులు చూస్తుంటే ఈ సినిమా పవన్ కళ్యాణ్ కెరీర్‌లో బిగ్గెస్ట్ డిజాస్టర్ అయ్యేలా కనిపిస్తోంది. ఉస్తాద్ లాభాల్లోకి రావాలంటే 83 కోట్ల రూపాయల షేర్ రాబట్టాల్సి ఉంది. ఇప్పుడున్న పరిస్ధితుల్లో ఈ టార్గెట్ చేరుకోవడం అసాధ్యంగానే అనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X